Krishnam Raju Anushka: ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు. పెదనాన్న కృష్ణంరాజు ఎంత ఒత్తిడి తెచ్చినా.. అసహనం వ్యక్తం చేసినా ఇప్పటికీ పెళ్లి మాట ఎందుకు ఎత్తడం లేదు. ఇక ప్రభాస్ తో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన హీరోయిన్ అనుష్క అంత ఏజ్ వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉన్నారు. అడిగితే ఇద్దరూ తాము ప్రేమించుకోవడం లేదని అంటారు. పెళ్లికి నో చెబుతారు. కానీ పెళ్లి మాత్రం ఇరువురూ చేసుకోరు. అసలు వాళ్ల కుటుంబంలో .. వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందన్నది ఇప్పటికీ మిస్టరీనే..

ప్రభాస్ కు పెళ్లి చేయాలని.. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలని ఉందని కృష్ణంరాజు ఎప్పటి నుంచో అంటున్నాడు. కానీ ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. మీడియా ముందుట బయటపడ్డాడు. మరి ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదన్నది.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానికంటే’ కూడా వైరల్ అయిన ప్రశ్న.
దీనికి ఇటు ప్రభాస్ కానీ.. అటు అనుష్క కానీ స్పందించలేదు. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. ఇంట్లో ఒప్పుకోకపోవడంతోనే ఒంటరిగా జీవిస్తున్నారని టాక్ నడిచింది.
కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య లో ఉండగా.. హీరోయిన్ అనుష్క వచ్చి చూసింది. ఈ వీడియోను కొందరు రహస్యంగా తీయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభాస్-అనుష్కల సంబంధం మరోసారి బయటపడింది. వీరిద్దరూ ఎంత కాదనుకున్నా వీరి మధ్యన రిలేషన్ ఉందన్న విషయం అనుష్క రాకతో తేటతెల్లమైంది.
కృష్ణంరాజు చివరి కోరిక.. ప్రభాస్ పెళ్లిని చూడాలని.. మరి ఇప్పటికైనా ఈ ముసుగులో గుద్దులాట వీడి ఒక్కటైతే చూడాలని అభిమానులంతా కోరుతున్నారు.
[…] […]