Home Blog Page 8679

సరిలేరు నీకెవ్వరు 12 డేస్ కలెక్షన్స్

 

సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

 

నైజాం – 34.29 కోట్లు

సీడెడ్ – 14.44 కోట్లు

ఉత్తరాంధ్ర – 17.61 కోట్లు

ఈస్ట్ – 10.42 కోట్లు

వెస్ట్ – 6.80 కోట్లు

కృష్ణా – 8.18 కోట్లు

గుంటూరు – 9.22 కోట్లు

నెల్లూరు – 3.65 కోట్లు

ఏపీ+తెలంగాణ – 104.61 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 8.85 కోట్లు

ఓవర్సీస్ – 11.41 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 124.87 కోట్లు

2020 సమ్మర్… రీమేక్ స్పెషల్

 

2020 వేస‌విలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. వీటిలో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ తో పాటు రీమేక్ మూవీస్ కూడా ఉండ‌డం విశేషం. ఆ క్రేజీ రీమేక్స్ వివ‌రాల్లోకి వెళితే…ఏప్రిల్ 9న త‌డ‌మ్ కి రీమేక్ గా రూపొందుతున్న రెడ్ (ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరో,కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు) రిలీజ్ కానుండ‌గా.. మే నెల‌లో అసుర‌న్ రీమేక్ (విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడు ,శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు) విడుద‌ల కానుంది. ఇక అదే మే నెల‌లో పింక్ రీమేక్ (ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌ధారి,వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. సమ్మ‌ర్ సీజ‌న్ లో త‌క్కువ గ్యాప్ లోనే రానున్న ఈ క్రేజీ రీమేక్స్.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాయో చూడాలి.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

బంగార్రాజు మూవీ అప్ డేట్.. ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే…!

 

భారీ అంచనాలతో వచ్చిన ‘మన్మధుడు -2’ సినిమా ఘోర పరాజయం పొందడంతో నాగార్జున తన రూటును మార్చాడు. ఇప్పడు ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు. నాగార్జున తాజాగా చేస్తున్న సినిమా ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమాలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మగా నటిస్తున్నాడు నాగ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

 

ఇక ఈ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాలో నటించబోతున్నాడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడి మరణంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజి లో ఉన్నాయి. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్తుందట. ఈ సినిమా కోసం అనూప్ రూబెన్స్ సాంగ్స్ కంపొజిషన్ పనిలో ఉన్నారు.

 

అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే సంక్రాంతికి బంగారాజు గోడలు దూకి చేసే చిలిపి పనులు చూడొచ్చు…

 

Read More: అందాలతో సెగరేపుతున్న పునర్నవి.. ఫొటోస్ వైరల్

గూఢచారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

 

సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత నుండి రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు.. ఏప్రిల్ నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

 

ఈ సినిమాలో మహేష్ గూఢచారి పాత్రలో నటించబోతున్నాడు. మహేష్ కోసం ఓ స్టైలిష్ స్పై ద్రిల్లర్ రెడీ చేసాడట వంశీ. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో సాగుతుందని తెలుస్తుంది. కృష్ణ కూడా మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడాలని అనుకుంటున్నాడట. గతంలో ‘స్పైడర్’ సినిమాలో మహేష్ ఆ తరహా పాత్రలో నటించినప్పటికీ కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు పక్క ప్లానింగ్ తో పకడ్బంధితో రాబోతున్నాడట మహేష్. ఇక ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుండగా తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడని తెలుస్తుంది.

 

Read More: కరోనా వైరస్.. సోకితే ఈ లక్షణాలు.. సోకకుండా ఈ జాగ్రత్తలు

రవిశాస్త్రి పై మరో వ్యంగ చిత్రం!

 

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ చేసినా సరే నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అతడి మద్యపాన సేవనం గురించే మాట్లాడుతున్నారు. వెస్టిండీస్‌ పర్యటన నుంచి ఈ ట్రోలింగ్‌ పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండోర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టులో తలపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు శాస్త్రి ట్విటర్లో ఓ పోస్ట్‌ చేశాడు. బంతిని పట్టుకొని స్పిన్‌ బౌలింగ్‌ చేస్తున్న పోజు ఇచ్చాడు. ఈ చిత్రాలతో ‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ అనే అర్థం వచ్చేలా ఓ వ్యాఖ్య జతచేశాడు. అంతే.. వెంటనే ట్విటర్లో వ్యంగ్య బాణాల మోత మొదలైంది. నెటిజన్లు అతడి చిత్రాలను మార్ఫింగ్‌ చేసి రీట్వీట్లు చేస్తున్నారు. ‘ప్రధాన కోచ్‌కు యోయో టెస్టు పెట్టాలి’ అని అంటున్నారు. మరికొందరు ‘నిజమే.. పాత అలవాట్లు పోవు’ అంటూ గ్లాసులోకి బీరు వంపుతున్న చిత్రాలు పెట్టేస్తున్నారు. రవిశాస్త్రిని లక్ష్యంగా ఎంచుకోవడం కొత్తేమీ కాదు. చాన్నాళ్లుగా నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

కొండంత అవసరానికి, గోరంత చేసి, భూగోళమంత ప్రచారమా..!?

 

కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో 108 డబుల్ బెడ్ ఇండ్లను తెలంగాణ ముఖ్యమంత్రి గారి తనయుడు మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు. అక్కడ పండగ వాతావరణం నెలకొన్నదని కూడా ట్వీట్ చేశారు.

 

అయ్యా మంత్రిగారు.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు లక్షల్లో డబుల్ బెడ్‍రూం ఇళ్లను నిర్మిస్తామని మీ తండ్రిగారు హామీ ఇచ్చారు. 2015 అక్టోబర్​లో ప్రభుత్వం తరుపున పథకాన్ని ఘనంగా ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో డబుల్​ బెడ్​రూం ఇండ్లతో మోడల్​ కాలనీ నిర్మించి మార్చి 5, 2016న అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత మీ తండ్రిగారి, మీ మామ హరీశ్​రావు గారి, ఇంకా మీరు ప్రాతినిధ్యం నియోజకవర్గాల్లో తప్ప డబుల్​ బెడ్​ రూం ఇండ్ల నిర్మాణం ఎక్కడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు సారూ..!

 

మీ టీఆర్​ఎస్​ సర్కారు నాలుగేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్​ బెడ్​రూం ఇండ్లు నత్తకే నడక నేర్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పునాది దశలోనే మగ్గుతున్నాయి. మీరు శంకుస్థాపన చేసింది 108 అండి.. లక్ష ఎనభై వేల ఇండ్లు శంకుస్థాపన చేసినట్లుగా ఫీల్ అయితే ఎలా..? “పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది” అంటున్నారు..! 2015 నుండి తెలంగాణలోని గూడు లేని పేదలకు డబుల్​ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని మీ తండ్రిగారు పలు సందర్భాల్లో​ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ దశల్లో 2లక్షల 82వేల 416 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎన్ని ఇల్లులు కట్టారండి..? మీ ప్రభుత్వం ప్రకటించిన రేట్లు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల అంతులేని నిర్లక్ష్యం, సరిపడా నిధులు లేకపోవడం, స్థలాల కొరత తదితర కారణాలతో పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సామాన్యుల సొంతింటి కలలు క్రమంగా కరిగిపోతున్నాయి తప్పా.. మీ మనసులు మాత్రం కరగడంలేదు.

కడుపుకు అన్నం తినేవాడెవడు వైసీపీలో ఉండడు:వల్లభనేని

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొంత కాలంగా వేడెక్కాయి దానికి ప్రధాన కారణం టీడీపీ నేతలు, ఒక్కొక్కరుగా వైసీపీలోకి చేరడమే అందులో భాగంగానే గన్నవరం మాజీ టీడీపీ నేత వల్లభనేని వంశీ విచిత్రమైన కామెంట్స్ చేశారు. టీడీపీ నేతగా చలామణి అయినప్పుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అందులో ఒకటేమిటంటే.. “కడుపుకు అన్నం తినే వాడుడెవడు వైసీపీలో ఉండడు” అని, మరి నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాత్రం నేను త్వరలోనే వైసీపీలో చేరుతానని అన్నారు. అంటే దీనర్థం ఏమిటి? వంశీగారు.. మీరు కడుపుకు అన్నం తినడం లేదనేగా..!?” అని ప్రజలు అడుగుతున్నారు. చెప్పింది తక్కువ.. ఈ వీడియో ఒక్కసారి చూడండి… చెప్పాల్సింది చాలా ఉందంటారు!

లాగారు కానీ, ఇంకా తెగలేదు!

 

తెలంగాణ-ఆంధ్ర విభజన చట్టంలో పేర్కొన్న విభజనచట్టం హామీల అమలు విషయంలను, విభజనకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలుచేసింది. ‘‘కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. గోదావరినదిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండానే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల 450 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వినియోగించుకోనుంది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని దిగువనున్న రైతులు నష్టపోతారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై 2016 సెప్టెంబరు 21న కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించినా ఎలాంటి ప్రయోజనమూ లేదు. కాళేశ్వరం నిర్మాణాన్ని రాష్ట్రం వ్యతిరేకిస్తున్నా, కేంద్ర జలమంత్రిత్వశాఖ సాంకేతిక సలహా మండలి క్లియరెన్సు ఇచ్చింది’’ అని ఏపీ వాదించింది.

 

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకరరెడ్డి వేసిన పిటిషన్‌ లో పేర్కొన్నారు. ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, కౌంటరును దాఖలు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలూ.. ప్రవర్తనా నియమావళిని తెలంగాణ సర్కారు పాటించడం లేదని తన అఫిడవిట్‌లో పేర్కొంది. 9, 10 షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల పంపకానికీ సహకరించడం లేదని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన నిధులలోనూ వాటాలను ఇవ్వడం లేదని వివరించింది. విభజన చట్టం హామీల అమలు కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు .. సంబంధిత శాఖలు, కార్పొరేషన్ల అధికారులు కలసి మాట్లాడుకుందామని, ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరుతున్నా తెలంగాణ నుంచి సహేతుకమైన సమాధానం కానీ, సమావేశం తేదీ సమాచారంగానీ రావడం లేదని పేర్కొంది.

ఒక్కరోజే, మూడు ప్రధాన తీర్పులు!

నవంబర్ 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) రంజయ్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పలు ప్రధాన కేసుల పరిష్కారానికి ఆయన నడుం బిగించారు. రేపు(గురువారం) తీర్పు వెలువడనున్న కేసుల్లో ప్రధానమైనవి మూడు. మొదటిది శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళల ఎంట్రీకి సంబంధించిన వివాదం, రెండోది రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినది ఇక మూడోది రాహుల్ గాంధీ వ్యక్తి గతానికి సంబంధించింది. ఈ మూడు కేసులలో తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ కార్యాలయం.

శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళల ఎంట్రీకి సంబంధించిన వివాదం:

ఈ కేసులో కేరళ హైకోర్టు ఇప్పటికే తీర్పు నివ్వగా పలు హిందూ సంఘాలు, ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కేరళ కోర్టు మహిళలను అనుమతించాలని ఆదేశించగా.. పలు హిందూసంస్థలు.. ఆలయాల్లో కోర్టుల జోక్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయితే కేరళ ప్రభుత్వం పూర్తి భద్రత మధ్య కొందరు మహిళలు ఇప్పటికే శబరిమల ఆలయంలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.

 

ఆలయం తిరిగి ఈ నెల 16వ తేదీన సాయంత్రం తెరుచుకుని, 17వ తేదీ నుంచి భక్తులకు అయ్యప్పస్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో గురువారం వెలువడే తీర్పు అత్యంత కీలకం కాబోతోంది. తీర్పు వెలువడే సంకేతాలు రావడంతో శబరిమలతోపాటు కేరళ వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినది.

ఈ వివాదంపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సారథ్యంలోని స్పెషల్ బెంచ్ విచారించింది. గురువారం స్పెషల్ బెంచ్ తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ తీర్పు అయితే కాంగ్రెస్ పార్టీకి, లేదా బిజెపికి ఓ ఒకరిపై మరొకరు అటాక్ చేసేందుకు అస్త్రంగా మారే అవకాశాలున్నాయి.

రాహుల్ గాంధీ వ్యక్తి గతానికి సంబంధించింది:

ఇక మూడో కేసు, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దొంగగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై దాఖలైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వివాదానికి సంబంధించింది ఈ తీర్పు. పలు సందర్భాలలో మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ‘‘ చౌకీ దార్ చోర్ హై ’’ అన్న కామెంట్ చేశారు. అయితే.. రాఫెల్ కొనుగోళ్ళపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు రాహుల్ ఆ మాటను అనరాదని చాలా స్పష్టంగా ఆదేశించింది.

 

అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ పలు మార్లు ‘‘ చౌకీ దార్ చోర్ హై ’’ అంటూ కామెంట్ చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినా రాహుల్ గాంధీ ఆ మాటల్ని పదే పదే అనడంతో బిజెపి నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కూడా రేపు సుప్రీం ధర్మాసనం గురువారం తీర్పు ఇవ్వబోతోంది.

 

మొత్తానికి గురువారం తీర్పులు సుప్రీం చరిత్రలో చారిత్రాత్మకం కాబోతున్నాయి. నవంబర్ 17న పదవీ విరమణకు ముందు ఇక మిగిలింది 3 వర్కింగ్ డేస్ మాత్రమే. గురువారం మూడు తీర్పులు వెలువడితే.. ఇక మిగిలింది.. ఒకే ఒక్క ప్రధానమైన కేసు ఫైనాన్స్ బిల్లుకు సంబంధించిన వివాదంపై దాఖలైనది. శుక్ర, శనివారాల్లో ఫైనాన్స్ బిల్లుపై దాఖలైన పిటిషన్‌పై కూడా తీర్పు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది.

అల్లు అర్జున్ కోసం అనసూయ ఊహించని సాహసం!

 

జబర్దత్ ఫేమ్, యాంకర్ అనసూయ భరద్వాజ్ నటనలో మరియు అందంతో చిన్న తెర మరియు వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె సుకుమార్ తీసిన రంగస్థలం లో రంగమ్మత పాత్రలో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు అసలు వార్తలు ఏమిటంటే, దర్శకుడు సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాలో అనసుయ నటించబోతుంది. ఈ సినిమాలో అనసూయ నెగటివ్ షేడ్ రోల్ పోషిస్తున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. పాత్ర నచ్చడంతో ప్రతినాయక పాత్ర పోషించడానికి సిద్ధమైపోయింది ఈమె.ఈ సినిమా కథ ఎర్ర చందనం అక్రమ రవాణా చుట్టూ తిరుగుతుందని తెలిసింది. అల్లు అర్జున్ మరియు అనసుయ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రంనికి హైలైట్ గా మిగిలిపోతాయని సినిమా వర్గాలు వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. సైలెంట్‌గా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు సుకుమార్. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమాలో రంగమ్మత్త కాస్తా పర్ఫెక్ట్ నెగిటివ్ పాత్ర చేయబోతుంది.

 

Read More:పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం…ఎందుకో తెలుసా…?

నాగ‌శౌర్య అశ్వ‌థ్థామ‌ ట్రైలర్ రిలీజ్

 

‘నర్తనశాల’ సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో ‘అశ్వ‌థ్థామ‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాగా.. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 

కాగా ఈ సినిమాలో నాగశౌర్య జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు. ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నాడు.

 

కాగా ‘ఛలో’ తరవాత నాగశౌర్య ఆ స్థాయి హిట్ అందుకోలేదు. ఆయన హీరోగా 2018లో వచ్చిన ‘కణం’, ‘అమ్మమ్మగారి ఇల్లు’, ‘నర్తనశాల’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. కిందటేడాది వచ్చిన ‘ఓ బేబీ’ హిట్టయినా అందులో నాగశౌర్య పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. దీంతో ప్రస్తుతం నాగశౌర్య ఆశలన్నీ ‘అశ్వథ్థామ’ మీదే ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా అయినా కలిసొస్తుందేమో.

 

Read More: అఘోరగా బాలయ్య? బీభత్సముగా ప్లాన్ చేసిన బోయపాటి

నారప్పకు భారీ రెస్పాన్స్…సోషల్ మీడియాలో రచ్చ..!

 

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్” సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ “నారప్ప” అనే పేరుతో నిన్న అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న మొదలు కావడంతో వెంకటేష్ లుక్ విడుదల చేయడంతో ఇప్పుడు అది పెద్ద ట్రేండింగ్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చుసిన వెంకటేష్ లుక్ గురించే డిస్కషన్.

 

ధనుష్ హీరోగా వచ్చిన “అసురన్” సినిమా చూడని వారు ఆ సినిమా గురించి ఇప్పటి వరకు తెలియని వారు వెంకటేష్ లుక్ చూసి సినిమా ఎలా ఉంటుందని, ఫ్యామిలీ అండ్ కామెడీ చిత్రాలతో ఆకట్టుకునే వెంకటేష్ ఇలా ఒక్కసారిగా సీరియస్ ఎమోషనల్ పాత్రలో నటించడంతో అందరూ చూపు ఈ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాకు కుటుంబకథా చిత్రాలు చేసుకునే శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుడు నిర్మిస్తున్నాడు అంటేనే అందరూ అతడు ఈ సినిమా భారాన్ని ఎలా మోస్తాడో, “అసురన్” సినిమాలో అద్భుతంగా ఎమోషన్స్ క్యారీ చేయడంతో వాటన్నింటిని ఈ సినిమాలో ఎలా చూపిస్తాడో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.

 

Read More: అఘోరగా బాలయ్య? బీభత్సముగా ప్లాన్ చేసిన బోయపాటి

అఘోరగా బాలయ్య? బీభత్సముగా ప్లాన్ చేసిన బోయపాటి

 

 

వయసు మీదుపడుతున్నా -వైవిధ్యం విషయంలో బాలయ్య ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. కాకపోతే, ఎత్తుగడే వర్కౌట్‌కాక ఇబ్బంది పడుతున్నాడు. రూలర్ మేకోవర్ విషయంలో బాలయ్యను తక్కువ చేసి చెప్పలేం. పాతికేళ్ల ఐటీ ప్రొఫెషనల్‌గా, కరుడుగట్టిన ప్రాంతంలో రెక్లెస్‌గా ఎదిగిన పోలీస్ ఆఫీసర్‌గా వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నమే చేశారు.

 

కాకపోతే, ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు. గత సంక్రాంతి సీజన్‌లో యన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ పాత్రపరంగా వైవిధ్యం కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ వైఫల్యాలను లెక్క చేయకుండా బాలయ్య ‘ఓల్డ్ అండ్ బాల్డ్’ గెటప్‌లో కనిపించినపుడే -మరో ప్రయోగమేదో చేస్తున్నారన్న కథనాలు వినిపించాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు -బాలయ్య అఘోరా పాత్ర చేయనున్నారన్న కథనం ప్రచారంలో ఉంది. రూలర్ తరువాత బాలయ్య -బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. సినిమా పూజా కార్యక్రమాలు పూరె్తైనా -సినిమా సెట్స్‌పైకైతే వెళ్లలేదు.

 

Read More: అందంగా ఉన్న రోజా.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ.. వర్మ ట్వీట్

 

రూలర్ ఇంపాక్ట్‌తో తాజా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు, బడ్జెట్ నియంత్రణాంశాలు చేశారన్న కథనాలు వినిపించాయి. ఇక ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్స్‌లో భాగంగా ఇప్పటికే బోయపాటి తన టీంతో కాశీ వెళ్లి, కథలో అక్కడి బ్యాక్‌డ్రాప్ కోసం కొన్ని లొకేషన్స్ లాక్ చేశారని తెలుస్తోంది. కథలో హైలెట్ కానున్న వారణాసి ఎపిసోడ్‌లో బాలయ్య ‘అఘోరా’గా కనిపించనున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

 

వారణాసి అడవుల్లో ఉండే అఘోరా పాత్ర -్ఫ్లష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఓ ఇంటెన్స్ పాత్ర కవొచ్చన్న చర్చ నడుస్తోంది. బాలయ్య పాత్రలను పవర్ఫుల్‌గా డిజైన్ చేయటంలో బోయపాటి స్టయిల్‌ని ఇప్పటికే సింహా, లెజెండ్ చిత్రాల్లో చూశాం. అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసి -హ్యాట్రిక్ హిట్టందుకునే కసితో బోయపాటి ఉన్నాడని అంటున్నారు. ప్రయోగాలెన్ని చేసినా -ఈ ప్రాజెక్టు మాత్రం బాలయ్య, బోయపాటికి కీలకమన్నది కాదనలేని వాస్తవం.

 

Read More: లైన్ లో రెండు ఉన్నాయి.. మూడో దానికి గ్రీన్ సిగ్నల్

నరేంద్ర మోడీ కాదు ‘మోడీ నాయుడు’:పేర్ని నాని

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని “జగన్ రెడ్డి” అనడం తప్పుగా భావించి, అదేదో అనకూడని మాట అని వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. పైగా పవన్ కళ్యాణ్ ని “పవన్ నాయుడు”గా అభివర్ణించారు. మరి అదే మాటను “భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అన్నారు. కాబట్టి వైసీపీ నేతల దృష్టిలో పీఎం నరేంద్ర మోడీ కూడా “మోడీ నాయుడు” అవుతారుగా మరి?.. మోడీ నే కాదు అనేక మంది టీవీ యాంకర్స్, జర్నలిస్ట్స్ కూడా వాళ్ళ పేరు తర్వాత “నాయుడు చేర్చుకోవాలి మరి! ఎందుకో ట్వీట్ లో ఉన్న ఈ వీడియో చూడండి.

 

“పాపం ఫ్రస్ట్రేషన్ లో ఎదో కౌంటర్ వేయాలని అడ్డంగా బుక్ అయ్యారు… 2019 కౌంటర్ అఫ్ ది అవార్డు పేర్ని నాని కి వస్తుందని” జనసేన ప్రకాష్ ట్వీట్ చేశాడు.

అయోధ్య తీర్పు పై ముస్లిం సోదరుల భిన్న స్వరాలు!

 

మేము స్వాగతిస్తున్నాం.. : సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి

అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సుప్రీం తీర్పుని అంగీకరిస్తున్నామని ఫరూకి తెలిపారు. సుప్రీం తీర్పుపై సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఎలాంటి రివ్యూకి వెళ్లదని,ఎటువంటి క్యూరేటివ్(నివారణ)పిటిషన్ వెయ్యమని తాను సృష్టం చేస్తున్నానని ఫరూకి తెలిపారు.

అయోధ్య తీర్పుపై షియా న్యాయవాది మౌలానా కల్బే జావద్ మాట్లాడుతూ…సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. పెద్ద సంఖ్యలో ముస్లింలు సుప్రీం తీర్పుని అంగీకరించినందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను. వివాదం ఇప్పుడు ముగిసిపోయింది. ముస్లిం పర్శనల్ లా బోర్డు రివ్యూ పిటీషన్ ఫైల్ చేయాలని అనుకోవడంయ వాళ్ల హక్కు. ఈ విషయం ఇక్కడితో ముగిసిపోవాలని తాను అనుకుంటున్నానని మౌలానా తెలిపారు.

 

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : అజ్మీర్‌ దర్గా అధినేత దీవాన్‌ జైనుల్‌ అబెదిన్‌

అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్‌ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్‌ జైనుల్‌ అబెదిన్‌ అలీ ఖాన్‌ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, దాని నిర్ణయాన్ని ప్రతివారూ గౌరవించాలని అన్నారు. భారతదేశం వైపు చూస్తున్న ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. సుప్రీంతీర్పు న్యాయ వ్యవస్థ సమాజానికి ఎంత ముఖ్యమో తెలియజేసిందని అన్నారు.

 

మేం పూర్తి సంతృప్తితో ఉన్నాం- హషీం అన్సారీ కుమారుడు

రామ జన్మభూమి, బాబ్రీ వివాదాలకు సంబంధించిన పిటిషనర్ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ తీర్పును స్వాగతించారు. కోర్టు తీర్పుపై పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్లు తెలిపారు.

‘‘మేం 200 శాతం సంతృప్తి చెందాం. కోర్టు తన నిర్ణయాన్ని సరిచేసుకుంది. ఇంతకుముందు కోర్టును గౌరవించాం, ఈ రోజు కూడా మేం అదే చేస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లయితే అది మంచి విషయం అవుతుంది. ప్రభుత్వం చేసే పనిని మేం అంగీకరిస్తాం. హిందూ, ముస్లిం సోదరులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటన్నా, ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది, దీన్ని మనం అంగీకరించాలి’’ అని పేర్కొన్నారు.

 

ఆ ఐదెకరాలు మాకు వద్దు: ఒవైసీ

అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము సంతృప్తిగా లేమని ఐఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అమోఘం కాదని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్‌ను తిరస్కరించాలని అన్నారు. ‘ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. లీగల్ హక్కుల కోసమే తాము పోరాడామన్నారు. ఏఐఎంపీఎల్‌బీ వాదనతో తాము ఏకీభవస్తున్నామని చెప్పారు. ‘వాస్తవాల మీద విశ్వాసాలే గెలిచాయి’ అని తీర్పుపై స్పందించారు. తీర్పును సవాలు చేసే విషయంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది అసంతృప్తి

సుప్రీం తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతి పూర్తిగా చదివాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్…!

 

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ సీన్లోకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన శ్రీరెడ్డి.. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి సినీ అవకాశాలతో బిజీ బిజీగా వుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. తాజాగా శ్రీరెడ్డి జనసేన ఎమ్మెల్యే రాపాక గురించి ఓ పోస్టు చేసింది.

 

తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ”రాపాక మీరు కేక” అంటూ పోస్టు చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు రాపాక వరప్రసాదరావు అసెంబ్లీలో మద్దతు పలకడాన్ని శ్రీరెడ్డి స్వాగతించింది.

 

Read More: అమరావతిలో తెల్లరేషన్‌ కార్డు ఉండి వందల ఎకరాల భూములు కొన్నవారిపై సిఐడి విచారణ

 

ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించాలని, ఒకవేళ దానిపై ఓటింగ్ నిర్వహిస్తే అందుకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే, అధినేత లేఖను లైట్ తీసుకున్న రాపాక వరప్రసాద్ తాను మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరెడ్డి రాపాక వరప్రసాద్ మీద ”రాపాకా.. మీరు కేక” అని కామెంట్ పోస్ట్ చేసింది.

 

Read More: ప్రియుడిని చంపి శవాన్ని తింటూ వీడియో తీసిన పోర్న్ స్టార్