Chief Ministers : ఈడీ దాడులతో బెంబేలెత్తిస్తోంది. సీఎంలకే షాక్ ఇస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదు. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఏడు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన రావడం లేదు.
రాకుండా ఉండే అధికారం ఇద్దరు సీఎంలకు ఉందా? ఎందుకు రాను అంటున్నారు? వారికి అధికారం ఉందా? అన్నది చూస్తే.. లేదనే చెప్పాలి.
లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిన వారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. ఎవిడెన్స్ పకడ్బందీగా కలెక్ట్ చేసింది. అంటెండ్ అయితే అరెస్ట్ చేస్తారనే కారణంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , జార్ఖండ్ సీఎం సోరెన్ లు హాజరు కావడం లేదు.
అరెస్ట్ చేయకపోతే ఏం జరుగుతుందని చూస్తే.. ఈడీ వీరి విషయంలో తీవ్రంగా ఆలోచిస్తోంది. ఖచ్చితంగా ఇది అరెస్ట్ కు దారితీసే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం ఆ పని చేస్తుందా? చేయబోతోందా? అన్నది చూడాలి. ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అరెస్ట్ చేస్తుందా? మోడీ అరెస్ట్ చేయిస్తారా? అన్నది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారని చెప్పకతప్పదు.
ఇద్దరు ముఖ్యమంత్రులు త్వరలో జైలులోకి వెళతారా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.