Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. దాని చరిత్రను ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటికీ కర్ణాటకలో ఓల్డ్ మైసూర్ నుంచి 23 మంది సీఎంలుగా చేశారు. అందులో 16 మంది రెండే సామాజికవర్గాల వారు కావడం విశేషం. లింగాయత్ లు 31 సంవత్సరాలు పరిపాలించగా, ఒక్కళిగులు 18 సంవత్సరాలు పరిపాలించారు. ఇక వెనుకబడిన వర్గాలు 19 సంవత్సరాలు పాలించారు. బ్రాహ్మణులు 8 సంవత్సరాలు పాలించారు. ఇక కర్ణాటకలో లింగాయత్ లో 25-30 శాతం దాకా జనాభా ఉంటుంది. ఇందులో సామాజిక న్యాయం ఎక్కడ ఉంటుదన్నది ఆలోచించాలి.
కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 50 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తెలుగు ప్రజలు నిర్దేశించగలరు. అంటే ఆ ప్రాంతాలు మొత్తం ఒకప్పుడు నిజాం ఏలుబడిలో ఉండేవి.. ఇక నామినేషన్లకు గడువు పూర్తి కావడం, వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదు. కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అసంతృప్త నేతలను చేర్చుకుంటున్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు జగదీష్ శెట్టార్ ను చేర్చుకుని కమల నాధులకు షాక్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఇది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఇక కుమారస్వామి పార్టీ కూడా జోరుగానే ప్రచారం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం మీద టీవీ9 కన్నడ, సీ ఓటర్స్ సర్వే నిర్వహించింది.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించింది.
కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకున్న సామాజిక వర్గాల చరిత్రపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.