Site icon OkTelugu

Allu Arjun Remuneration: అల్లు అర్జున్ కి 300 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారా..?

Allu Arjun 300 Crore Remuneratio

Allu Arjun 300 Crore Remuneratio

Allu Arjun Remuneration: ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ గా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆయన తన తదుపరి సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమాను చేస్తున్న అల్లు అర్జున్ ఆ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సంజలీలా భన్సాలీ తో కూడా మరో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ఏర్పడింది. దాంతో ఆయన రెమ్యూనరేషన్ భారీ గా ఛార్జ్ చేస్తున్నాడు అంటు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి… నిజానికి అల్లు అర్జున్ ప్రస్తుతం 300 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట…అంత మొత్తంలో అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ప్రొడ్యూసర్లకు ఏం లాభం వస్తుంది అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ చేసిన ‘పుష్ప 2’ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. కాబట్టి అతనికి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు ఒకరిని మించి ఒకరు అతనికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాం అంటూ అఫర్ చేస్తున్నారు. దాంతో అతను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

అందులో అతని తప్పు ఏముంది అంటూ అల్లు అర్జున్ ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు…నిజానికి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని మనం బేస్ చేసుకొని మాట్లాడకూడదు. ఎందుకంటే పుష్ప మొదటి పార్టీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఆ హైప్ లో కలెక్షన్స్ అయితే భారీగా వచ్చాయి. దాని వల్ల తన తదుపరి సినిమాకి కూడా ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని అనుకోవడం సరైన విషయం కాదు అంటూ ఇంకొంతమంది సినిమా విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది అతని అభిమానుల్ని ఆనందపరుస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ఏ హీరో కూడా అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయలేదు. కాబట్టి మొదటిసారి 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు…

Exit mobile version