Kolkata Woman: మాతృత్వం అనేది మహిళకు గొప్ప గౌరవం. స్త్రీ తత్వానికి పరిపూర్ణత తెచ్చేది మాతృత్వమే. అయితే ఇటీవల మాతృత్వాన్ని మంటగలుపుతున్నారు. వివాహేతర సంబంధాలతో గర్భం దాలుస్తున్న చాలా మంది తర్వాత తమకు పుట్టిన పిల్లలను చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో, డ్రెయినేజీల్లో పడేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక కొంతమంది కామాంధుల బారిన పడి తమకు తెలియకుండానే గర్భందాలుస్తున్నారు. తాను గర్భవతిని అని కూడా తెలియని పిచ్చి తల్లులు కూడా ఉన్నారు. మహిళ అయితే చాలు అన్నట్లుగా రెచ్చిపోతున్న కామాంధులతో గర్భం, మాతృత్వంపై కూడా అవగాహన లేని మహిళలు గర్భం దాలుస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఓ మహిళ టాయిలెట్‌లో మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువు ఏడవడం మొదలుపెట్టగానే మహిళ భయంతో కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఆ మరుసటి రోజు శిశువు మరణించింది. తాను గర్భం దాల్చిన విషయమే అవగాహనలో లేదని ఆ మహిళ చెప్పడం గమనార్హం.
టాయిలెట్‌కు వెళ్లి ప్రసవం..
ఓ మహిళ టాయిలెట్ కోసం వెళ్లి.. అందులోనే ప్రసవించింది. మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ వెంటనే టాయిలెట్ కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతాలోని కాస్బా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సదరు మహిళ మాత్రం ‘అసలు తాను గర్భిణి అనే విషయమే తనకు తెలియదని మహిళ చెప్పింది. గత కొన్ని నెలల నుంచి ఆమెకు రెగ్యులర్‌గా పీరియడ్స్ అవుతున్నాయని, అందుకే గర్భం దాల్చిన అవగాహన లేదన్నది. తాను టాయిలెట్ వెళ్లినప్పుడే ప్రసవించింది. ఆ శిశువు ఏడుపు వినిపించగానే భయంతో కిటికీ వైపు బలంగా విసిరేసింది.
మానసిక స్థితి సరిగా లేక..
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి వచ్చి శిశువుతోపాటు ప్రసవించిన మహిళను కూడా ఆస్పత్రికి తరలించారు. మరుసటి రోజు ఆ శిశువు మరణించింది. ప్రాథమిక విచారణలో మహిళ మానసికంగా ఆరోగ్యంగా లేదని తెలిసింది. జూన్, 2022 నుంచి లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తిని అదే ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. భర్త తాగుబోతు. అతను, వారి కుటుంబ సభ్యులకు కూడా ఆమె గర్భం దాల్చినట్టు తెలియదని చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.