Homeక్రీడలుDavid Warner: సన్ రైజర్స్ పై ఇంత కసి ఉందా వార్నర్ కి.! గెలిచాక పిచ్చెక్కిపోయాడు!!

David Warner: సన్ రైజర్స్ పై ఇంత కసి ఉందా వార్నర్ కి.! గెలిచాక పిచ్చెక్కిపోయాడు!!

David Warner: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గతంలో కెప్టెన్ గా వ్యవహరించాడు డేవిడ్ వార్నర్. ఈ సీజన్ కు ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. సోమవారం హైదరాబాద్ – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 7 పరుగులు తేడాతో ఓటమి పాలయ్యింది. మ్యాచ్ ముగిసిన అనంతరం విజయంతో డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వార్నర్ ఆనందాన్ని చూసిన అభిమానులు.. హైదరాబాద్ జట్టు అంటే ఇంత కసి ఉందా..? అని వార్నర్ గురించి అందరూ మాట్లాడుకున్నంత స్థాయిలో గెలుపు సంబరాలు చేసుకున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొన్నేళ్లపాటు ఆడాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఆ జట్టుకు సారధిగాను వ్యవహరించాడు. 2016 లో కెప్టెన్ గా హైదరాబాద్ జట్టుకు కప్ కూడా అందించి పెట్టాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఢిల్లీ జట్టుతో ప్రయాణం సాగిస్తున్నాడు. రిషబ్ పంత్ ప్రమాదం వల్ల విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. సోమవారం ఢిల్లీ జట్టు సన్ రైజర్స్ జట్టుతో హైదరాబాద్ వేదికగా మ్యాచ్ ఆడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఏడు పరుగులు తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ స్పందించిన తీరు క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా హైదరాబాద్ జట్టు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

స్వల్ప స్కోర్ కే పరిమితమైన ఢిల్లీ జట్టు..

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై హైదరాబాద్ బౌలర్లు విజృంభించడంతో.. ఢిల్లీ బ్యాటర్లకు పరుగులు రావడం కష్టమైంది. వార్నర్ 21 పరుగులు, మిచెల్ మార్ష్ 25 పరుగులు, మనీష్ పాండే 34 పరుగులు, అక్షర పటేల్ 34 పరుగులు మాత్రమే చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు 144 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు తడబడింది. తక్కువ పరుగులే అయినప్పటికీ బౌలింగ్ కు అనుకూలించిన పిచ్చి పై పరుగులు చేయడం కష్టంగా మారడంతో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇషాంత్ శర్మ 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్, నోర్జే 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, అక్షర పటేల్ 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, కుల్దీప్ 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడంతో.. హైదరాబాద్ జట్టు లక్ష్య చేధనలో చతికిల పడింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయాంక్ అగర్వాల్ 49 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఖరి ఓవర్ లో జట్టు విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. క్రీజులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. చివరి ఓవర్ వేసేందుకు బాల్ అందుకున్న ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ జట్టు ఏడు పరుగులు తేడాతో విజయం సాధించింది.

కసితో రగిలిపోయిన వార్నర్.. ఆనందాన్ని ఆపుకోలేక..

సాధారణంగా గతంలో ఆడిన జట్టుతో ప్రస్తుతం ఆడుతున్న జట్టు మ్యాచ్ ఆడాల్సి వస్తే.. ఏ క్రికెటర్ అయినా ఒకింత ఉద్వేగంగా ఫీల్ అవుతాడు. ప్రస్తుత జట్టు విజయం సాధించాలని కోరుకున్నా.. గతంలో ఆడిన జట్టుపై మాత్రం కాస్త సానుభూతి ఉంటుంది. కానీ డేవిడ్ వార్నర్ లో హైదరాబాద్ జట్టు పట్ల అటువంటి సానుభూతి ఏమీ లేదు. పైగా తీవ్రమైన కసితో రగిలిపోతున్నట్లు సోమవారం నాటి మ్యాచ్ అనంతరం వార్నర్ ఫీలింగ్ చూస్తే అర్థమైంది. హైదరాబాద్ జట్టు ఓటమి తర్వాత ఐపీఎల్ కప్ గెలిచిన స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఏడాది కాలంగా లో లోపల తనను దహించి వేస్తున్న మంటను చల్లార్చుకున్నాడు వార్నర్. ఈ ఆనందంలో వార్నర్ చేసుకున్న సంబరాలను చూస్తే.. అతనిలో సన్రైజర్స్ పై గెలవాలన్న కసి ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమైంది.

కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఆటగాడిగా అవకాశం ఇవ్వకుండా..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొన్నాళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు డేవిడ్ వార్నర్. 2016లో జట్టుకు టైటిల్ కూడా అందించాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో యాజమాన్యం డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతోపాటు తుది జట్టులోను ఆడనీయకుండా చేసింది. డ్రింక్స్ మోపించి పలు రకాలుగా అవమానించింది. దీనిని మనసులో పెట్టుకున్న వార్నర్ హైదరాబాద్ తో మ్యాచ్ లో విజయం తర్వాత రెచ్చిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించగానే వార్నర్ గాల్లోకి ఎగురుతూ గంతులు వేశాడు. విజయ గర్వంతో ఊగిపోయాడు. నాతోనే డ్రింక్స్ మోయిస్తారా మీకు ఎలా బుద్ధి చెప్పానో చూడండి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ చూపెట్టాడు. తమ ఆటగాళ్లతో గ్రౌండ్ మొత్తం కలియ తిరుగుతూ నానా హంగామా చేసాడు వార్నర్. వార్నర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వార్నర్ చేస్తున్న హడావిడిని కొందరు హైదరాబాద్ అభిమానులు తిడుతుంటే.. మరికొంతమంది అతను ఈ సెలబ్రేషన్స్ కు అర్హుడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవమానించిన జట్టుకు తన విలువ ఎటువంటిదో అర్థం అయ్యేలా చేశాడని పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version