Analysis on Agneepath Scheme దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న సంఘటన ‘అగ్నిపథ్’. మిలటరీ కోణంలో ఈ పథకాన్ని మనం ఆలోచించాలి. అగ్నిపథ్ అనేది మిలటరీకి సంబంధించిన రిక్రూట్మెంట్. అగ్నిపథ్ పథకం ద్వారా 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువకులను నియమిస్తారు. వీరిలో 25 శాతం మంది అత్యధిక ప్రతిభ కలిగిన వారిని పర్మినెంట్ సైనికులుగా గుర్తిస్తారు. సాధారణ సైనికులలాగే వారు పదవీ విరమణ పొందే వరకు ఉంటారు. రిటైర్ మెంట్ తరువాత పింఛన్, తదితర సౌకర్యాలు అనుభవిస్తారు. మిగతా 75 శాతం సైనికులు నాలుగేళ్లపాటు సైన్యంలో పనిచేస్తారు. ఆ తరువాత ఈ నాలుగేళ్ల పాటు వారికి 11 లక్షల 70 వేల జీతం.. గ్రాడ్యూటీ 11 లక్షల 70 వేలు.. మొత్తం 23,43,160 రూపాయలు అందిస్తారు.

ఈ మొత్తంతో 25 ఏళ్ల వయసులో వ్యాపారం లేదా.. ఈ సొమ్మును డిపాజిట్ చేసుకొని ఇతర ఉద్యోగాలను వెతుక్కోవచ్చు. ఇక పోలీసు నియామకాల్లో వీరికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 25 సంవత్సరాల యువకులకు 23 లక్షల నగదుతో పాటు ఆర్మీ శిక్షణ పొందిన వారుగా ఉంటారు. వారికి వ్యాపారం చేయాలనుకుంటే రుణ సౌకర్యం కూడా కల్పిస్తారని తెలుపుతోంది.
అయితే అగ్నిఫథ్ పథకంతో నాలుగేళ్లపాటు సైన్యంలో పనిచేస్తారు. ఆ తరువాత మేమేం చేయాలి..? అని ప్రశ్నిస్తున్నారు. సాధారణ నియామకాలతో పదవీ విరమణ పొందేవరకు దేశ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉత్సాహం ఉన్న యువకులను కొద్దికాలానికి వాడుకొని ఆ తరువాత ఇంటికి పంపడం వల్ల యువకుల్లో ఆశలు సన్నగిల్లుతాయి. దీంతో సైన్యంలో చేరడానికి ఎవరూ ముందుకు రారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సైన్యాన్ని తగ్గించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు.
మరి ఈ అగ్నిపథ్ పథకం లాభమా? నష్టమా? దీని వల్ల దేశానికి ఉపయోగమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

[…] […]