భారతరత్న.. ముగ్గురికి ప్రకటించింది మోడీ సర్కార్.. ఈసారి ఇచ్చిన ముగ్గురు కూడా రియల్ హీరోలు అని చెప్పొచ్చు. ఈ ముగ్గురికి ఎప్పుడో ఇయ్యాల్సింది.. వీళ్లు అసలు అర్హులు అని చెప్పొచ్చు. ఒక దశలో వెళ్లిపోయే ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి పెట్టిన మహా మేధావి పీవీ నరసింహారావు.
గ్లోబైలేజేషన్, ప్రైవేటేజేషన్ లాంటి సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. ఏటికి ఎదురీది సంస్కరణలు చేసిన పీవీని కాంగ్రెస్ ఘోరంగా అవమానించింది. అయినా మోడీ సర్కార్ గుర్తించి ఆయన సేవలకు భారత రత్న ప్రకటించింది.
దేశ గతిని మార్చినటువంటి గేమ్ చేంజర్ నేత పీవీ నరసింహారావు. అందుకోసం భారతరత్నను పీవీకి ఇవ్వడం చాలా న్యాయమైనది. కాంగ్రెస్ తొక్కేసినా కూడా వేరే పార్టీ అని పక్కనపెట్టకుండా పీవీకి భారతరత్న ఇచ్చిన మోడీ చాతుర్యతను అందరూ మెచ్చుకోవాల్సిందే.
మొన్నటి కర్పూరీ ఠాకూర్ కు ఇవ్వడం కూడా చిన్న విషయం కాదు. చౌదరి చరణ్ సింగ్ కు కూడా భారతరత్న ఇవ్వడం సరైందే. కిసాన్ రైతు ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన చరణ్ సింగ్ ఎంతో రైతుల కోసం పోరాడారు. జాట్లు అని.. కులం కోణంలో ఇచ్చారని అనుకుంటున్నారని..కానీ రైతు నాయకుడిగా చరణ్ సింగ్ ను గుర్తించిన మోడీకి సెల్యూట్ చేయాల్సిందే.. మూడోది హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్.. ఈ ముగ్గురికి ఇవ్వడం సరైందే..
భారతరత్నలు ముగ్గురూ దేశం గర్వించదగ్గ మహానుభావులు.. వారిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.