Home Blog Page 98

కాపులు కూటమిని విడిచిపెట్టగలరా?!

Kapu Politics AP
Kapu Politics AP

Kapu Politics AP: ఏపీ రాజకీయాలు ఎప్పుడు కాపులు చుట్టూనే తిరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. కాపులను తమ వైపు టర్న్ చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మెజారిటీ కాపులు కూటమికి అండగా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది అంత ఈజీ కాదు. అయితే అదే పనిగా ప్రయత్నం చేస్తోంది. మరోవైపు గోదావరి జిల్లాలో కాపు సదస్సులు నిర్వహిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి అండగా నిలిచిన వారికి రాజకీయంగా తాము అండగా నిలబడతామని చెబుతున్నారు. అయితే ఈ కాపు సమావేశాలు రాజకీయ ప్రేరేపితం అన్న టాక్ కూడా ఉంది. కొన్ని రాజకీయ పార్టీల స్పాన్సర్ షిప్ తోనే ఈ సమావేశాల నిర్వహణ జరుగుతుందన్నది ఒక అనుమానం. ఆపై బహిరంగ రహస్యం కూడా.

* విసిగి వేసారి పోయిన కాపులు..
అయితే తమ చుట్టూ జరిగే రాజకీయం కాపులకు తెలియంది కాదు. దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నేత వంగవీటి మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన హత్య జరిగింది. టిడిపి మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రంగా హత్య కేసు విచారణ జరిగి నిందితుల అరెస్టు జరుగుతుందని చాలా ఊహించారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. అరెస్టు జరగలేదు సరి కదా దానికోసం ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. అది మొదలు ఎన్నో ఎన్నికలు వచ్చాయి. కాపులతోపాటు మోహన్ రంగా ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అంటే ఎన్నికల కథా వస్తువుగా కాపులను తీసుకున్నారన్నమాట ఏపీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు.

* వర్కౌట్ కాని సదస్సులు..
మొన్ననే గోదావరి జిల్లాలో ఒక సదస్సు పెట్టారు కాపుల తో. పట్టుమని పదివేల మంది కూడా రాలేదు. శ్రీకాకుళంలో సైతం కాపుల సభ పెట్టారు. తూర్పు కాపుల పేరిట ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పట్టుమని వెయ్యి మంది కూడా రాలేదు. ఒక్క మాట నిజం కాపులు విసిగి వేసారి పోయారు. అంతెందుకు 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన కంచాల ఉద్యమం చేపట్టమన్నాడు. దీపాలు వెలిగించమన్నాడు. అన్ని చేశారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే ఉద్యమాన్ని మూసేశాడు. ఆయనది సైతం రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని తేలిపోయింది. అందుకే ఎందుకు వచ్చింది ఈ బాధ.. ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి జై కొడతాం అన్నట్టు మెజారిటీ కాపుల అభిప్రాయంగా మారింది. అంతే తప్ప రాజకీయ ప్రేరేపిత కుల సదస్సులకు కాలం చెల్లిపోయింది. చంద్రబాబు విషయంలో కాపులను దూరం చేస్తామంటే మధ్యలో పవన్ ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకుంటే మంచిది.

హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్.. కోట్ల ఆటగాళ్లు.. చివరికి ఇలా అయ్యారు..

IPL 2027
IPL 2027

IPL 2027: ఐపీఎల్ లో కొంతమంది ఆటగాళ్ల మీద కోట్ల వర్షం కురిసింది. వారికి ఆయా జట్ల యాజమాన్యాలు పోటీపడి కనక వర్షం కురిపించాయి. వారి మీద భారీ అంచనాలు పెట్టుకున్నాయి. కానీ, వాటిని నిలబెట్టుకోవడంలో వారు విఫలమయ్యారు. దీంతో యాజమాన్యాలు ఒకటి, రెండు అవకాశాలు ఇచ్చాయి. ఆ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్లు పొమ్మనలేక పొగబెట్టాయి. ఫలితంగా ఆ ప్లేయర్లు బయటికి రావాల్సిన పరిస్థితి.

ఐపీఎల్ 2027 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని జట్ల సారధులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా తమ సారథ్యం వహిస్తున్న జట్లనుంచి బయటకు రావాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆ జాబితాలో హార్థిక్ పాండ్యా.. రిషబ్ పంత్ ఉన్నారు. హార్దిక్ ముంబై జట్టుకు.. రిషబ్ లక్నో జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. గత రెండు సీజన్లుగా వీరిద్దరూ అంతగా ఆయా జట్ల మీద ప్రభావం చూపించలేకపోయారు. మీరు మాత్రమే కాకుండా చెన్నై జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా విఫల సారధి జాబితాలో ఉన్నాడు.

లక్నో జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు అందించలేకపోవడంతో.. 27 కోట్ల పంత్ తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఏకంగా 15 కోట్లకు ఢిల్లీ జట్టుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వేగంగా అడుగులు వేస్తున్న సమాచారం. 27 కోట్ల ఆటగాడు సరిగ్గా ఆడ లేకపోవడంతో విఫల సారథిగా మిగిలిపోయాడు.

అత్యంత విజయవంతమైన గుజరాత్ జట్టు నుంచి ముంబైకి మారిపోయాడు హార్దిక్. 2024లో అతడు ముంబై జట్టుకు నాయకుడిగా వచ్చాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా ముంబై జట్టు అతని నాయకత్వంలో గొప్పగా ఎదగ లేక పోయింది. మైదానంలో వ్యూహాత్మకంగా పాండ్యా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అందువల్లే అతడిని మేనేజ్మెంట్ పక్కకు తప్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో జైస్వాల్ మీద కన్ను వేసినట్టు సమాచారం. జైస్వాల్ కూడా ముంబై జట్టుకు ఆడాలని అనుకుంటున్నాడు.. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ కు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్ని వాస్తవ రూపం దాల్చుతాయో తేలాల్సి ఉంది.

లోక్‌సభలో 2/3 మెజార్టీ కోసం బీజేపీ వ్యూహం... రెబల్సే పావులు!

BJP strategy
BJP strategy

BJP strategy: ఇండీ కూటమి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు వ్యతిరేకంగా నిలబడటంతో బీజేపీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. సాధారణ మెజార్టీతో సరిపోదని, లోక్‌సభలో 2/3 మెజార్టీ సాధించి బిల్లులను స్వతంత్రంగా ఆమోదించుకోవాలని నిర్ణయించింది. ఈ లక్ష్యం సాధించడానికి ప్రతిపక్షాల నుంచి ఎంపీలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి.

ప్రస్తుత బలా బలాలు..
ప్రస్తుతం 540 సభ్యులున్న లోక్‌సభలో ఎన్‌డీఏకు 293 ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లుల ఆమోదానికి మొత్తం సభ్యుల్లో 2/3 మంది(అంటే 360 మంది) మద్దతు అవసరం. ప్రస్తుత సంఖ్యతో ఎన్‌డీఏకు ఇంకా 67 మంది ఎంపీలు కొరత ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి బీజేపీ ప్రతిపక్షాల్లోని అసంతృప్త ఎంపీలపై దృష్టి పెట్టింది.

బెంగాల్, మహారాష్ట్రలో కసరత్తు..
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) నుంచి 6 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు మళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసంతృప్తి, స్థానిక రాజకీయ సమీకరణలు, వ్యక్తిగత ఆకాంక్షలు ఈ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ 26 మంది ఎంపీలు ఎన్డీఏలో చేరితే సంఖ్య 319కి చేరుతుంది. ఇంకా 41 మంది ఎంపీలు కావాల్సి ఉంటుంది. ఇది చిన్న సంఖ్య కాదు కానీ, రాష్ట్రాల వారీగా చూస్తే అసాధ్యం కాదు.

ఎస్‌పీ ఎంపీలపై దృష్టి..
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు. అఖిలేశ్‌ యాదవ్, డింపుల్‌ యాదవ్‌ సహా ఈ బృందం ఉంది. ఇక్కడ కొంతమంది ఎంపీలు బయటికి రావచ్చనే ప్రచారం బలంగా ఉంది. ఎస్‌పీలో అంతర్గత అసంతృప్తి, టికెట్‌ పంపకాలు, స్థానిక నాయకత్వ వివాదాలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 10–15 మంది ఎంపీలు కూడా మద్దతు ఇచ్చినా లేదా చేరినా ఎన్‌డీఏలో చేరినా బలం 330–335కి చేరుతుంది. మిగిలిన అంతరం చాలా తక్కువగా మారుతుంది.

రాజకీయ పరిణామాలు ఏమిటి?
2/3 మెజార్టీ వచ్చినట్లయితే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ వంటి సున్నితమైన బిల్లులను ఎన్‌డీఏ స్వేచ్ఛగా ముందుకు తీసుకెళ్లవచ్చు. ప్రతిపక్షాల మద్దతు అవసరం ఉండదు. టీఎంసీఈ, శివసేన (ఉద్ధవ్‌), ఎస్‌పీలో విభజన ఏర్పడితే వాటి సంఘటన బలహీనపడుతుంది. రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావం పడుతుంది.

నైతిక, చట్టపరమైన ప్రశ్నలు..
రెబల్స్‌ను ఆకర్షించడం రాజకీయంగా సాధారణం అయినప్పటికీ, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందని విమర్శలు వస్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను మార్చడం ఓటర్ల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దక్షిణ రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై ఆందోళన చెందుతున్న సమయంలో ఈ మెజార్టీ వచ్చినట్లయితే ఉత్తర–దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుంది.

ఎన్డీఏ ప్రస్తుతం చేస్తున్న కసరత్తు విజయవంతమైతే లోక్‌సభలో శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. అయితే ఇది సులభమైన పని కాదు. ప్రతిపక్షాల్లోని అసంతృప్తిని ఎంతవరకు మూలధనం చేసుకోగలుగుతుందనేది బీజేపీ విజయానికి కీలకం. రాబోయే వారాల్లో ఈ రాజకీయ నాటకం ఎలా ముగుస్తుందో చూడాలి. ఈ వ్యూహం ఫలించినా, విఫలమైనా భారత రాజకీయాల్లో నంబర్‌:ఏమ్‌ ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది.

చంద్రబాబు రంగంలోకి.. మారిన సీన్

Chandrababu
Chandrababu

Chandrababu: వాడు రంగంలోకి దిగనంతవరకే.. పవర్ ఫుల్ డైలాగ్ ఇది సినిమాల్లో. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే అదే అర్థం అవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీని సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ కుదిపేస్తోంది. దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. లా అండ్ ఆర్డర్ తో కూడుకున్నది ఈ వ్యవహారం. కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు తరువాత ఆ యువకుడి ఆచూకీ లేదు. ఇటువంటి సమయంలో కుమారుడి కోసం ఆరాటపడుతున్న ఆ తల్లిని, కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకోవాలి. వారి వైపు న్యాయం జరిగేలా చూడాలి. ఇప్పుడు చంద్రబాబు చేసింది అదే. బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. తప్పకుండా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తల్లిని ఓదార్చారు. దీంతో ఆ కుటుంబం మనసు నిండా ఉన్న బాధ కొంతవరకు తీరింది.

* కాపు అనే మాట హైలెట్..
ఇదే విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అంతకుముందు ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయమని అడిగే కంటే.. ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని… కూటమికి కాపులు ఓట్లు వేస్తే వారే బాధితులు అవుతున్నారని.. లాకప్ డెత్ చేసేసారని.. కనీసం మృతదేహం అయిన ఇప్పించాలని ఏవేవో మాటలు అనేశారు. దీనిని పరిశీలించకుండానే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ కుర్రాడు చేసిన నేరాలను ప్రస్తావిస్తూ అవి చిన్న చిన్నవి అంటూ.. ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన సైతం కూటమి ప్రభుత్వంపై బురదజల్లేసారు. ఏదో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆ యువకుడు సాయికృష్ణను అరెస్టు చేయించి ఇబ్బంది పెట్టారు అన్నట్టు మాట్లాడారు. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం అలా లేదు. ఆయన తన చతురతతో పాటు బాధిత కుటుంబం పై చూపిన శ్రద్ధ, మానవీయ కోణం మరువరానిది. ఈ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్నారో.. ఆ కుటుంబ సభ్యులే సంతృప్తికరంగా.. సీఎం చంద్రబాబు చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

