HomeజాతీయంSiachen tour : చైనా, పాకిస్తాన్ బార్డర్ చూసే దమ్ముందా? సియాచిన్ అందాల పర్యటనకు ఆహ్వానం

Siachen tour : చైనా, పాకిస్తాన్ బార్డర్ చూసే దమ్ముందా? సియాచిన్ అందాల పర్యటనకు ఆహ్వానం

Siachen tour : భారత సరిహద్దు ప్రాంతం సియాచిన్‌. భారత్, పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతం. ఇక్కడికి వెళ్లడం నాలుగేళ్ల క్రితం వరకు అంత సులవు కాదు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితి మారింది. కశ్మీర్‌ అందాలను చూడడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులు ఇప్పుడు సియాచిన్‌ బేస్‌ క్యాంపును సందర్శించవచ్చని లడఖ్‌ పర్యాటక శాఖ ప్రకటించింది. అయితే దీని కోసం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
గతంలో లడఖ్ వరకే అనుమతి.. 
ఏటా కాశ్మీర్‌ మరియు లడఖ్‌ సందర్శనకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. కానీ కొంతమంది దానిని దాటి సియాచిన్‌ను సందర్శించాలని కూడా కోరుకుంటారు. ఇది ఇప్పటికీ సాధ్యం కాలేదు. సియాచిన్‌∙గ్లేసియర్‌ ప్రాంతం భారత సైన్యం ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఇక్కడకు వెళ్లడానికి ప్రత్యేక రకమైన అనుమతులు అవసరం. ఇది అందరికీ సులభంగా అందుబాటులో ఉండదు. అయితే ఇప్పుడు భారతీయ పర్యాటకులు ఎలాంటి ప్రత్యేక అనుమతి లేకుండా సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ సమీపంలో ప్రయాణించవచ్చని లడఖ్‌ పర్యాటక శాఖ ప్రకటించింది.
ప్రత్యేకత ఇదీ..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన హిమానీనదాలలో ఒకటిగా కాకుండా, సియాచిన్‌ భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య కొనసాగుతున్న సైనిక వివాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎతై ్తన యుద్ధభూమి కూడా. అదే సమయంలో, సియాచిన్‌ గ్లేసియర్‌ పర్యాటకుల సందర్శనార్థం కోసం తెరవబడుతుంది. అంతకుముందు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తత దృష్ట్యా, సియాచిన్‌లోని కొన్ని ప్రాంతాలను పర్యాటక సందర్శనార్థం మూసివేశారు.
ఎక్కడ ఉందో తెలుసా..

సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ హిమాలయాల తూర్పు కారాకోరం శ్రేణిలో సియాచిన్‌ గ్లేసియర్‌ బేస్‌ వద్ద ఉంది. 12,000 అడుగుల నుంచి 15,000 అడుగుల వరకు ఉన్న ప్రాంతం సాధారణ ప్రజలకు పర్యాటకం కోసం తెరవబడింది.

బేస్‌ క్యాంపు నిర్మాణం..
సైనిక చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల గౌరవార్థం సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ నిర్మించబడింది. ఇక్కడ ఒక యుద్ధ స్మారక చిహ్నం కూడా ఉంది. ఇది వారి త్యాగాలను గుర్తు చేస్తుంది. ఎంతో ఎత్తులో ఉంటూనే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేందుకు ఈ వీర జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఇపుపడు సామాన్య ప్రజల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తెరవబడింది. భారతీయ పర్యాటకులు ఇప్పుడు అధికారుల నుండి ఎటువంటి ప్రత్యేక అనుమతి లేకుండా సందర్శించవచ్చు. అయితే, ఈ పర్యాటకుల నుంచి జిల్లా యంత్రాంగం పర్యావరణ రుసుమును మాత్రం వసూలు చేస్తుంది. నుబ్రా వ్యాలీలో ఉన్న సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ సియాచిన్‌ టూర్‌ సమయంలో తప్పక సందర్శించాల్సిన అత్యంత ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
జాగ్రత్తలు తప్పనిసరి.. 
అయితే ఇక్కడికి వచ్చేటపుడు ప్రత్యేకంగా చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇక్కడి ఉష్ణోగ్రత. ఈ ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత – 60 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇక్కడికి రావడానికి ముందు, మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. వీలైనంత ఎక్కువ వెచ్చని బట్టలు ధరించడమే కాకుండా, తీసుకుని రావాలి.
ఇలా చేరుకోవాలి.. 
సియాచిన్‌ బేస్‌ లేహ్‌ నుంచి 215 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పనామిక్‌ నుంచి∙62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు లేహ్‌ నుంచి ఒక రోజులో సియాచిన్‌ బేస్‌ చేరుకోవచ్చు. లేహ్‌ నుంచి పనామిక్‌ వరకు ఆరు గంటల ప్రయాణం. పనామిక్‌ నుంచి నుబ్రా నదికి మూలమైన సియాచిన్‌ బేస్‌ చేరుకోవడానికి మరో రెండు గంటల సమయం పడుతుంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular