IND vs ENG : ఇంగ్లండ్ తో జరిగే చివరి మూడు టెస్ట్ మ్యాచ్ లకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో విరాట్ కోహ్లి అనుకున్నట్లుగానే దూరంగా ఉన్నాడు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ శ్రేయాస్ అయ్యర్ పై వేటు పడింది. గతంలో సౌత్ ఆఫ్రికాతో శ్రేయాస్ పేవల ప్రదర్శన ఇచ్చాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో రెండు టెస్టుల్లోనూ రాణించలేకపోయాడు. దీంతో అతనిని బీసీసీఐ దూరం పెట్టింది. ఇక గాయాల కారణంగా రవీంద్ర జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎస్ రాహుల్ ను తీసుకున్నారు. మొత్తం జట్టు ఎలా ఉందంటే?
భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. టీం ఇండియా కీలక బ్యాట్ మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లి మరో మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పటికే గాయం కారణంగా రెండు మ్యాచ్ లు ఆడలేదు. దీంతో ఆయన సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటారన్న కథనాలు వచ్చాయి. అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ మిగిలిన మూడు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా షమీ కూడా దూరం కావాల్సి వచ్చింది. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో సిరీస్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో లెపార్ట్ స్పిన్నర్ సౌరబ్ కుమార్ ను జట్టులోకి తీసుకున్నారు.
యువ ఆటగాల్లు రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ కూడా జట్టులో కొనసాగుతున్నారు. మొత్తంగా ఇంగ్లండ్ తో జరిగే మూడు టెస్టులకు 17 మందిని ఖరారు చేశారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ తరుపున ఎవరెవరు ఆడుతారంటే..?రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ ఆశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ జట్టులో కొనసాగుతారు.