Homeజాతీయ వార్తలుCM Arvind Kejriwal Emotional: కన్నీరు పెట్టుకున్న సీఎం.. వైరల్‌ వీడియో

CM Arvind Kejriwal Emotional: కన్నీరు పెట్టుకున్న సీఎం.. వైరల్‌ వీడియో

CM Arvind Kejriwal Emotional: ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవాల్‌ కన్నీరు పెట్టుకున్నారు. ఔటర్‌ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్‌ గ్రామంలో బుధవారం జరిగిన స్కూల్‌ ఆఫ్‌ స్పెషలైజ్డ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్‌ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ఢిల్లీ విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో ఎంతో మంది క్రిమినల్స్‌ ఉన్నా.. సిసోడియా లాంటి మంచి వ్యక్తిని జైల్లో వేశారని కేంద్రాన్ని విమర్శించారు. ‘సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి ఆయనను జైలులో పెట్టించింది. ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉంటే ఆయనను బీజేపీ జైలులో పెట్టించేది కాదు. విద్యారంగంలో విప్లవానికి చరమగీతం పాడాలని వారు కోరుకుంటున్నారు. అయితే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు మేము తెరపడనీయం’ అని కేజ్రీవాల్‌ అన్నారు. సిసోడియా కృషితోనే ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయని, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. సిసోడియా కృషితోనే ఢిల్లీలో విద్యావ్యవస్థ గాడిన పడిందని పేర్కొన్నారు.

సిసోడియాకు దక్కని బెయిల్‌..
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో మనీశ్‌ సిసోడియా జైల్లో ఉన్నారు. సీబీఐ, ఈడీ ఎన్నిసార్లు తనిఖీ చేసినా స్కాంలో సిసోయా పాత్రపై ఎలాంటి ఆధారారాలు సంపాదించలేకపోయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న విచారణకు పిలిచిన సీబీఐ సిసోడియాను అరెస్టు చేసింది. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

నాలుగు నెలలుగా జైల్లోనే..
మనీశ్‌ సిసోడియా ఆరు నెలలుగా జైల్లో ఉంటున్నారు. బెయిల్‌ కోసం ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఫలించడం లేదు. సిసోడియా బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకిస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతోందని, సిసోడియాకు బెయిల్‌ ఇస్తే ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు నివేదిస్తోంది. దీంతో సీబీఐ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, చివరకు సుప్రీం కోర్టు కూడా సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాయి.

భార్య ఆనారోగ్యంతో ఉన్నా..
తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, బెయిల్‌ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సిసోడియా. అయినా కూడా సీబీఐ వ్యతిరేకించింది. దీంతో కోర్టు భార్యను చూసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న భార్యను చూసేందుకు మాత్రం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకూ రెండు సార్లు ఆయనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో ఉదయం భార్యను చూసేందుకు వచ్చారు. సాయంత్రి తిరిగి జైలుకు వెళ్లారు.

ఢిల్లీ పోలీసుల తీరుపై కేజ్రీవాల్‌ ఆగ్రహం..
ఇదిలా ఉండగా, ఢిల్లీ పోలీసులు మనీష్‌ సిసోడియా మెడ పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. అలా చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయా అని ప్రశ్నించారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియాను కోర్టుకు తరలించారు. ఈ సమయంలో పోలీసులు మనీష్‌ సిసోడియా మెడను పట్టుకుని తీసుకెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పోలీసు చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిసోడియా పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version