https://oktelugu.com/

Hindu press group : హిందూ పత్రికా గ్రూపులో ఎప్పటిలాగే కొట్లాటలు

ఈ కస్తూరి రంగ అయ్యంగార్ 1905లో హిందూ పత్రికను కొన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఈ హిందూ పేపర్ వాళ్ల కుటుంబం చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం నలుగురు సంతానం చేతుల్లో హిందూ పేపర్ ఉంది. అయితే పత్రికలో ఇప్పుడు కొట్లాటలు మొదలయ్యాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2023 / 03:52 PM IST
    Follow us on

    Hindu press group : హిందూ పత్రిక.. ఒకనాడు గోల్డ్ స్టాండర్డ్ జర్నలిజానికి ప్రతీకగా ఉండేది. సెన్షేషనల్ న్యూస్ కోసం పాకులాడకుండా.. ఒక వార్తను ప్రచురించడానికి కన్ఫమ్ చేసుకొని.. విజిట్ చేసి మరీ క్లారిటీ తీసుకొని ప్రచురించేవారు. అంత రియలబుల్ న్యూస్ గా హిందూ పేపర్ పేరుగాంచింది. ప్రపంచంలోనే బెస్ట్ లే అవుట్.. బెస్ట్ ప్రింటింగ్.. చూడగానే ఎట్రాక్ట్ అయ్యే పద్ధతుల్లో ఆ పేపర్ ఉండేది. వరల్డ్ టాప్ 10 పత్రికల్లో హిందూ అని చెప్పుకునేవారు. క్వాలిటీ కూడా బాగుండేది. ఇదొక్కటే కాదు.. నిజంగా చెప్పాలంటే ఫెయిర్ అండ్ అన్ బయాస్ గా ఉండేది.

    ఒకవైపు మొగ్గకుండా నిష్పక్షపాతంగా న్యూస్ కోసం హిందూ పేపర్ ను భావించేవారు. తమిళనాడు వాళ్లకు తమిళ ఐడెంటిటీగా ఫిల్టర్ కాఫీ, రెండూ హిందూ పేపర్ గా భావించేవారు. అంతగా హిందూ పేపర్ గోల్డ్ స్టాండర్డ్ ను స్థాపించింది. అంతటి వైభవం కాస్త ప్రస్తుతం దిగజారిపోయిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలు ఏం జరిగిందన్నది ఒకసారి చూస్తే..

    ఈ కస్తూరి రంగ అయ్యంగార్ 1905లో హిందూ పత్రికను కొన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఈ హిందూ పేపర్ వాళ్ల కుటుంబం చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం నలుగురు సంతానం చేతుల్లో హిందూ పేపర్ ఉంది. అయితే పత్రికలో ఇప్పుడు కొట్లాటలు మొదలయ్యాయి.

    హిందూ పత్రికలో గొడవలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు..