యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బీజీగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తూనే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ను లైన్లో పెట్టారు. ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుస్తున్న ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా సమంత ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘బృందావనం’, ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు గడుస్తోంది. సమంత పెళ్లాయిన తర్వాత తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రోమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇటీవలే త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో బాక్సాఫీసు రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా ‘అల.. వైకుంఠపురములో’ మూవీ నిలిచింది. ఎన్టీఆర్ మూవీలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది. మరో కథనాయికగా సమంతను తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనుందని సమాచారం.
ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఎన్టీఆర్ షూటింగ్ కాంప్లీట్ కాగానే ఈ మూవీని పట్టాలెక్కేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తుంది.