బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంతివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము ఉధ్యేశ పూర్వకంగానే శివసేన పార్టీని మోసం చేశామని ముంగంతివార్ అంగీకరించారు. అసెంబ్లీ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు తరహాలో బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటిగా సాగుతాయని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎన్సీపీ నేత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, ఎన్సీపీ, కాంగ్రెస్ అనుబంధం మూడునెలలని, బీజేపీ-శివసేన మధ్య బంధం 30ఏళ్ళని అన్నారు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోకపోవడం ద్వారా బీజేపీ తప్పు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు వెనుకడుగు వేయడంతో ఎన్సీపీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందని సుధీర్ అన్నారు. తమ తప్పును తెలుసుకుని తిరిగి రెండు పార్టీలు కలిసే సమయం ఎంతో దూరంలో లేదని, తమ కలయికను సులభతరం చేసేలా మహారాష్ట్రలోనూ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: We cheated sena says bjp leader sudhir mungantiwar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com