Telangana Congress : అలవికాని ఎన్నికల వాగ్ధానాలే గుది బండలు కాబోతున్నాయి?

కాంగ్రెస్ గెలవడం కాదు.. గెలవడానికి కావాల్సిన అలవికానీ హామీలు చేసింది. ఇవి అమలు చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలి? వేల కోట్లు కావాలి. దానికి ప్రణాళిక ఏమైనా కాంగ్రెస్ దగ్గరుందా?

Written By: Neelambaram, Updated On : December 4, 2023 2:12 pm

Telangana Congress : కాంగ్రెస్ ఎంతైనా కాంగ్రెస్ నే. దాని క్యారెక్టర్ మారుతుందని అనుకోవడానికి లేదు. ఇవాళే తెలంగాణలో గెలిచింది అనుకుంటే.. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అంటూ ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి ఘనంగా ప్రకటించారు. అయితే భద్రాచలంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరుఫున వెంకట్రావ్ ను గెలిపించారు. నిన్నటికి నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డిలు.. బీఆర్ఎస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేను తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్చుకున్నారంటే ఏమనుకోవాలి దీన్ని..దీన్ని ప్రజాస్వామ్యం అనుకోవాలా రేవంత్ రెడ్డి..? దీనికి సమాధానం చెప్పి తీరాలి.

నిన్నటిదాకా బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శించిన కాంగ్రెస్ వాళ్లు.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవగానే లాక్కోవడం దేనికి సంకేతం.. కాంగ్రెస్ చేస్తే తప్పు కానిది.. బీఆర్ఎస్ చేస్తే తప్పు అవుతుందా? ఇది ప్రజల తీర్పును అగౌరపరచడం కిందే లెక్క.

కనీసం బీజేపీలో అలా చేయించాలనుకుంటే రాజీనామా చేయించి పార్టీలో గెలిపించి తీసుకుంటారు. భద్రాచలం ఎమ్మెల్యే గెలిచి కనీసం ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే పార్టీ మార్చేస్తారా? వినడానికే కాంగ్రెస్ తీరు ఆశ్చర్యంగా ఉంది.

కాంగ్రెస్ గెలవడం కాదు.. గెలవడానికి కావాల్సిన అలవికానీ హామీలు చేసింది. ఇవి అమలు చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలి? వేల కోట్లు కావాలి. దానికి ప్రణాళిక ఏమైనా కాంగ్రెస్ దగ్గరుందా?

అలవికాని ఎన్నికల వాగ్ధానాలే గుదిబండలు కాబోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.