Janasena contest alone in Telangana : తెలంగాణలో జనసేన పోటీచేస్తుందా? ఇది జనసేనకు లాభమా? నష్టమా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు 32 మంది కార్యనిర్వాహకులను టికెట్ల కోసం పరిశీలనకు నియమించింది. ఇది జనసేనకు ఏ విధంగా ఉపయోపడుతుంది.
జనసేన ఏపీలో మంచి జోరుగా ఉంది. మూడో శక్తిగా ఎదిగింది. అధికారమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. అది తెలంగాణలో పోటీచేయడం వల్ల అది ఆంధ్రా మీద ఎలాంటి ప్రభావం పడుతుందన్నది విశ్లేషించుకోవాలి. ఖచ్చితంగా పడుతుందన్నది అర్థం చేసుకోవాలి.
ఏపీ కంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రాలో 6 నెలలు ఆలస్యంగా జరుగుతాయి. రెండు ఒకేసారి జరిగితే ఆ ప్రభావం జనసేనపై పడకపోయి ఉండేది. కాబట్టి తెలంగాణలో ముందు ఎన్నికలు జరిగితే.. జనసేన పోటీచేసి ఫలితం ఏమాత్రం ఆశాజనకంగా లేకపోతే ఆంధ్రా రాజకీయాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో జనసేన పోటీ కరెక్టేనా? దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..