Homeఎంటర్టైన్మెంట్RRR vs Radheshyam: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్...

RRR vs Radheshyam: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

RRR vs Radheshyam:  బాహుబలితో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. అయితే అలా చేసింది ఎవరో కాదు రాజమౌళినే.. అలాంటి రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఈ జనవరి 7న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’తో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ రాజమౌళి సినిమా దెబ్బకు తలొగ్గి ఫిబ్రవరికి షిఫ్ట్ అయిపోయింది. రాజమౌళి కోరిక మేరకు పవన్ వెనక్కితగ్గాడు. అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ప్రభాస్ తన ‘రాధేశ్యామ్’ మూవీని సంక్రాంతి రేసులోంచి తీసివేయకపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. తనను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసిన రాజమౌళితోనే ప్రభాస్ ఢీకొంటుండడం ఇండస్ట్రీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

RRR vs Radheshyam
RRR vs Radheshyam

కరోనా సెకండ్ వేవ్ తగ్గినా టాలీవుడ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, బిజినెస్ కూడా అయిపోయిన సినిమాలను నిర్మాతలు విడుదల చేయడం లేదు. కరోనా థర్డ్ వేవ్ ప్రచారం , ఏపీలో ఫుల్ కెపాసిటీ తో థియేటర్లను అనుమతించకపోడంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుకొని టేబుల్ ప్రాఫిట్ చూసుకుంటున్నారు. టాలీవుడ్ బడా నిర్మాత సురేశ్ బాబు తన తమ్ముడు విక్టరీ వెంకటేశ్ తో నిర్మించిన నారప్ప, దృశ్యం సినిమాలను సైతం ఓటీటీలో రిలీజ్ చేశాడు. నేచురల్ స్టార్ నాని కూడా టక్ జగదీశ్ సినిమాను ఓటీటీకే ఇచ్చేశాడు. తమిళ స్టార్ హీరో సూర్య కూడా దీపావళిన జై భీమ్ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేశాడు.

కానీ యువరత్న బాలక్రష్ణ అఖండ సినిమా ఘన విజయంతో టాలీవుడ్ కు కొత్త ఊపు వచ్చింది. అదే సమయంలో పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం పెద్ద సినిమాలు రిలీజ్ కు క్యూ కట్టాయి. బన్నీ పుష్ప సినిమా ఇప్పటికే రిలీజై తన హవాను కొనసాగిస్తుండగా, నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ డేట్ ను కన్ ఫాం చేసుకుంది. ప్రమోషన్ ను కూడా స్టార్ట్ చేసింది. వరంగల్, హైదరాబాద్ లో ఈవెంట్లు కూడా పూర్తి చేసేసింది.

బాహుబలి సిరీస్ తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి7న రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా పాటలు, ప్రోమోలు, ఈవెంట్లతో అదరగొడుతున్నది. రోజుకో అప్ డేట్తో హైప్ ను క్రియేట్ చేస్తున్నది. అటు పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ప్రమోషన్ కూడా ఇప్పటికే స్టార్టయ్యుంది.

రాజమౌళి తో తనకున్న ఫ్రెండ్షిప్ తో రెబల్ స్టార్ ప్రభాస్ తన రాధేశ్యామ్ మూవీని వాయిదా వేసుకుంటాడనే వార్తలు ఇండస్ర్టీలో వినిపించాయి. కానీ తాను కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నానంటూ ప్రభాస్ రాధేశ్యామ్ తో ముందుకు వస్తున్నాడు. సంక్రాంతి కి తెలుగులో మాత్రమే పెద్ద సినిమాలు విడుదల చేస్తుండగా, బాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కు లేవు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీకి కలెక్షన్ల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రభాస్, రాజమౌళి ఒక అండర్ స్టాండ్ కు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో సంక్రాంతికి రాధేశ్యామ్ బెర్త్ కన్ ఫాం అయ్యింది.

Also Read:  రామ్​ మేకోవర్​ అదుర్స్​.. సీతారామరాజు పాత్రకోసం ఇంతలా కష్టపడ్డాడా?

ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా నుంచి కొన్ని పాటలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తున్నది. కాగా ఈ సినిమా ప్రమోషన్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ అభిమానులు యూవీ క్రియేషన్స్ నిర్మాతలపై గుర్రుగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో నిర్మాతలపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. సాహో సినిమా నార్త్ లో మంచి వసూళ్లు సాధించినా తెలుగులో మాత్రం అంచనాలను రీచ్ కాలేకపోయింది. దీనికి నిర్మాత ల ప్రమోషన్ లోపమేనని డార్లింగ్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. రాధేశ్యామ్ సినిమా కు యూవీ క్రియేషన్స్ తో పాటు తన పెద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు స్థాపించిన గోపీ క్రష్ణా మూవీస్ ఇందులో నిర్మాతలు కావడం, 2012 లో రిలీజైన రెబల్ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ప్రభాస్ తన అభిమానులను ఖుషీ చేసేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన అభిమానులే అతిథులుగా రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేశాడు. డిసెంబర్ 23న రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ పై ఇప్పటికే తన అభిమానులందరికీ సమాచారం అందించినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తమ హీరో సినిమా కు తిరుగులేదని డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

Also Read: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular