https://oktelugu.com/

మద్యం తాగేవాళ్లకు భారీ షాక్.. డీఎన్ఏలో విపరీతమైన మార్పులు..?

దేశంలో కోట్ల సంఖ్యలో మద్యం ప్రియులు ప్రతిరోజూ పరిమితికి మించి మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మద్యం తాగుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మద్యం తాగితే ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు డీ.ఎన్.ఏలో కూడా కీలక మార్పులు వస్తాయని డీ.ఎన్.ఏలో వచ్చే మార్పుల వల్ల ఇబ్బందుల పడక తప్పదని సూచిస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. Also Read: మునగకాయలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 15, 2021 / 03:22 PM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో మద్యం ప్రియులు ప్రతిరోజూ పరిమితికి మించి మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మద్యం తాగుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మద్యం తాగితే ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు డీ.ఎన్.ఏలో కూడా కీలక మార్పులు వస్తాయని డీ.ఎన్.ఏలో వచ్చే మార్పుల వల్ల ఇబ్బందుల పడక తప్పదని సూచిస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.

    Also Read: మునగకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    ఎవరైతే మితిమీరి మద్యం తాగుతారో వారిలో ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ తలెత్తే అవకాశం ఉంటుంది. పరిమితికి మించి మద్యం సేవించేవారు అలవాట్లలో మార్పులు చేసుకుంటే మంచిది. ఇప్పటికే ఆల్కహాల్ యూజ్ డిజాస్టర్ బారిన పడి ఉన్నట్లయితే మద్యానికి పూర్తిగా దూరమైతే మాత్రమే మరణించే అవకాశాలు తగ్గుతాయి. 52 మంది పురుషులపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.

    Also Read: బట్టతలతో బాధ పడుతున్నారా.. అద్భుతమైన టెక్నిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..?

    ఎవరైతే ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ బారిన పడతారో వారి డీ.ఎన్.ఏలో మిథైల్ గ్రూప్స్ చేరే అవకాశం ఉంటుంది. మిథైల్ గ్రూప్స్ జన్యు క్రమాన్ని మార్చకపోయినా డీ.ఎన్.ఏలో మార్పులకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ బారిన పడితే మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 30 లక్షల మంది ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ వల్ల చనిపోతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    ఒక సర్వే ప్రకారం మన దేశంలో 15 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులలో 29 శాతం మంది మద్యం సేవిస్తారు. వీరిలో 41 శాతం మంది వారానికి ఒకసారి మద్యం పుచ్చుకుంటూ ఉండగా 12 శాతం మంది మాత్రం రోజూ మందు తాగుతారని తెలుస్తోంది.