https://oktelugu.com/

Heroine: అయ్యో.. ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? ఎవరో గుర్తుపట్టారా?

ఇటీవల రాధ కూతురు కార్తీక వివాహ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఓ అమ్మాయి లావుగా కనిపించింది. ఆమె ఎవరో కాదు. తెలుగు, తమిళ సినిమాలో నటించిన హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు?

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2023 / 12:10 PM IST
    Follow us on

    Heroine: సినిమాల్లో ఉన్నంతకాలం నటులు హల్ చల్ చేస్తుంటారు. కానీ ఒక్కసారిగా ఇండస్ట్రీని వదిలాక వారి అవతారం మారిపోతుంది. ముఖ్యంగా సినిమాల్లో కొనసాగినంత కాలంలో ఎంతో అంతంగా ఉన్న హీరోయిన్లు ఆ తరువాత పూర్తిగా మారిపోతుంటారు. ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో లావవుతూ ఉంటారు. ఈ క్రమంలో వారిని గుర్తుపట్టడం సాధ్యం కాదు. ఇటీవల రాధ కూతురు కార్తీక వివాహ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఓ అమ్మాయి లావుగా కనిపించింది. ఆమె ఎవరో కాదు. తెలుగు, తమిళ సినిమాలో నటించిన హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు? అలా మారడానికి కారణమేంటి? అసలు విషయంలోకి వెళితే..

    ఒకప్పుడు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రాధ.. తన వారసురాలిగా కూతుళ్లను కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. వీరిలో ఒకరు కార్తీక. మరొకరు తులసి. మొదటి అమ్మాయి కార్తీక ‘జోష్’ సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది. ఈ సినిమా యావరేజ్ గా సాధించినా పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో నటించింది. అయితే రంగం సినిమాతో ఆమె కాస్త పాపులర్ అయినా.. అనుకున్న అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి.. ఇటీవలే పెళ్లి చేసుకుంది.

    ఈ పెళ్లికి లావుగా ఉన్న ఓ అమ్మాయి హాజరైంది. ఈమెను చూసి అందరూ షాక్ అయ్యారు. అమె ఎవరో కాదు. రాధ రెండో కూతురు తులసి. ఈమె ‘కెరటం’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.మణిరత్నం తీసిన ఈ సినిమాతో ఆమె పరిచయం అయినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే పలు తమిళ సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాల్లో నటించడం మానేసింది.

    చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తులసి ఒక్కసారిగా.. మారిపోయింది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె ఇలా గుర్తుపట్టలేని విధంగా మారిందని అనుకుంటున్నారు. కెరటం సినిమాలో ఎంతో అందంగా కనిపించిన ఈమె ఇలా మారడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఇక కార్తీక పెళ్లి సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.