Site icon OkTelugu

Arava Sridhar: అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో వీడియో.. ఈసారి ఆమె నేరుగా పవన్ కళ్యాణ్ కు!

Jana Sena MLA Arava Sridhar

Jana Sena MLA Arava Sridhar

Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్( janasena MLA arava Sridhar) విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు బాధితురాలు హర్ష వీణ. రోజుకో వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయితే ఈసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలు చూపిస్తానని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సెల్ఫీ వీడియోలో కోరారు. అయితే ఇప్పుడు నేరుగా ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇప్పటివరకు అరవ శ్రీధర్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలను విడుదల చేసిన ఆమె ఇప్పుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ను కోరడం గమనార్హం.

* వరుసగా సంచలన వీడియోలు..
రైల్వే కోడూరు( Railway Koduru ) జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై గత కొద్దిరోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో బాధితురాలు హర్ష వీణ సంచలన వీడియోలు విడుదల చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యే శ్రీధర్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడం.. దీనిపై జనసేన నాయకత్వం కూడా స్పందించింది. విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అరవ శ్రీధర్ ఆ కమిటీ ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం సైతం కేసు నమోదు చేసింది. అదే సమయంలో బాధితురాలు హర్ష వీణపై కూడా అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. ఆమె 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా ఇవ్వకపోవడం వల్లే అలా ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్యలు లేకపోవడంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

* తప్పుదోవ పట్టించారంటూ కామెంట్స్
అయితే బాధితురాలు హర్ష వీణ తన విషయంలో పవన్ కళ్యాణ్ ను( deputy CM Pawan Kalyan) తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా ఆమె అలా చెబుతున్నట్లు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మొన్న జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో కూడా పవన్ దీనిపై సీరియస్ అయ్యారు. వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ వద్దకు తీసుకురావద్దని కూడా సూచించారు. మరోవైపు బాధితురాలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీ పరంగా విచారణ.. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలతో కేసు నమోదు, విచారణ కొనసాగుతుండడంతో సదరు ఎమ్మెల్యే పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలో బాధితురాలు ఒక అడుగు ముందుకు వేసి నేరుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని నేరుగా ఆమె పవన్ కళ్యాణ్ ను కోరడం విశేషం. దీనిపై జనసేన నాయకత్వం నుంచి ఎటువంటి సమాచారం వస్తుందో చూడాలి.

Exit mobile version