ఇంగ్లండ్ తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే.. మార్పులివే..

ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో గెలిచి టీమిండియా ఉత్సాహంతో ఉంది. ఇదే ఊపులో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే చివరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్టులకు ఉన్న జట్టునే బీసీసీఐ ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్ జట్టులోకి రాగా..టీంలో ఉన్న యువ పేసర్ శార్దుల్ ఠాకూర్ ను విజయ్ హాజరే ట్రోఫీ కోసం బీసీసీఐ విడుదల […]

Written By: NARESH, Updated On : February 17, 2021 6:27 pm
Follow us on

ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో గెలిచి టీమిండియా ఉత్సాహంతో ఉంది. ఇదే ఊపులో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే చివరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్టులకు ఉన్న జట్టునే బీసీసీఐ ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్ జట్టులోకి రాగా..టీంలో ఉన్న యువ పేసర్ శార్దుల్ ఠాకూర్ ను విజయ్ హాజరే ట్రోఫీ కోసం బీసీసీఐ విడుదల చేసింది. ఫిట్ నెస్ టెస్ట్ తర్వాత ఉమేశ్ యాదవ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది.

ఇక ఆస్ట్రేలియాలో గాయపడ్డ ఏస్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి వస్తాడని అందరూ ఊహించినా అతడు ఇంకా పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించలేదని తేలింది. దీంతో టీమిండియా సెలెక్షన్ కమిటీ ఇద్దరు స్టాండ్ బై ఆటగాళ్లతో పాటు ఐదుగురిని నెట్ బౌలర్స్ గా ఎంపిక చేసింది.

కేఎస్ భరత్, రాహుల్ చాహర్ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఉండగా.. కొత్తగా అంకిత్ రాజ్ పుత్, ఆవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణమ్మ గౌతమ్, సౌరభ్ కుమార్ లను నెట్ బౌలర్స్ గా తీసుకున్నారు.

ఇక స్టాండ్ బై ప్లేయర్ గా జట్టుతో ఉండి తొలి టెస్టులో ఆడిన స్పిన్నర్ నదీమ్ ను ఎంపిక చేయకపోవడం విశేషం. ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.