Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Story Rejected Heroes: పెద్ది మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు...కారణం...

Peddi Movie Story Rejected Heroes: పెద్ది మూవీని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు…కారణం ఏంటంటే..?

Peddi Movie Story Rejected Heroes: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అది పూర్తిగా దర్శకుడి చేతిలోనే ఉంటుంది. ఆయన తన టీమ్ ను ఎంత వాడుకుంటే అంత మంచి అవుట్ పుట్ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే బుచ్చిబాబు లాంటి దర్శకుడు సైతం ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఆ సినిమా అందించిన సక్సెస్ తో ఆయన ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు… ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

ఇక రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను ముగ్గురు స్టార్ హీరోల కైతే వినిపించారట. వాళ్ళు ఎవరు అంటే అందులో మొదట గా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది… ఈ కథ ఎన్టీఆర్ కి చెప్పినప్పటికి ఎన్టీఆర్ కి ఇందులో ఉన్న వేరియేషన్స్ బాగా నచ్చిన కూడా ఈ సినిమాని చేయలేకపోయాడు. కారణం ఏంటి అంటే అప్పటికే అతను చాలా సినిమాలకు కమిటై ఉన్నాడు.

కాబట్టి ఇప్పుడప్పుడే కుదరదని చెప్పారట. ఇక ఆ తర్వాత ఈ కథని అల్లు అర్జున్ కి కూడా వినిపించారట. అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం తను ఉన్న బిజీ వల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు. ఇక తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కి సైతం ఈ కథ చెప్పారు. కానీ సూర్య ఇందులో కొన్ని మార్పులు చేర్పులు అడగడంతో బుచ్చిబాబు తనను పక్కన పెట్టేసి సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ దగ్గరికైతే ఈ కథను తీసుకెళ్లాడు.

మొత్తానికైతే రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు ఈ కథను విని ఓకే చేశారు. రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు ను సుకుమార్ బాగా నమ్మాడు. మరి వాళ్ళిద్దరు రామ్ చరణ్ నమ్మకాన్ని నిలబెడతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular