టాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ మూవీ సెన్సెషన్ సృష్టించిన సంగతి తెల్సిందే. విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా ‘అర్జున్ రెడ్డి’ నిలిచింది. సందీప్ వంగా ఈ సినిమా తెరకెక్కించిన విధానానికి యువత ఫిదా అయ్యారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీని సందీప్ వంగా హిందీలో ‘కబీర్ సింగ్’ పేరిట తెరకక్కించాడు. హిందీలోనూ ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ-సందీప్ వంగా కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం.
‘అర్జున్ రెడ్డి’ మూవీతో తర్వాత విజయ్ దేవరకొండ చాలా బీజీగా మారాడు. ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలతో విజయ్ దేవరకొండ మంచి విజయాలతో స్టార్ హీరోగా మారాడు. అయితే ఇటీవలే విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కెరీర్ ఢీలా పడింది. అదేవిధంగా ‘కబీర్ సింగ్’ హిట్టు తర్వాత సందీప్ వంగా రణ్ బీర్ సింగ్ తో మూవీ ప్లాన్ చేశాడు. అనివార్య కారణాలతో ఈ మూవీ నుంచి రణ్ బీర్ సింగ్ తప్పుకున్నాడు. దీంతో సందీప్ వంగా ఈ మూవీని విజయ్ దేవరకొండతో చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకక్కుతుంది. ఈ మూవీ తరహాలోనే సందీప్ వంగా విజయ్ తో హిందీ, తెలుగులో ఒకేసారి మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. పక్కా క్రైమ్ డ్రామా తరహా మూవీని తెరకెక్కించున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి మించేలా ఈ మూవీని తీర్చిదిద్దేందుకు సందీప్ వంగా సన్నహాలు చేస్తున్నాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ఢీలా పడిన విజయ్ దేవరకొండ మరోసారి ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడితో పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.