Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani 100 days jail: 100 రోజుల 'జైలు'కు ఫిక్స్ అయిన కొడాలి నాని!

Kodali Nani 100 days jail: 100 రోజుల ‘జైలు’కు ఫిక్స్ అయిన కొడాలి నాని!

Kodali Nani 100 days jail: ఏపీలో ( Andhra Pradesh) రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేసేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. ఇప్పటివరకు తెరవెనుక ఉన్న నేతలంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని ఫుల్ ఫిట్ గా కనిపించారు. నిన్ననే మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని చాలా క్లారిటీ గా మాట్లాడారు. కొంచెం పద్ధతిగా మాట్లాడుతునే.. తనలో ఉన్న పాత ధోరణిని బయటపెట్టారు. కూటమి ప్రభుత్వానికి ఏకంగా వార్నింగులు మీద వార్నింగులు ఇచ్చారు. పనిలో పనిగా తన జైలు జీవితం పై కూడా స్పష్టతనిచ్చారు.

రిమాండ్ కాలాన్ని..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో( YSR Congress ) దూకుడు కలిగిన నేతలంతా జైలు పాలయ్యారు. అయితే కొడాలి నాని వంతు ఎప్పుడు వస్తుందా అని కూటమి పార్టీ శ్రేణులే కాదు సామాన్య జనాలు కూడా ఆరా తీశారు. ఆయన అరెస్టు ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించిన వారే అధికం. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని అరెస్టు ఉంటుందని అంతా ప్రచారం నడిచింది. అదిగో ఇదిగో అంటూ చాలా హడావిడి ఉండేది. ఇంతలోనే కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ముంబైలో శస్త్ర చికిత్స చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిన్ననే అంబటి రాంబాబును పరామర్శించి.. తన అరెస్టుతో పాటు రిమాండ్ కాలాన్ని సైతం బయటపెట్టేశారు.

Also Read: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. 5 వేల ఉద్యోగాలు!

తప్పిన అంచనా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా కొడాలి నాని ( Kodali Nani ) మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా తాము విశ్రమించమని చెప్పుకొచ్చారు. అయితే దాదాపు రెండు సంవత్సరాల పాటు గుడివాడ నియోజకవర్గంలో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కనిపించలేదు కొడాలి నాని. దీంతో ఆయన భయంతో రాజకీయాలనుంచి తప్పుకుంటారని అంతా అంచనా వేశారు. కానీ అది తప్పు అని తేలిపోయింది. అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో.. ఇప్పటివరకు అరెస్టు అయిన వైసీపీ నేతల రిమాండ్ కాలాన్ని బట్టి పెట్టి మరి బయటపెట్టారు కొడాలి నాని. తాను సైతం అరెస్ట్ అవుతానని తేల్చేశారు. ఓ 100 రోజులకు ఆయన ఫిక్స్ అయ్యారు. కానీ కొడాలి నానిని అరెస్టు చేసి.. వంద రోజులకే విడిచి పెడతారా అని సెటైర్లు పడుతున్నాయి. గురుడుకు ఒక క్లారిటీ ఉందని.. తన జైలు జీవితం పై ఒక స్పష్టతకు వచ్చాక బయటకు వచ్చారని కూటమి పార్టీల శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version