* చంద్రబాబు రావడంతో మారిన సీన్..
గత మూడు రోజులుగా ఏపీని కుదిపేసింది సాయి కృష్ణ అదృశ్యం ఎపిసోడ్. ఇది పూర్తిగా పోలీస్ శాఖ పరిధిలోనిది. పైగా సాయి కృష్ణ పై అనేక కేసులు ఉన్నాయి. సాధారణంగా ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీస్ విచారణ అనేది కామన్. అయితే దానిని రాజకీయ దూర దృష్టితో చూసేసారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అదృశ్యమైంది కాపు యువకుడు కాబట్టి ఇదో రాజకీయ అస్త్రం అవుతుందని భావించారు. ఒక మరక చల్లే ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు రాష్ట్రంలో లేరు. సింగపూర్ లో ఉన్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చి ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిజిపితో పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. కృష్ణలంకలో సాయి కృష్ణ నివాసానికి స్థానిక ఎమ్మెల్యేను పంపించారు. ఆ కుటుంబ సభ్యులను సచివాలయానికి తీసుకొచ్చి వారి సమస్యను విన్నారు. అసలేం జరిగింది? అనే విషయాన్ని ఆరా తీశారు. సాయి కృష్ణ ను అరెస్ట్ చేసిన సీఐ ను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసును కూడా నమోదు చేశారు. ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపడుతున్నారు. సాయి కృష్ణ తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మీరు అనుమానిస్తున్నట్టు అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కాపు సామాజిక వర్గం అన్న విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు మాత్రం పరిష్కార మార్గం చూపిస్తానన్నారు. దీంతో నిన్నటి వరకు తమకు అన్యాయం జరిగిందన్న బాధతో ఉన్న ఆ బాధ్యత కుటుంబం కొంత తేలికపడింది. చంద్రబాబుతో కలిసిన తరువాత కొంత స్వాంతన చేకూరింది. మాకు ఈ కులాలు వద్దు.. రాజకీయాలు వద్దు.. కావాల్సింది న్యాయం.. తెలియాల్సింది వాస్తవం అన్నట్టు.. బాధిత కుటుంబం చెప్పడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు నీరు గారి పోయాయి.

షర్మిల పొలిటికల్ సైలెన్స్..!

YS Sharmila
YS Sharmila

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మొన్న రాజ్యసభ పదవి దక్కకపోవడం నుంచి షర్మిల సైలెన్స్ గా ఉన్నారు. పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆమె ఆలోచన మారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హై కమాండ్ రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పింది. దీని వెనుక పెద్ద రాజకీయం నడిచినట్టు షర్మిల అనుమానిస్తున్నారు. ఇప్పుడు పదవి ఇవ్వలేదు సరి కదా భవిష్యత్తులో తనను పక్కన పెట్టేస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనకు వచ్చారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా కొన్ని రోజులు రాజకీయంగా మౌనముద్రలోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ వైఖరి మారింది. ఆ పార్టీ ఆలోచన మారుతోంది. కేవలం ఏపీ కోసం కాంగ్రెస్ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. జాతీయస్థాయి పరిణామాలతో ఏపీలో వ్యవహరిస్తే తన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని షర్మిల ఒక అంచనాకు వచ్చారు. అందుకే తాత్కాలికంగా కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరం కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

* కాంగ్రెస్ కొత్త ఆలోచన..
దేశవ్యాప్తంగా బలం పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు బిజెపి చేతిలో దెబ్బతిన్న ఒక్కో పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తుంది. మొన్ననే బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ సాయాన్ని వెతుక్కుంటూ వచ్చారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇంకోవైపు బిజెపి బారిన పడ్డ చాలా ప్రాంతీయ పార్టీలు.. జాతీయస్థాయిలో అండ కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఈ తరుణంలో ఏదో ఒక రోజు జగన్ సైతం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారన్న విశ్లేషణలు ఉన్నాయి.

* అప్పటి పరిస్థితులకు తగ్గట్టు..
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా పొలిటికల్ సీన్ మారనుంది. వచ్చే ఏడాది కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కానీ బిజెపికి వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం ట్రెండ్ మారుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కు దగ్గర కాక తప్పదు. షర్మిల లో కూడా అదే అనుమానం. జాతీయస్థాయిలో అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకుంటే తన పరిస్థితి ఏంటనే ఆందోళన ఆమెలో ఉంది. పైగా కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నది ఒక అనుమానం. పైగా ఏపీ పార్టీ పగ్గాలు అందుకొని రెండు సంవత్సరాలకు పైగా దాటుతోంది. ఈ క్రమంలో తనను పదవి నుంచి తీసేస్తే సామాన్య కార్యకర్తగా కొనసాగలేని పరిస్థితి. పోనీ ఏఐసీసీలోకి తీసుకున్నా.. ఎటువంటి పవర్ పాలిటిక్స్ చేయలేరు. అందుకే కొద్ది రోజులపాటు సైలెంట్ రాజకీయాలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో

తెలంగాణ జనసేన వెనుక బిజెపి!

Janasena
Janasena

Telangana Janasena: తెలంగాణలో జనసేన ను మరింత యాక్టివ్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ వెనుక బిజెపి ఉందన్నది ఒక అనుమానం. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ ఇంటికి వెళ్లారు. అటు తరువాతనే పవన్ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. అందుకే పవన్ వెనుక బిజెపి ఉందన్న అనుమానం ఎక్కువమందిలో ఉంది. పైగా ఇటీవల జరిగిన పరిణామాలు చాలా వేగంగా ఉన్నాయి. ఒకదానికొకటి సింక్ అవుతున్నాయి. అయితే తెలంగాణలో చంద్రబాబు స్లో అయ్యారు. పవన్ కళ్యాణ్ దూకుడు పెంచుతున్నారు. ఇదంతా వ్యూహాత్మక మా అన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ సమాజంలో చంద్రబాబును వ్యతిరేకిగా చూపించారు. అందుకే ఆయన సైలెంట్ గా ఉంటేనే తెలంగాణ రాజకీయాల్లో రాణించగలరు. అదే పవన్ దూకుడుగా వ్యవహరిస్తే… మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుందన్నది ఒక అంచనా.

* క్లీన్ ఇమేజ్..
పవన్ కళ్యాణ్ కు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. ఆపై సినీ చరిష్మ కూడా ఉంది. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధించేవారు ఉన్నారు. సినీ పరిశ్రమ అండదండలు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ ఆయనకు తెలంగాణలో కలిసి వచ్చే అంశాలు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందుకే ఒకవైపు పవన్ ద్వారా ఆయన పార్టీని బలోపేతం చేయిస్తూనే.. బిజెపి సైతం బలపడుతూనే.. ఎన్నికల చివరి నిమిషంలో టిడిపి సహకారం తీసుకొని అధికారంలోకి రావాలన్నది బిజెపి ప్రణాళికగా తెలుస్తోంది. ఈ సైలెంట్ వ్యూహంతో భారీ ప్రణాళిక వేసింది బిజెపి.

* ఏపీ మాదిరిగానే..
ఏపీ మాదిరిగా సుదీర్ఘకాలం తెలంగాణలో సైతం రాజకీయం చేసి రాణించాలనుకుంటున్నారు పవన్. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ను క్రియేట్ చేసి.. ఏపీ మాదిరిగా పొత్తులతో ముందుకు వెళ్లి మంచి విజయాన్ని అందుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. అయితే ప్రధాని పర్యటన తరువాత పవన్ వైఖరిలో మార్పు రావడానికి గమనించాయి తెలంగాణ పార్టీలు. అందుకే అప్పుడే పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టాయి. కవిత లాంటివారు తెలంగాణలో ఇప్పుడు ఉన్న పార్టీలు చాలు. సినిమా వారిని నమ్మే పరిస్థితిలో లేము అంటూ తేల్చి చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా భయం కనిపిస్తోంది. ఇదంతా పవన్ వల్లే. పవన్ వెంట బీజేపీ ఉందన్న భయంతోనే తెలంగాణలో రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. కానీ పవన్ మాత్రం తెలంగాణలో సైతం సత్తా చాటాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

పునర్విభజన బిల్లు.. ఏపీలో ఆ పార్టీకి షాక్!

Delimitation Bill
Delimitation Bill

Delimitation Bill: ఏపీలో నియోజకవర్గాల పెంపు కచ్చితంగా ఉంటుందని నేతలు నమ్మకంగా ఉన్నారు. మొన్ననే పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి వెనక్కి తీసుకుంది కేంద్రం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. మూడింట రెండో వంతు మెజారిటీ లేక వీగిపోయింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి మారింది. బెంగాల్లో టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ శిబిరానికి వచ్చారు. మరోవైపు మహారాష్ట్రలో సైతం చాలామంది ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. తమిళనాడులో స్టాలిన్ సైతం ఈసారి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి పార్లమెంటులో మహిళా బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పెట్టనుంది కేంద్రం. ఆమోదిస్తే దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు పెరుగుతాయి.

* భారీగా సీట్ల పెరుగుదల..
జనాభాతో సంబంధం లేకుండా ఇప్పుడున్న అసెంబ్లీతో పాటు ఎంపీ సీట్లు 50 శాతం పెంచేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. అదే జరిగితే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 80 వరకు పెరగవచ్చు. పార్లమెంటు సీట్లు మరో 13 వరకు పెరుగుతాయి. కచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా తెలుగుదేశం ఉంది. తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదు.

* జనసేనలో చేరికలు..
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి పక్కా సమాచారం జనసేనకు ఉంది. అందుకే ఆ పార్టీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది ఓ 14 మంది నేతలతో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకులు, ఆ పార్టీపై అసంతృప్తిగా ఉండే నేతలు జనసేనలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు ప్రాతినిధ్యం పెరిగితే కీలక నేతలకు చాన్స్ రావచ్చు. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు తో పాటు అసంతృప్తులను సైతం తగ్గించవచ్చు. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పునర్విభజన పై లోలోపల భయపడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు వెనక్కి వెళ్లిపోవడంతో సంతోషించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ బిల్లు పార్లమెంటు ముంగిటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే తమకు ఇబ్బందులు తప్పవు అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది.

అసెంబ్లీకి జగన్.. వారి ఆదేశాలు పాటించాల్సిందే!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు విషయంలో మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు జగన్ తప్పకుండా హాజరవుతారు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన ఇది సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదట. మెజారిటీ ప్రజలు కోరుకున్న అభిప్రాయం ఇదట. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. పార్టీ బలం పుంజుకుందా లేదా అన్నది పక్కన పెడితే.. ఎక్కువమంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీకి వెళ్లక పోవడాన్ని సామాన్య జనాలు సైతం వ్యతిరేకించారు. 65 శాతం మంది ప్రజలు దీనిపై అభ్యంతరాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరైతే మంచిది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

* ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. గతంలో చంద్రబాబుకు 23 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇదే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఓ అయిదుగురు, ఆరుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది కదా అని ఇదే జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నిబంధనలతో పనిలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అధికారం ఉంటే తప్ప.. హోదా ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తటస్తులు, విద్యాధికులు ఆయన నిర్ణయాన్ని బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో కూడా ఇదే అంశాన్ని ఎక్కువమంది ప్రస్తావిస్తున్నారు.. అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లక తప్పదు అని తెలుస్తోంది.

* వీకెండ్ ప్రెస్ మీట్ లు..
తనకు ప్రతిపక్ష నేత హోదా రాకపోవడంతో వారాంతపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై కాకుండా.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులను పిలిచి అదే పనిగా జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు పై మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆన్ రికార్డ్ అవుతుంది. ప్రజా సమస్యలు ప్రస్తావించిన వారవుతారు. వాటికి పరిష్కార మార్గం చూపిన వారు అవుతారు. అందుకే ఎక్కువమంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించారు. సొంత పార్టీ శ్రేణుల అభిప్రాయం కూడా అదే.

* ఆ ప్రతిపాదన వచ్చినా..
మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్దామని పార్టీ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారట. అయితే తాను రాను మీరు వెళ్ళండి అంటూ సూచించారట. తాను వస్తే రన్నింగ్ కామెంట్రీ రూపంలో కూటమి ఎమ్మెల్యేల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వెళ్తే తనకు అభ్యంతరం లేదని జగన్ చెప్పారట . అందుకు పెద్దిరెడ్డి ఒప్పుకోలేదట. అయితే కూటమి రెండేళ్ల పాలన పూర్తయింది. జగన్ అసెంబ్లీకి హాజరు విషయంలో ప్రజాభిప్రాయం ఇలా ఉంది. అందుకే ఈ వర్షాకాల సమావేశాల నుంచి జగన్ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో కూడా ఇటువంటి ప్రచారం జరిగింది కానీ.. కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

నాకు ‘అది’ లేదు.. పెళ్లి చేసుకో.. నీకు ఇష్టమొచ్చిన వ్యక్తితో కాపురం చేయి.. పిల్లల్ని కను

Kanpur Professor Matrimony
Kanpur Professor Matrimony

Kanpur Professor Matrimony: అది కాన్పూర్.. అక్కడి ఓ యూనివర్సిటీలో ఓ మహిళ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని పోరు పెడుతుంటే.. తట్టుకోలేక మాట్రిమోనీలో తన వివరాలు నమోదు చేసింది. తన విద్యార్హతలు.. తనకు కావలసిన లక్షణాలు అన్నింటిని అందులో పొందుపరిచింది.

అకస్మాత్తుగా ఆమెకు ఒక రోజు కాల్ వచ్చింది. అది స్కాట్లాండ్ దేశం నుంచి. అతడు కూడా భారతీయుడే. అక్కడే కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాడు.. అతడు చెప్పిన వివరాలను చూసి ఆ ప్రొఫెసర్ ఆనంద పడింది. కానీ చివర్లో అతడు వ్యక్తం చేసిన విషయాలను చూసి షాక్ అయింది.

స్కాట్లాండ్లో పనిచేస్తున్న అతడు.. సంసార జీవితానికి పనికిరాడు. అతడు ఉన్నత విద్యావంతుడు. భారీగానే సంపాదిస్తున్నాడు. అతడు సంసారానికి పనికి రాకపోవడంతో.. తనకు తగ్గ లక్షణాలు ఉన్న వ్యక్తితో ఉంటున్నాడు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెబుతుంటే.. తట్టుకోలేక తన వివరాలను మ్యాట్రిమోనీ సైట్లో నమోదు చేశాడు. కాన్పూర్ ప్రొఫెసర్ వివరాలు మొత్తం నచ్చడంతో అతడు.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశాడు.

“నేను సంసార జీవితానికి పనికిరాను. నేను ఈ ప్రాంతంలో ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నాను. నా స్థితిని మీరు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అందువల్లే ఈ వేదికలో నా వివరాలు నమోదు చేశాను. మీ వివరాలు నాకు నచ్చాయి. మీకు ఇష్టముంటే పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మీకు మీరు నచ్చిన వ్యక్తితో ఉండవచ్చు. నేను ఇండియాకు వచ్చినప్పుడు నాతోపాటు కలిసి ఉంటే సరిపోతుంది. నేను మిమ్మల్ని ఏమీ చేయను.. మీరు నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు. అవసరమైతే పిల్లలు కూడా కనొచ్చు..” ఇలా అతడు తన గురించి చెప్పడంతో ఆ ప్రొఫెసర్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.

కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా ఇలానే ఉంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే.. తాము ఆ పనికి సహకరించమని.. వేరే మహిళలతో ఉంటున్నామని.. పెళ్లి మాత్రం చేసుకుందామని.. మీకు ఇష్టం వచ్చిన మహిళలతో ఉండొచ్చని.. అవసరమైతే వాళ్లతో పిల్లలు కూడా కనవచ్చని.. ఇండియాకు వచ్చినప్పుడు కలిసి ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.. ఈ తరహా మగవాళ్ళు, ఆడవాళ్లు ఇటీవలి కాలంలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమందిలో అను లక్షణాలు సక్రమంగా ఉన్నప్పటికీ వారు వైవాహిక జీవితం పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదు. పైగా ఆడవాళ్లు ఆడవాళ్ళతో.. మగవాళ్ళు మగవాళ్ళతో కలిసి ఉండడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

ఈ తరహా లక్షణాలు ఉన్నవాళ్లు దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. పైగా దానికి లావెండర్ వెడ్డింగ్ అని పేరు పెడుతున్నారు. విదేశాలలో లావెండర్ వెడ్డింగ్ అనేది కామన్. పైగా అక్కడ దానిని గొప్పగా చూస్తుంటారు. ఎన్ని రకాల విదేశీ సంస్కృతులు మనదేశంలోకి ప్రవేశించినప్పటికీ.. ఆ తరహా దిగజారుడు కల్చర్ కు భారత్ ఇంకా ఎదగలేదు. ఎదిగే అవకాశం కూడా లేదు..

కరోనాను అమెరికా సైంటిస్ట్ సృష్టించాడా.. వ్యాక్సిన్ వ్యాపారం కోసం ఘాతుకం.. వెలుగులోకి విస్తు పోయే దారుణం..

COVID-19 Lab Leak Theory
COVID-19 Lab Leak Theory

COVID-19 Lab Leak Theory: కరోనా.. ఈ వ్యాధి వల్ల ప్రపంచం మొత్తం నాలుగు సంవత్సరాల పాటు నరకం చూసింది. చాలామంది చనిపోయారు. అంతే సంఖ్యలో అయిన వాళ్ళని కోల్పోయారు. కొంతమంది అయితే ఇళ్లలోనే ఉండి.. స్వీయ నరకాన్ని అనుభవించారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది కన్ను మూయడంతో ప్రపంచం మొత్తం శోక సంద్రంగా మారిపోయింది.

కరోనా వ్యాధికి సంబంధించిన వైరస్ చైనాలోని వూహన్ ల్యాబ్ నుంచి బయటికి విడుదలైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. చైనా దేశం మీద ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతేకాదు, చైనా కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు లాక్ డౌన్ విధించింది. చాలా నగరాలలో ప్రజలను బయటికి రానీయకుండా ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణ విధించింది. కరోనా తొలగిపోయింది. ఆ స్థాయిలో మరణాలు నమోదు అయిన తర్వాత ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నది. అయితే ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి కీలక విషయాలను బయటపెట్టారు అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ సంచాలకురాలు తులసి గబ్బార్డు.

ఆమె తన పదవి నుంచి వై దొలుకుతూ సంచలన విషయాలను వెల్లడించారు. చైనాలో ఉన్న వూహాన్ ప్రయోగ కేంద్రానికి ఆంతోని పౌచి అనే వ్యక్తి నిధులు ఇచ్చారని ఆరోపించారు. కరోనా వ్యాధికి సంబంధించిన అసలు నిజాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పటికే కరోనా వైరస్ పుట్టుక.. ఆ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి వంటి వాటిపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇది ఇలా ఉండగానే తులసి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం విశేషం.

నాడు పౌచి అమెరికా అప్పటి అధ్యక్షుడు బైడన్ కు చీఫ్ మెడికల్ అడ్వైజర్ గా పని చేసేవారు. పౌచి చైనాలోని వూహాన్ ల్యాబ్ కు నిధులు పంపించారు. ఇక్కడి నుంచి కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందిందని విమర్శలు ఉన్నాయి. అయితే నాడు పౌచి అనేక రకాలుగా వ్యూహాలు రూపొందించారని.. అవన్నీ కూడా డీప్ స్టేట్ ప్లే బుక్ నుంచి వచ్చాయని ఆమె ఆరోపించారు. డీప్ స్టేట్ బుక్ అంటే తెరవెనక బలమైన శక్తులు ఉన్నాయని.. అని అర్థం.

తులసి ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలను చెప్పారు.. 2020లో అమెరికాలో కోవిడ్ వ్యాపి చెందినప్పుడు పౌచి వూహన్ ప్రయోగ కేంద్రంలో గబ్బిలాలకు ఇట్స్ ఓకే కరోనా వైరస్ లపై ప్రమాదకరమైన గేయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనల కోసం డబ్బులు చెల్లించాలని.. వీటిని అమెరికా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించాలని తులసి ఆరోపించారు. వైరస్ లీకైన విషయాన్ని దాచడానికి పౌచి.. వేరే వ్యక్తులతో కలిసి పని చేశారని తులసి మండిపడ్డారు. మరోవైపు ఈ పరిశోధనల గురించి అధికారులతో జరిపిన చర్చలపై అమెరికన్ పార్లమెంటు ముందు పౌచి అబద్ధాలు చెప్పారని తులసి విమర్శించారు.

పౌచి వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు.. ఈయన 38 సంవత్సరాల పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫక్షయస్ డిసీజెస్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఈయన పెద్ద పెద్ద సంస్థలతో చేతులు కలిపి రిస్కీ కరోనా వైరస్ పరిశోధనలకు డబ్బులు ఇచ్చారు. యూనివర్సల్ వ్యాక్సిన్ ల కోసం ఇదంతా చేశారని తులసి ఆరోపించడం విశేషం. అయితే తులసి ఈ స్థాయిలో ఆరోపణలు చేసినప్పటికీ ఇంతవరకు పౌచ్ నుంచి ఎటువంటి ఖండన రాకపోవడం విశేషం.

గెలికారు.. వైభవ్ సూర్య వంశీ.. లంక దహనం చేస్తాడా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: సాధారణంగానే అతడు ఒక టెంపో లో ఉంటాడు. బంతిని బలంగా కొడతాడు. ఏ మాత్రం అవకాశం వచ్చినా సరే బంతిని వేగంగా ఎక్కడికి తరలించాలో అక్కడికే తరలిస్తూ ఉంటాడు. అతడికి బౌలింగ్ వేయాలంటేనే చాలామంది భయపడుతుంటారు. బుమ్రా లాంటి బౌలర్ల బౌలింగ్ లోనే తొలి బంతిని సిక్సర్ కొట్టిన చరిత్ర అతడిది. అటువంటి ఆటగాడిని గెలికితే ఎలా ఉంటుంది.. లంకకు తెలియదు.. అతడు ఎంత ప్రమాదకారో..

ఆదివారం ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ ఫైనల్ జరగబోతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుమీద శ్రీలంక విజయం సాధించింది. భారత అభిమానులు కూడా ఇదే కోరుకున్నారు. ఎందుకంటే ఫైనల్ లో సూర్య బ్యాటింగ్ డిస్ప్లే చూడాలని వారు ఆసక్తితో ఉన్నారు. అందువల్లే శ్రీలంక విజయం సాధించాలని ఆకాంక్షించారు. వారి ఆకాంక్షకు గట్టిగానే శ్రీలంక ఫైనల్లోకి వచ్చింది. దీంతో వైభవ్ సూర్య వంశీ ఫైనల్ లో వారికి దేత్తడి పోచమ్మ గుడిని చూపించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నిరాశతో ఉన్న వైభవ్ సూర్య వంశీని శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టారు. అడ్డగోలుగా మాట్లాడారు. మనవాడు ఊరుకునే రకం కాదు కదా.. రెచ్చిపోయాడు. శ్రీలంక ఆటగాళ్లకు తగిన సమాధానం చెప్పాడు. దీంతో అక్కడ గొడవ జరిగింది. అయితే సూర్య వంశీ గెలికితే గెలికించుకునే రకం కాదు. అంతు చూసే రకం. అసలే 15 ఏళ్ల బుడ్డోడిలా కాకుండా.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా అతను ఆడుతుంటాడు. అలాంటప్పుడు శ్రీలంక జట్టు బౌలర్లను ఎందుకు వదిలిపెడతాడు..

ఫైనల్ మ్యాచ్లో అతడు గనుక రెచ్చిపోతే శ్రీలంక అన్ని మూసుకోవడం ఖాయం. ఐపీఎల్ లో.. అంతకుముందు అండర్ 19 వరల్డ్ కప్ లో సూర్య తన ప్రతాపం చూపించాడు. ఈ సిరీస్ లో ఇంతవరకు వైభవ్ తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేదు. అతడు గనుక ఒకసారి టచ్ లోకి వస్తే శ్రీలంక ప్లేయర్లకు దబిడి దిబిడే అంటూ టీమిండి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి సూర్య వంశీ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడో.

సిఐ నాగరాజు కాదు.. కమిషనర్ రాజశేఖర్ బాబు మీదనే ఫోకస్.. వైసీపీకి ఎందుకు అంత కోపం..

CI Nagaraju
CI Nagaraju

CI Nagaraju: వైసిపి స్టాండ్ మార్చుకుంది. పార్టీ హై కమాండ్ ఎలా చెబితే అలా నడుచుకోవాలి కాబట్టి.. నేతలు కూడా అదేదారిలో వెళ్తున్నారు.. ఇంతకీ వైసీపీ స్టాండ్ మారింది ప్రజల విషయంలో కాదు.. కుల రాజకీయాలలో.. కులాల కుంపట్లు రగిలించడంలో అనే టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు తెరపైకి ఒక సంచలన విషయాన్ని వారు బయటకు తీసుకొచ్చారు.

ఇటీవల కృష్ణలంక కేసులో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కేశినేని నాని చాలా క్లారిటీగా “కమాండ్ రెస్పాన్సిబిలిటీ” అనే పదాన్ని పేర్కొన్నారు.. దీని ప్రకారం సిఐ నాగరాజు మాత్రమే కాదు విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న రాజశేఖర్ బాబుని కూడా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో రాజశేఖర్ బాబు పేరు ఎందుకు వచ్చింది.. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాలని నాని కోరుతున్నారో చాలామందికి అర్థం కాలేదు. దాని వెనుక అసలు కథ చాలా ఉంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగింది.. ఇందులో ముడుపుల వ్యవహారం కూడా ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఈడి అధికారులు అరెస్టులు జరుపుతున్నారు. ఈ కేసును విచారిస్తోంది కూడా విజయవాడ కమీషనర్ రాజశేఖర్ బాబు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజశేఖర్ బాబు నాయకత్వం వహిస్తున్నారు.. ఈ కేసులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని.. ఈ దోపిడి వ్యవహారాన్ని పూర్తిగా సాక్ష్యాలతో విచారణ చేస్తున్న నేపథ్యంలో.. అసలు పాత్రధారుడిని ఈడి ద్వారా అరెస్టు చేయించడానికి రంగం సిద్ధమవుతోంది.. ఇవి జరుగుతుండగానే సాయికృష్ణ కేసు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులైంది.. ఇతడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో వైసిపి నేతలు తెలివిగా స్కెచ్ వేశారు.. కులాల కుంపట్లు రగిలించడానికి సిద్ధమయ్యారు. కరపత్రంలో ఏకంగా కులాల పేర్లు ఉన్న ప్రస్తావిస్తూ ప్రజలలో లేని ఆగ్రహాలను తెప్పించడానికి సిద్ధమయ్యారు.

సాయి కృష్ణ కేసును అడ్డం పెట్టుకొని కమిషనర్ రాజశేఖర్ బాబు నిజాయితీని దెబ్బతీయడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే వైసిపి నాయకులు చెప్పినట్టుగా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు రాజశేఖర్ బాబు ప్రస్తావన తీసుకురాలేదని తెలుస్తోంది. విలేకరుల సమావేశంలో కూడా సాయి కృష్ణ తల్లి ఆ మాటలు చెప్పలేదు.. దీంతో వైసిపి ప్లాన్ బెడిసి కొట్టింది.. ఇప్పటికే నాగరాజును కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మీకు న్యాయం చేస్తామని స్వయంగా చంద్రబాబు సాయి కృష్ణ ఇంటికి వెళ్లి.. ఆమె తల్లికి మాట ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్న కేశినేని అని మాత్రం రాజశేఖర్ బాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం.. దీనిని సమర్థిస్తూ వైసిపి నాయకులు హంగామా చేయడం.. చూడబోతే దాల్ మే కుచ్ కాలా హై అనే సామెతను గుర్తు చేస్తుందని టిడిపి నేతలు అంటున్నారు..

కాళీ మాత దీవించింది.. నారా లోకేష్ కాదు.. డోలో 650 లోకేష్.. కోల్ కతా లో ఇంత జరిగింది మరి

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: కోల్ కతా కు నారా లోకేష్.. ఎందుకు వెళ్లారు.. దేనికోసం వెళ్లారు.. మొన్ననే కదా ఆయన రష్యా వెళ్ళింది.. అక్కడ అనేక సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది.. పెట్టుబడులు పెట్టడానికి వారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది.. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోలేదు. సప్త సముద్రాల అవతల ఉన్న వ్యవహారాన్ని చక్కబట్టారు. మరి ఇక్కడి హుగ్లీ నది సంగతి.. దానిమీద ఏర్పాటుచేసిన హౌరా బ్రిడ్జి సంగతి.. తేలుద్దామని కాళీ మాత సన్నిధికి వెళ్ళిపోయారు.

కాళీమాత కోరిన కోరికలు.. తీర్చే తల్లి.. తన భక్తులు జనాల మేలుకోరి అడిగితే కచ్చితంగా తీర్చుతుంది. అలానే తీర్చేసింది. నారా లోకేష్ కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అంతేకాదు, బిడ్డా.. నువ్వు అడుగువేయ్.. అది దారి అయిపోతుంది అంటూ దీవించింది. ఏ ముహూర్తంలో అయితే కోల్ కతా లో అడుగుపెట్టారో నారా లోకేష్.. ప్రతి చర్చ విజయవంతమైంది.. ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మరొకసారి మార్చేసింది.

హిమాద్రి కెమికల్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ చౌదరితో లోకేష్ భేటీ అయ్యారు. రాయలసీమలోని చిత్తూరు.. కోస్తా ఆంధ్ర లోని నెల్లూరు ప్రాంతాలలో సిలికాన్ కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడితోనే ఆగలేదు విశాఖపట్నంలో ప్రాంతీయ కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. స్పెషాలిటీ బ్లాక్ కార్బన్ ఉత్పత్తి యూనిట్ మొదలుపెట్టాలని సూచించారు. దానికి అనురాగ్ సానుకూలంగా స్పందించారు.. ఇక్కడితోనే లోకేష్ ఆగిపోలేదు అమరావతిలో తిరుపతి ఐఐటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో మెటీరియల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు.

కేవలం అనురాగ్ మాత్రమే కాదు విక్రమ్ సోలార్ ఎండి జ్ఞానేశ్ చౌదరి, శ్యామ్ మెటాలిక్స్ ఎనర్జీ మెటాలిక్ డైరెక్టర్ శీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్ లిమిటెడ్ చీఫ్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ సంజీవ్, ఐ టి సి చైర్మన్ సంజీవ్ పూరి వంటి వారి తో నారా లోకేష్ భేటీ అయ్యారు.. అంతేకాదు, పెట్టుబడులు పెట్టాలని కోరారు. అంతేకాదు పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారు. గతంలో మాదిరిగా ఏపీలో ఇప్పుడు వాతావరణం లేదని.. సానుకూల దృక్పథం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని అని వ్యాఖ్యానించారు.

తాను డోలో 650 లాంటి వాడినని.. పెట్టుబడిదారులకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా సరే ఒక వాట్సాప్ చాట్ దూరంలోనే ఉంటానని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే స్వయంగా తాను రంగంలోకి దిగి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాళీమాత దీవించింది. పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. నారా లోకేష్ పర్యటన విజయవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ అయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఏపీ దూసుకుపోతోంది.. బాలయ్య బాబు డైలాగు లో బ్రేకులు లేని బుల్డోజరే.

ఏం బౌలింగ్ సామి.. చంపేస్తావా ఏంటి

New Zealand vs England
New Zealand vs England

New Zealand vs England: ఒక్కో బంతి డైనమెట్ లాగా వచ్చింది. మిస్సైల్ లాగా దాడి చేసింది. బంతిని ఎదుర్కోవాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి కల్పించింది. అయితే ఆఫ్ సైడ్.. లేదా యార్కర్.. లేదా బౌన్సర్.. లేదా షార్ట్ పిచ్.. క్రికెట్లో బంతులకు ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని తీర్లుగా ఆ బౌలర్ వేశాడు. పాపం బ్యాటర్ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బంతిని ఎదుర్కోవాలంటేనే అతడు భయపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ నడుస్తోంది. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగింది. రెండవ టెస్ట్ ఓవల్ వేదికగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 291 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టాడు.. ఓర్కుక్ రెండు వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 391 పరుగులు చేసింది.. ఫిలిప్స్ సెంచరీ సాధించాడు. బెతల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్, ఫిషర్, బేకర్ తలా రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు.

ఒక దశలో న్యూజిలాండ్ జట్టు 188 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన ఫిలిప్స్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అతడిని అవుట్ చేయడానికి ఆర్చర్ శాయశక్తులా ప్రయత్నించాడు. నిప్పులు చెరిగే బంతులను వేశాడు. ఆ బంతులకు తట్టుకోలేక ఫిలిప్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కొన్ని సందర్భాలలో మైదానంలో కిందపడ్డాడు. ఆర్చర్ వేసిన బంతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అతడు వేసింది బంతులు కాదని.. మిస్సైల్స్ అని.. వాటిని తట్టుకొని ఫిలిప్స్ నిలబడ్డాడు అంటే మామూలు విషయం కాదని అభిమానులు పేర్కొంటున్నారు.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఇప్పటికే మూడు వికెట్ల కోల్పోయి 252 పరుగులు చేసింది. నికోలస్ 119*, మిచల్ 32* బ్యాటింగ్ చేస్తున్నారు.. రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు లాతం 4, కాన్వే 11 విఫలమైనప్పటికీ.. మిగతా ఆటగాళ్లు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయడంతో న్యూజిలాండ్ పటిష్టమైన స్థితిలో గెలిచింది. మూడవరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు మీద 352 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు.. రెండో మ్యాచ్లో పట్టు బిగించింది. ఎలాగైనా సరే గెలిచి సత్తా చూపించాలని భావిస్తోంది.

ఈ రాశుల వారిపై ఈరోజు శని దేవుడి ప్రభావం.. అనుకున్న పనులన్నీ సక్సెస్..

Today 20 June 2026 Horoscope
Today 20 June 2026 Horoscope

Today 20 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల అన్ని విజయాలే సమకూరుతాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగుపడతారు. పెండింగ్ బకాయిలను తిరిగి చెల్లిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని పనుల కారణంగా వ్యాపారులు బిజీగా మారుతారు. ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఉండడంతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడానికి మార్గం ఏర్పడుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ఆలోచన ఉంటే మానుకోవడం మంచిది. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి కొన్ని మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఒత్తిడికి లోను కాకుండా పనులను పూర్తి చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో మాట తీరుపై కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులను కలుసుకోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఆధారంగా బాధ్యతలు ఏర్పడతాయి. ఇదే సమయంలో కొత్త ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొత్త బాధ్యతలను చేపడతారు. గతంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు. కొందరు తమ పనితీరు తో పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు అవసరమైన వనరులు ఏర్పాటు చేసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలవడం వల్ల కొన్ని ప్రాజెక్టులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వీరి ఆలోచన తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా పనిని ప్రారంభించే వారు ప్రజలను సంప్రదించడం మంచిది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనుల కారణంగా బిజీగా మారిపోతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరి వ్యక్తుల కదలిక వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టేందుకు పెద్దలను సంప్రదిస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి మనసు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడడంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు ఇదే సరైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉండడంతో అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారంలో నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇది సరైన సమయం కాదు.

ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..

Deep Sleep Tips
Deep Sleep Tips

Sleep Deprivation: ప్రస్తుత కాలంలో చాలా మంది రకరకాల సమస్యలు బాధపడుతూ ఉన్నారు. దీంతో సరైన నిద్ర పోవడం లేదు. దీంతో ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట, తరచూ ఆకలి వేయడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. అయితే వీటిని చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి ఇన్సులిన్ నిరోధకత ప్రారంభ సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా రోజుల తరబడి నిద్రలేకపోవడంతో ఏం జరుగుతుందంటే?

కొంత మంది ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వరుసగా నాలుగు రోజుల పాటు గాఢమైన నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా గ్లూకోజ్‌ను శక్తిగా మార్చే ప్రక్రియ మందగిస్తుంది. దీంతో కణాలు ఇన్సులిన్ ప్రభావానికి తక్కువగా స్పందించడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకతగా పిలుస్తారు. నిద్రలేమి కారణంగా ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. అదే సమయంలో ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. ఫలితంగా వ్యక్తికి తరచూ ఆకలి వేయడం.. ముఖ్యంగా తీపి పదార్థాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది.

ఇన్సులిన్ నిరోధకత ఎక్కువకాలం కొనసాగితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే నిద్ర నాణ్యతను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ సమస్యను తగ్గించేందుకు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం.. ఒకే సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి. అలాగే ప్రోటీన్లు, ఫైబర్, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.