Janasena : జనసేనకు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రణరంగానికి అస్త్రశస్త్రాలతో పటిష్ట నిర్మాణంతో తయారవుతున్నాయి. ప్రత్యర్థుల విమర్శలు పవన్ కే లాభం జరుగుతున్నాయి. పవన్ ప్రచార రథం ‘వారాహి’ రంగు, సైజు మీద ఎన్ని రకాల వ్యతిరేక ప్రచారం చేయించాలో అన్నీ చేసింది వైసీపీ. జనసైనికులను మానసికంగా దెబ్బతీయడానికి వైసీపీ ఎంత చేయాలో అంతా చేసింది. చివరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ జరగడంతో వైసీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి.
పవన్ కళ్యాణ్ రథానికే ఇంత ప్రచారం వస్తే.. రేపొద్దున్న పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేస్తే ఇంకా ఎంత ప్రచారం రావాలి? పవన్ బరిలోకి దిగితే మరింతగా ఊపు రావడం ఖాయం. పార్టీ శ్రేణులు రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయడం ఖాయం. జన సైనికుల ఉత్సాహం ఎన్నికల సమయంలో జనసేనకు ఓట్లు వేయించే స్థాయిలో ఉపయోగ పడుతుంది. గ్రామాల్లో జనసేన విస్తరిస్తోన్న తీరు చూస్తుంటే జనసేన కోసం పని చేయాలనే ఆకాంక్ష అందరిలో పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన బలపడాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ టార్గెట్ చేయడం జనసేనకు ప్లస్ అవుతోంది. వైసీపీ కుట్రపూరిత రాజకీయాలే పవన్ కు బాగా మైలేజ్ తెచ్చిపెడుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం సినిమాలు చేస్తున్నారు. అప్పులు చేసి మరీ జనసేనను నడిపిస్తున్నాడు. ఆయనకు వేరే ఆదాయం లేకపోవడంతో సినిమాలు చేసే పవన్ జనసేనకు ఫండింగ్ చేస్తున్నారు.
జనసేన బలాబలాలు.. మంచి శకునాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.