
టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా సరే నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అతడి మద్యపాన సేవనం గురించే మాట్లాడుతున్నారు. వెస్టిండీస్ పర్యటన నుంచి ఈ ట్రోలింగ్ పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టులో తలపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు శాస్త్రి ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. బంతిని పట్టుకొని స్పిన్ బౌలింగ్ చేస్తున్న పోజు ఇచ్చాడు. ఈ చిత్రాలతో ‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ అనే అర్థం వచ్చేలా ఓ వ్యాఖ్య జతచేశాడు. అంతే.. వెంటనే ట్విటర్లో వ్యంగ్య బాణాల మోత మొదలైంది. నెటిజన్లు అతడి చిత్రాలను మార్ఫింగ్ చేసి రీట్వీట్లు చేస్తున్నారు. ‘ప్రధాన కోచ్‌కు యోయో టెస్టు పెట్టాలి’ అని అంటున్నారు. మరికొందరు ‘నిజమే.. పాత అలవాట్లు పోవు’ అంటూ గ్లాసులోకి బీరు వంపుతున్న చిత్రాలు పెట్టేస్తున్నారు. రవిశాస్త్రిని లక్ష్యంగా ఎంచుకోవడం కొత్తేమీ కాదు. చాన్నాళ్లుగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
TRUE……….. pic.twitter.com/G3XMERxzsK
— Krishna (@Atheist_Krishna) November 13, 2019