Pakistan Elections Result: ఎలాంటి ఫలితాలు వస్తే ఏంటి.. సైన్యం కింద బతుకే కదా?!

పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో లాహోర్_ఎన్ఏ 127 స్థానం నుంచి ఓడిపోయారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో.. పాకిస్తాన్ ముస్లిం లీగ్ కు చెందిన అత్తావుల్ తారార్ చేతిలో ఓడిపోయారు.

Written By: Suresh, Updated On : February 10, 2024 1:15 pm
Follow us on

Pakistan Elections Result: ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. మనదేశంలో ఎన్నికల నిర్వహణ ఈ విధంగా ఉంటుంది కాబట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోంది. అదే పాకిస్తాన్ దేశంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ.. అక్కడ సైన్యం చేతిలోనే సర్వం ఉంటుంది. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకున్నప్పటికీ సైన్యం పెత్తనం ఉండటంతో.. అక్కడి ప్రభుత్వం కీలుబొమ్మలాగా ఆడుతూ ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్ దేశం ఒక కల్లోలిత దేశంగా దిగజారిపోయింది. ఓ వైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.. మరోవైపు ప్రతిబంధకంగా ఉగ్రవాదుల కదలికలు.. తినేందుకు తిండి లేదు. తాగడానికి నీరు లేదు. అసలు బతకడానికి సౌలభ్యం లేదు. అలాంటి పాకిస్తాన్ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో లాహోర్_ఎన్ఏ 127 స్థానం నుంచి ఓడిపోయారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో.. పాకిస్తాన్ ముస్లిం లీగ్ కు చెందిన అత్తావుల్ తారార్ చేతిలో ఓడిపోయారు. తారార్ కు 98,210 ఓట్లు పోలయ్యాయి. బిలావాల్ కేవలం 15 వేల ఓట్లు మాత్రమే సాధించి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పీపీపీ పార్టీ ఆరోపిస్తోంది. ” బిలావల్ ఆధిక్యంలో ఉన్నారు. అకస్మాత్తుగా ఎన్నికల ఫలితాలు నిలుపుదల చేశారు. ఆ తర్వాత ప్రత్యర్థి లీడింగ్ లోకి వెళ్లారు. రిగ్గింగ్ చేయడం వల్లే ఎన్నికల ఫలితాలలో జాప్యం చేశారని” పీపీపీ పార్టీ నేత రెహమాన్ ఆరోపించారు. పోలింగ్ రోజు మొబైల్, ఇంటర్నెట్ సేవలను స్తంభింప చేశారని ఆరోపించారు. దీనివల్ల ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారని, అభ్యర్థులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారని ఆమె ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవడం కోసం రిగ్గింగ్ చేశారని.. దీనికోసం మొబైల్ సేవలు కూడా నిలిపివేశారని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో భుట్టో కు మాత్రమే కాకుండా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ న కు కూడా ఝలక్ తగిలింది. పీఎంఎల్_ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ కూడా ఓటమి పాలయ్యారు. మన్షీరా నియోజకవర్గంలో ఆయన తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈస్థానంలో పీటీఐ మద్దతు దారుడు విజయం సాధించారు. అయితే నవాజ్ షరీఫ్ లాహోర్ ఎన్ ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ పిటిఐ అభ్యర్థి యస్మిన్ రషీద్ పై విజయం సాధించారు.

పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపకుండా సైన్యం అనేక ఆంక్షలు విధించింది. కొన్ని కేసులను తిరగదోడి కఠిన శిక్ష విధించేలాగా న్యాయస్థానం ద్వారా తీర్పులు ఇచ్చింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎన్నికల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఒకానొక దశలో ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారు అని అందరూ భావించారు. కానీ యాదృచ్ఛికంగా ఆయన పార్టీకి ఎన్నికల్లో అడుగడుగునా ఆంక్షలు విధించారు. దీంతో పాకిస్తాన్ దేశంలో నవాజ్ షరీఫ్ ను మరోసారి అధ్యక్షుడిని చేసేందుకు ఆ దేశ సైన్యం పావులు కదిపింది. అందుకు తగ్గట్టుగానే ఆయన మీద కేసులను తొలగించింది. ప్రవాస జీవితం గడుపుతున్నా ఆయన ఈ ఎన్నికల కోసం పాకిస్తాన్ వచ్చారు. రెండు నియోజకవర్గాలలో పోటీ చేశారు. నియోజకవర్గంలో మాత్రం ఓటమి పాలయ్యారు. రిగ్గింగ్, మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వంటి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో..పాక్ సైన్యం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వార్తల నేపథ్యంలో నెటిజన్లు పాకిస్తాన్ దేశంలో జరిగిన ఎన్నికల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రజలు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ.. పనిచేసేది సైన్యం కిందే. ఆ దేశంలో సైన్యం పెత్తనమే ఎక్కువ. అలాంటప్పుడు అక్కడ ఎన్నికలు నిర్వహించకుంటే ఏంటి” అని వారు అభిప్రాయపడుతున్నారు