
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది… ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని కుటుంబసభ్యులు హైకోర్టుని కోరడంతో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణంలో పలువురు ప్రముఖ రాజకీయ నేతల జోక్యం ఉందని పలు అనుమానాలు వచ్చాయి.
వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐకి కేసు అప్పగించాలని హైకోర్టు ను కోరిన సంగతి అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు సీఎం అయిన తరువాత వివేకా హత్యా కేసులో జగన్ మౌనం వహించారు ఈ మౌనం వెనుక ఉన్న అర్ధం ఏమిటోమరి తెలియాల్సి ఉంది ..!
పోలీసు యంత్రాంగమంతా జగన్ చేతుల్లో ఉందని దీంతోనే ఆయన కేసును తారుమారు చేసే అవకాశం ఉందని వివేకా కుటుంబ సభ్యలు ఆరోపించారు. ఈ దర్యాప్తు సాఫీగా సాగుతోందని, రెండు నెలల్లో ఈ కేసు దర్యాప్తు పూర్తవుతుందని ,ఎలాంటి అనుమానాలకు తావు లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సొంత కుటుంబసభ్యుడిని హత్య చేసి రాజకీయానికి వాడుకున్నారని టీడీపీ నాయకులు జగన్ పై ఆరో పిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి తో పాటు మరో ముగ్గురి కీలక పాత్ర ఉందని , అందుకే సీబీఐ కి ఈ కేసు అప్పగించడానికి జగన్ అంగీకరించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.