
2020 వేసవిలో పలు ఆసక్తికరమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో స్ట్రయిట్ పిక్చర్స్ తో పాటు రీమేక్ మూవీస్ కూడా ఉండడం విశేషం. ఆ క్రేజీ రీమేక్స్ వివరాల్లోకి వెళితే…ఏప్రిల్ 9న తడమ్ కి రీమేక్ గా రూపొందుతున్న రెడ్ (ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో,కిషోర్ తిరుమల దర్శకుడు) రిలీజ్ కానుండగా.. మే నెలలో అసురన్ రీమేక్ (విక్టరీ వెంకటేష్ కథానాయకుడు ,శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు) విడుదల కానుంది. ఇక అదే మే నెలలో పింక్ రీమేక్ (ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రధారి,వేణు శ్రీరామ్ దర్శకుడు) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. సమ్మర్ సీజన్ లో తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ క్రేజీ రీమేక్స్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.