Prakash Ambedkar- KCR: దేశంలోనే ఎక్కడా లేనంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ధళిత వ్యతిరేకి అనే ముద్ర పోగొట్టుకునేందకు అంబేద్కర్‌పై విగ్రహం ఆవిష్కరణ ద్వారా పోగొట్టుకునే ప్రయత్నం చశారు. దళితులకు దగ్గర కావడానికి కొత్త సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో దళితులను ఆకట్టుకోగలమని భావిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, ఆయన మనవడు ప్రకాశ్‌అంబేద్కర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఆయన చేతులమీదుగానే ఆవిష్కరింపజేశారు. ఆయనను గొప్పగా సత్కరించారు. ఆ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ.. తన తాత విగ్రహాన్ని ఇంత గొప్పగా ఏర్పాటుచేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రుణం తీర్చుకునే పనిలో..
తన తాతకు దేశంలో ఒక్కడా లేనంత, ఎవరూ ఇవ్వనంత గౌరవం కేసీఆర్ ఇచ్చారని భావిస్తున్న అంబేద్కర్ మనుమడు.. ఇపుపడు గులాబీ బాస్ రుణం తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో క్రియాశీలంగా రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది. ప్రకాశ్ అంబేద్కర్ అంటే కేవలం భీమ్‌రావు అంబేద్కర్ మనవడు మాత్రమే కాదు.. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడు కూడా. ఈ పార్టీకి చట్టసభల్లో పెద్దగా బలం లేదు. పార్టీ మాత్రం మనుగడలోనే ఉంది. అలాంటి ఆర్పీఐ తరఫున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో తాము పోటీచేస్తామని ప్రకాశ్ అంబేద్కర్ ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రంలోని భాజపాను ఓడించడం లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళుతుందని ప్రకటించారు. బహుజనులంతా ఏకం కావాలని కూడా పిలుపు ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని ఓడించడానికి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే వ్యూహం..
అయితే ప్రకాశ్ అంబేద్కర్ తెలంగాణలో గెలిచే అవకాశం ఒక్క శాతం కూడా లేదు. అది ఆయనకు కూడా తెలుసు. అయితే కేసీఆర్ రుణం తీచ్చుకోవడమే లక్ష్యంగా దళితులకు ప్రత్యేకించిన పార్టీగా పేరున్న, స్వయంగా అంబేద్కర్ మనవడి సారథ్యంలో ఉన్న పార్టీగా ఒక వర్గం ఓటర్లు ఆదరిస్తారని భావిస్తున్నారు. ఆ వర్గం ఓటర్లలోని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ప్రకాశ్ అంబేద్కర్ తెలంగాణలో పోటీకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపితే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, కేసీఆర్‌కు మేలు చేస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
వెయ్యి ఓట్లు వచ్చినా రుణం తీర్చినట్లే..
119 నియోజకవర్గాల్లో ఆర్పీఐ తరఫున పోటీచేసే అభ్యర్థులకు కనీసం వెయ్యి ఓట్లు వచ్చినా ప్రకాశ్ అంబేద్కర్ ఆశయం నెరవేరినట్లే. అదే సమయంలో కేసీఆర్ రుణం తీర్చినట్లే. ఎందుకంటే ఆ వెయ్యి ఓట్లు ప్రతిపక్షాలకు పడేవే. అంబేద్కర్ మనుమడి అంతిమ లక్ష్యం మళ్లీ కేసీఆర్‌ను గద్దెనెక్కించడమే. ఇందుకు తన శక్తవంచన లేకుండా కృషి చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.