Homeఎంటర్టైన్మెంట్Celebrities Wedding On and Off Screen: సినిమాల్లో, బయట కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న...

Celebrities Wedding On and Off Screen: సినిమాల్లో, బయట కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు వీళ్లే

Celebrities Wedding On and Off Screen: సినిమా వాళ్లకు త్వరగా పెళ్లిళ్లు కావు. వాళ్లకు డేటింగ్ లు, షూటింగ్ లు చాలా సర్వసాధారణమైన విషయం. నచ్చిన వారితో నచ్చినట్టు కలిసి ఉంటారు, నచ్చకపోతే మరుక్షణం విడిపోతారు, మొత్తానికి రంగుల ప్రపంచంలోని వారి జీవితాల్లో ఎన్నో రంగులతో పాటు మరెన్నో లొసుగులు కూడా ఉంటాయి. అయితే, ఈ కింద సినీ ప్రముఖులు భిన్నం. వీళ్ళు రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ నిజంగానే వివాహాలు చేసుకున్నారు. మరి ఈ జంటలు ఎవరో తెలుసుకుందాం రండి.

బెన్ అఫ్లెక్ – జెన్నిఫర్ లోపెజ్ :

 Jennifer-lopez-ben-affleck-oktelugu

హాలీవుడ్ తారలు ‘జెన్నిఫర్ లోపెజ్ – బెన్ అఫ్లెక్’ చివరకు ఎ లిటిల్ వైట్ వెడ్డింగ్ చాపెల్‌లో అర్ధరాత్రి పెళ్లితో ఒక్కటైయ్యారు. తమ ప్రేమకు చిహ్నం ఈ పెళ్లి అంటూ తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టింది ఈ జంట. ఐతే, ఈ వివాహానికి 20 సంవత్సరాల క్రితమే.. జెన్నిఫర్ – బెన్ అఫ్లెక్’ ‘జెర్సీ గర్ల్’ అనే సినిమాలో రీల్ వివాహం చేసుకున్నారు. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఈ జంట తమ ప్రేమకు పరాకాష్ట గా పెళ్లితో ఒక్కటి అయ్యింది. ఆసక్తికరంగా, ‘జెర్సీ గర్ల్’లో వీరి ఆన్-స్క్రీన్ పెళ్లి ఎలా అయితే జరిగిందో, రియల్ గానే ఈ జంట అలాగే పెళ్లి చేసుకున్నారు.

Also Read: Hari Hara Veera Mallu- Rajamouli: ‘హరి హర వీర మల్లు’ కోసం రంగం లోకి దిగిన రాజమౌళి..పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఇక పండగే

సన్ యే-జిన్ మరియు హ్యూన్ బిన్ :

Celebrities Wedding On and Off Screen
Son Ye-jin and Hyun Bin

సన్ యే-జిన్ – హ్యూన్ బిన్ తమ సూపర్ హిట్ సిరీస్ ‘క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు’లో ఉంగరాలు మార్చుకున్నారు. వాటిని ఎప్పటికీ తీయబోమని ప్రమాణం కూడా చేశారు. ఆ చిత్రంలోని పెళ్లి ఎపిసోడ్ లో… వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ జంట ఎలాంటి ఫోజులు ఇచ్చిందో.. విలువైన డిజైనర్ దుస్తులతో వెడ్డింగ్ షూట్‌కు కూడా అలాగే పోజులిచ్చారు. మొత్తానికి రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఒక్కటయ్యారు.

దీపికా పదుకొణె – రణవీర్ సింగ్

Celebrities Wedding On and Off Screen
Deepika Padukone and Ranveer Singh

‘బాజీరావ్ మస్తానీ’లో దీపికా పదుకొణె, రణ్‌ వీర్‌ సింగ్‌ ల వివాహ సన్నివేశం చాలా గొప్ప హిట్ అయ్యింది. ఐతే, అది చాలా ఎమోషనల్ అండ్ ట్రాజెడీగా ఉండటంరో ఫ్యాన్స్ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ, తమ జీవితంలోని వివాహ వేడుకను ఈ జంట సూపర్ హిట్ చేసుకుంది. ఇటలీలో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, మరియు అతి కొద్దిమంది సినీ అతిథుల మధ్య ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. అభిమానులంతా వీరి నిజ జీవిత వివాహాన్ని మాత్రం అద్భుతంగా ఆనందించారు.

కాజోల్ – అజయ్ దేవ్‌గణ్

Celebrities Wedding On and Off Screen
Kajol and Ajay Devgn

కాజోల్, అజయ్ దేవ్‌గణ్ ల ప్రేమకథ సినిమా సెట్స్‌పైనే మొదలైంది. ‘యు, మీ ఔర్ హమ్’ వంటి చిత్రాలలో ఈ జంట వెండితెర పై చాలా గ్రాండ్ గా వివాహం చేసుకుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం కాజోల్, అజయ్ దేవ్‌గణ్ లు చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. సినీ తారలు, అతికొద్దిమంది అతిథుల మధ్య ముంబైలోని తమ ఇంటి టెర్రస్‌ పై చాలా సాధారణ వివాహాన్ని చేసుకుంది ఈ జంట.

కమల్ హాసన్ – సారిక

Celebrities Wedding On and Off Screen
Kamal Haasan – Sarika

విశ్వనటుడిగా కీర్తి గడించిన కమల్ హాసన్ హీరోయిన్ సారిక కూడా రీల్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కమల్ తో ప్రేమలో పడి సారిక, పెళ్లి కాకుండానే తల్లి అయింది. పెళ్లి కాకముందే శ్రుతి హాసన్ కి జన్మించింది. ఆ తర్వాత కమల్ – సారిక ఇద్దరూ రియల్ పెళ్లి చేసుకున్నారు. అక్షర హాసన్ జన్మించాక విడిపోయారు. మొత్తానికి సినిమాల్లో, బయటగూడా పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలుగా వీళ్లు క్రెడి కొట్టేశారు.

Also Read:Pooja Hegde: పూజా హెగ్డే వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version