Telangana Land Survey : భూమికోసం, భుక్తి కోసం, దోపిడి పాలన విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు.. కానీ పోరాటం సాగుతున్న రోజుల్లో ముందు వరుసలో ఉన్న వ్యక్తులు తర్వాత కనుమరుగైపోయారు.. ఇదే నేపథ్యంలో అగ్రవర్ణాలకు చెందిన వారి దగ్గర ఎక్కువ శాతం భూములు బందీ అయి ఉన్నాయి.. ఈ క్రమంలో వారి వద్ద జీతగాళ్ళుగా, కౌలుదారులుగా బీసీ కులాలకు చెందిన వారు వ్యవసాయం చేసేవారు. అప్పట్లో చైతన్యం ఇంతగా లేకపోవడం, అక్షరాస్యత కూడా తక్కువగా ఉండడంతో బీసీలు అట్టడుగున ఉండేవారు.. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు వచ్చింది.. బీసీలు కూడా ఎదగడం ప్రారంభించారు..

ఈ ఎనిమిది సంవత్సరాల లో
తెలంగాణలో వెనుకబడిన కులాల జాబితాలో మున్నూరు కాపు, గౌడ, యాదవ్, గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు.. వీరిలో మున్నూరు కాపులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం.. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పై కులాలకు చెందినవారు ఆ వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు.. రైతు స్వరాజ్య వేదిక ఇటీవల నిర్వహించిన సర్వేలో 44 శాతం భూమి ఈ బిసి కులాల ఆ దినంలో ఉంది అని తెలిసింది.. ఇక 43% భూమి అగ్రవర్ణాల ఆధీనంలో ఉంది.. 26 శాతం మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు.. మిగతావారు వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు.. వారికి ఉన్న ఆ భూమిని కౌలుకు ఇస్తున్నారు.. ఇక ఈ కవులు వ్యవసాయం చేస్తున్నారు.. ఇక ఈ కౌలు వ్యవసాయం చేసేవారు కూడా బిసి కులాలకు చెందిన వారే కావడం గమనార్హం.
సర్వే సాగింది ఇలా
రైతు స్వరాజ్య వేదిక తెలంగాణలోని 20 జిల్లాల్లో సర్వే నిర్వహించింది.. 2,753 కుటుంబాలను వివిధ రకాల ప్రశ్నలు అడిగి వారి వద్ద నుంచి సమాధానాలు రాబట్టింది. అయితే ఇన్నాళ్లు ఎవరి వద్దయితే భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారో వారి భూమిని బీసీలు కొనుగోలు చేశారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి రైతుబంధు డబ్బు కూడా వస్తోంది. “నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మెజారిటీ భూములు మున్నూరు కాపు కులస్తుల ఆధీనంలో ఉన్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం భూములు యాదవులు, గొల్ల, కురుమ కులస్తుల ఆధీనంలో ఉన్నాయి. నల్లగొండ, వరంగల్ లో గౌడ్ లు ఎక్కువ శాతం సొంత భూములు కలిగి ఉన్నారని” బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు..
ఎందుకు ఈ మార్పు
తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి.. సకాలంలో వర్షాలు కురవడం, నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, విద్యుత్ సౌకర్యం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు వ్యవసాయంలో ఘన నీయమైన పురోగతి సాధించారు. పైగా అగ్రవర్ణాలు తమ భూములు అమ్ముకుని పట్టణాలు, నగరాల్లో ప్లాట్లు, ఇళ్ళు కొనడం ప్రారంభించారు.. దీంతో ఇన్నాళ్లు కౌలుదారులుగా జీవనం సాధించిన వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఇప్పుడు భూ యజమానులు అయ్యారు.