
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్” సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ “నారప్ప” అనే పేరుతో నిన్న అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో మొదలైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న మొదలు కావడంతో వెంకటేష్ లుక్ విడుదల చేయడంతో ఇప్పుడు అది పెద్ద ట్రేండింగ్ గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చుసిన వెంకటేష్ లుక్ గురించే డిస్కషన్.
ధనుష్ హీరోగా వచ్చిన “అసురన్” సినిమా చూడని వారు ఆ సినిమా గురించి ఇప్పటి వరకు తెలియని వారు వెంకటేష్ లుక్ చూసి సినిమా ఎలా ఉంటుందని, ఫ్యామిలీ అండ్ కామెడీ చిత్రాలతో ఆకట్టుకునే వెంకటేష్ ఇలా ఒక్కసారిగా సీరియస్ ఎమోషనల్ పాత్రలో నటించడంతో అందరూ చూపు ఈ సినిమాపై పడింది. కానీ ఈ సినిమాకు కుటుంబకథా చిత్రాలు చేసుకునే శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుడు నిర్మిస్తున్నాడు అంటేనే అందరూ అతడు ఈ సినిమా భారాన్ని ఎలా మోస్తాడో, “అసురన్” సినిమాలో అద్భుతంగా ఎమోషన్స్ క్యారీ చేయడంతో వాటన్నింటిని ఈ సినిమాలో ఎలా చూపిస్తాడో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.