https://oktelugu.com/

Tees Maar Khan Teaser: పాయల్ నుండి మరో RX 100… హీరో ఆది పంట పండిందే!

Tees Maar Khan Teaser: ఒక్క సినిమా పాయల్ రాజ్ పుత్ ని పిచ్చ పాప్యులర్ చేసింది. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 ఓ సంచలనం. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దర్శకుడు అజయ్ భూపతి కొంచెం కొత్తగా ఆలోచించాడు. ఇక నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో పాయల్ విచ్చలవిడిగా నటించారు. పాయల్ గ్లామర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. పాయల్ నుండి ఆ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 18, 2022 / 05:42 PM IST
    Follow us on

    Tees Maar Khan Teaser: ఒక్క సినిమా పాయల్ రాజ్ పుత్ ని పిచ్చ పాప్యులర్ చేసింది. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 ఓ సంచలనం. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దర్శకుడు అజయ్ భూపతి కొంచెం కొత్తగా ఆలోచించాడు. ఇక నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో పాయల్ విచ్చలవిడిగా నటించారు. పాయల్ గ్లామర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. పాయల్ నుండి ఆ రేంజ్ హిట్ మళ్ళీ రాలేదు. ఆర్ఎక్స్ 100 ని తలపించేలా పాయల్ ప్రధాన పాత్రలో ‘ఆర్ డి ఎక్స్ లవ్’ టైటిల్ తో ఓ మూవీ విడుదలైంది. అయితే ఆ మూవీకి ఆదరణ దక్కలేదు.

    Aadi, Payal Rajput

    పిచ్చెక్కించే గ్లామర్ ఉన్నప్పటికీ సరైన హిట్స్ పడకపోవడంతో పాయల్ స్టార్ రేంజ్ కి చేరుకోలేకపోయారు. ఇక పాయల్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్. ఆది సాయి కుమార్ హీరోగా నటించారు. ఈ మూవీ టీజర్ నేడు విడుదల కాగా… ఆమె నుండి మరో ఆర్ఎక్స్ 100 వస్తుందేమో అనిపిస్తుంది. టీజర్ లో ఆదితో పాయల్ ఓ రేంజ్ లో రొమాన్స్ పండించింది. బికినీలు ధరించి బీచ్ లో స్కిన్ షోకి తెరలేపింది.

    Also Read: Sudigali Sudheer Comments On Rashmi: యాంకర్ రష్మీ గురించి సంచలన విషయం చెప్పి ఎమోషనల్ అయిన సుడిగాలి సుధీర్

    తీస్ మార్ ఖాన్ టీజర్ లో పాయల్ తీరు చూసిన ప్రేక్షకులు మరోసారి ఆర్ఎక్స్ 100 రుచి చూపించనుందని ఫిక్స్ అయ్యారు. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నట్లున్నాయి. ఈ క్రమంలో తీస్ మార్ ఖాన్ మూవీతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఈ చిత్రానికి కిరాతక అనే టైటిల్ నిర్ణయించారు. తర్వాత మనసు మార్చుకొని తీస్ మార్ ఖాన్ అని ఫిక్స్ చేశారు.

    Aadi ,Payal Rajput

    ఒక్క హిట్ కోసం ఆది సాయి కుమార్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన డెబ్యూ మూవీ ప్రేమ కావాలి విజయం సాధించింది. రెండో చిత్రం లవ్లీ సైతం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అనంతరం వరుసగా డజనుకు పైగా చిత్రాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ విరామం లేకుండా ఆది సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తీస్ మార్ ఖాన్ చిత్రానికి కళ్యాణ్ జి గొంగన దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్, ఆదిలకు ఈ మూవీ చాలా కీలకం.

    Also Read:Balakrishna- Boyapati Srinu- Ram Pothineni: రామ్-బోయపాటి సినిమాలో జై బాలయ్య… పాన్ ఇండియా అంటూ ఇవేం ప్రయోగాలు బాబోయ్!

     

    Tags