‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ అనే సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది. వెంకీకి ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నా.. . ఆ సినిమాల అన్నిటిలో కల్లా ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. అంతగా ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో ఒక మైలు స్టోన్ అనిపించుకుంది. ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ టీవీల్లో ఈ మూవీ వస్తే చాలు, మంచి టిఆర్పీ రేటింగ్ వచ్చేస్తోంది.
Also Read: బాలయ్యకు కథ చెప్పిన ‘క్రాక్’ డైరెక్టర్ !
అయితే ఈ సినిమా హీరోయిన్ గా అందాల తార సౌందర్య నటించారు. మరో హీరోయిన్ గా నేపాలీ అమ్మాయి పాత్రలో వినీత నటించిన సంగతి తెలిసిందే. అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకున్న వినీత టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించలేక చివరకు సినిమాలకు దూరం అయింది. దాంతో తెలుగులో వినీత ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. అయితే, ఇతర భాషల్లో చాలా సినిమాలే చేసింది అనుకోండి. కానీ ఆమె కెరీర్ లో వెంకీతో చేసిన ఈ సినిమానే స్పెషల్ ఫిల్మ్ అట.
Also Read: ట్రైలర్ టాక్ : ‘నాంది’తోనే జీవితం మొదలైంది !
అయితే వినీత వెంకీతో సినిమా తరువాత పెళ్లి చేసుకుని పూర్తిగా మారిపోయింది. చాలా కాలాం తర్వత ఇటీవల ఆమె ఓ కార్యక్రమంలో మీడియా కంటపడింది. మొదట ఆమెను చూసి అసలు ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఎవ్వరు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వినీతను చూసిన అందరూ షాక్ కి గురి అయ్యారట. ఈ సందర్భంగా తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ మంచి పాత్రలు దక్కితే తప్పకుండా చేస్తా అని చెప్పుకొచ్చింది వినీత. ఏది ఏమైనా సన్నగా నాజూకుగా ఉండే వినీత ఇలా లావుగా మారిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్