Chiranjeevi: మరో రీమేక్ కి సిద్దం అయిన చిరంజీవి.. ఫైర్ అవుతున్న అభిమానులు..

కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది ఇక ఈ సంవత్సరం లో రెండు సినిమాలను రిలీజ్ చేసిన చిరంజీవి ఈ సినిమాతో భారీ ప్లాప్ ని చవి చూసాడు ఇలా ఈ ఏడాది ఒక రీమేక్ సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.

Written By: Gopi, Updated On : December 4, 2023 12:50 pm
Follow us on

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీని 4 దశాబ్ధాల పాటు ఏకచత్రాధిపత్యంతో ఏలిన ఒకే ఒక హీరో చిరంజీవి…చిరంజీవి చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు,ఒక రకం గా చెప్పాలంటే విజయాలు సాధించడం ఆయనకి కొత్తేమీ కాదు. ఇక అలాంటి చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్ సినిమాతో ఒక ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. అయితే ఈ సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా తమిళం లో శివ దర్శకత్వంలో వచ్చిన వీరమ్ అనే సినిమా కి రీమేక్ గా వచ్చింది. అయితే వీరమ్ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక అదే రీతిలో భోళా శంకర్ కూడా సూపర్ హిట్ అవుతుందని అందరు అనుకున్నారు.

కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది ఇక ఈ సంవత్సరం లో రెండు సినిమాలను రిలీజ్ చేసిన చిరంజీవి ఈ సినిమాతో భారీ ప్లాప్ ని చవి చూసాడు ఇలా ఈ ఏడాది ఒక రీమేక్ సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు. ఇక గత ఏడాది కూడా గాడ్ ఫాదర్ అనే సినిమాతో ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా మలయాళం లో వచ్చిన లూసీఫర్ సినిమాకి రీమేక్ గా రావడం విశేషం…

ఇక దాంతో చిరంజీవి అభిమానులు అందరూ కూడా చిరంజీవి రీమేక్ సినిమాలు చేయవద్దు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ని తెగ వైరల్ చేశారు. దాంతో చిరంజీవి రీమేక్ సినిమాలు చేయను అని తన స్నేహితుల దగ్గర చెప్పినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతుండగా, ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే వశిష్ఠ ఇంతకుముందు కళ్యాణ్ రామ్ తో చేసిన బిబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దాంతో ఈ సినిమాతో కూడా చిరంజీవికి అదిరిపోయి విజయం అందిస్తాడు అని చిరంజీవి అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరొక న్యూస్ నెట్లో తగ హల్చల్ చేస్తుంది అది ఏంటి అంటే మలయాళం లో మమ్ముట్టి హీరోగా వచ్చిన భీష్మ పర్వం సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దీన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అభిమానులు చిరంజీవి మళ్లీ రీమేక్ సినిమా చేయడం ఎందుకు అంటూ చిరంజీవి పైన ఫైర్ అవుతున్నారు… అయితే నిజంగానే చిరంజీవి రీమేక్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కానీ ఇప్పటికే ఈ న్యూస్ అయితే ఫిల్మ్ నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది…