
తెలంగాణ-ఆంధ్ర విభజన చట్టంలో పేర్కొన్న విభజనచట్టం హామీల అమలు విషయంలను, విభజనకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. ‘‘కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. గోదావరినదిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల 450 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వినియోగించుకోనుంది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని దిగువనున్న రైతులు నష్టపోతారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై 2016 సెప్టెంబరు 21న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినా ఎలాంటి ప్రయోజనమూ లేదు. కాళేశ్వరం నిర్మాణాన్ని రాష్ట్రం వ్యతిరేకిస్తున్నా, కేంద్ర జలమంత్రిత్వశాఖ సాంకేతిక సలహా మండలి క్లియరెన్సు ఇచ్చింది’’ అని ఏపీ వాదించింది.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, కౌంటరును దాఖలు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలూ.. ప్రవర్తనా నియమావళిని తెలంగాణ సర్కారు పాటించడం లేదని తన అఫిడవిట్‌లో పేర్కొంది. 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకానికీ సహకరించడం లేదని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన నిధులలోనూ వాటాలను ఇవ్వడం లేదని వివరించింది. విభజన చట్టం హామీల అమలు కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు .. సంబంధిత శాఖలు, కార్పొరేషన్ల అధికారులు కలసి మాట్లాడుకుందామని, ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరుతున్నా తెలంగాణ నుంచి సహేతుకమైన సమాధానం కానీ, సమావేశం తేదీ సమాచారంగానీ రావడం లేదని పేర్కొంది.