Home Blog Page 8591

Actress Nandita Swetha New Pics

సచిన్ పైలట్ కు గాలం… ఫారూఖ్ విడుదల!

జ్యోతిరాదిత్య సింథియాను చేర్చుకోవడం ద్వారా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేసిన బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై దృష్టి సారించినట్లున్నది. సింథియాకు సన్నిహితుడు కావడంతో పాటు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని అసంతృత్తిగా ఉన్న అక్కడి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పై గాలం వేస్తున్నారు.

సచిన్ కూడా ఓ 20 మంది ఎమ్యెల్యేలతో బైటకు వస్తే అశోక్ గెలట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సులభం కాగలదని భావిస్తున్నారు. సచిన్ ని మంచి చేసుకోవడం కోసమే ఆయన మామగారైన జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ఫారూఖ్ అబ్దుల్లా విడుదలకు ఆదేశాలు జారీచేసిన్నట్లు కనిపిస్తున్నది.

గత ఏడు నెలలుగా, ఆర్టికల్ 370 రద్దు సమయం నుండి ఆయనను గృహ నిర్బంధంలోనే ఉంచారు. ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్ర‌కారం ఆయ‌న్ను అరెస్టు చేశారు. 83 ఏళ్ల ఫారూక్‌తో పాటు ఆయ‌న కుమారుడు ఒమ‌ర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీల‌ను కూడా నిర్భ‌ధించారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఒమ‌ర్ అబ్ధుల్లాపై పీఎస్ఏను ప్ర‌యోగించారు.

ఆ చ‌ట్టం ప్రకారం ఎటువంటి విచార‌ణ లేకుండా రెండేళ్లు నిర్బంధంలో ఉంచ‌వ‌చ్చు. సాధారణంగా తీవ్రవాదులు, నేరస్థులపై ఉపయోగించే ఈ చట్టాన్ని మొదటిసారిగా రాజకీయ నాయకులపై ఉపయోగించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఫారూక్ డిటెన్ష‌న్‌ను మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగించారు.

ఫారూఖ్ కుమార్తెను సచిన్ పైలట్ వివాహం చేసుకున్నారు. అనుకున్నట్లు జరిగితే ఇంకా నిర్బంధంలో ఉన్న మరో మాజే ముఖ్యమంత్రి, ఫారూఖ్ కుమారుడు ఒమర్ అబ్దుల్లాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఖాకీ డ్రెస్ వేసుకో బోతున్న దుల్కర్ సల్మాన్

మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఓకే బంగారం చిత్రం తో అటు తమిళంలో ఇటు తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకొన్నాడు. ఆ తరవాత తెలుగులో డైరెక్టుగా చేసిన . మహానటి చిత్రం లో జెమినీగణేశన్ పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు..ప్రస్తుతం తమిళ అనువాద చిత్రం ” కనులు కనులను దోచాయంటే” సినిమా కూడా మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ విజయాల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికరమైన వార్తొకటి బైటికి వచ్చింది.

దుల్కర్ సల్మాన్ త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది.. ఈ సినిమాను పడి పడి లేచే మనసు ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తాడని అంటున్నారు.కాగా ఈ చిత్రం లో దుల్కర్ సల్మాన్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఇటీవల హను రాఘవపూడి, దుల్కర్ సల్మాన్ ని కలిసి కథను వినిపించాడట. అపుడు దుల్కర్ సల్మాన్ క్లైమాక్స్ ఇంకా బాగా ఉండాలని అన్నాడట …ఇప్పుడు హను రాఘవపూడి సదరు సినిమా క్లైమాక్స్పై మార్చే పనిలో పడ్డాడు… పడిపడిలేచె మనసు ప్లాప్ కావడంతో హను రాఘవపూడికి మరో తెలుగు హీరో అవకాశం ఇవ్వలేదు. అలాంటి టైం లో దుల్కర్ సల్మాన్ దేవుడిలా వరమిచ్చాడు.
Talent is off litle without an opportunity

విజయ్ దేవరకొండ కి కొండంత అవమానం

కెరీర్ ఆరంభం నుంచి దూకుడు చూపించి చాలా తక్కువ టైములోటాప్ పొజిషన్ చేరుకొన్న నటుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే…పెళ్లి చూపులు తో మొదలైన విజయాల పరంపర గీత గోవిందం వరకు తిరుగులేని విధంగా సాగింది. ఆ తరవాత నుంచి కెరీర్ గాడి తప్పింది.డియర్ కామ్రేడ్ ,వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.

డియర్ కామ్రేడ్ కలెక్షన్ పరంగా కొంత బెటర్ కానీ వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి మాత్రం చాలా దారుణం. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ ఫై కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిసా , ఇజా బెల్లా వంటి తారలు హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూట కట్టుకుంది.మొదటి వీకెండ్ వరకూ కలెక్షన్ల విషయంలో పర్వాలేదు. ఆ తరువాత నుండీ పూర్తిగా డౌన్ అయిపోయింది.

ఇక వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ కేవలం 10.కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . దీంతో 20 కోట్ల వరకూ ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయి..ఇక పూరిజగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) చిత్రంతో విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Failures are good teachers

కరెంటు చార్జీలపై కెసిఆర్ కీలక నిర్ణయం


తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలోనే క్లారిటీ ఇచ్చారు. కరెంట్ చార్జీలతో పాటు, ప్రాపర్టీ టాక్స్(ఆస్తుల సుంఖం) కూడా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. అయితే, నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఇవి పెంచనున్నట్టు కెసిఆర్ తెలిపారు.

అసెంబ్లీలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మాట్లాడిన కెసిఆర్.. 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్ చార్జీల పెంపుకు సహకరించాలని కెసిఆర్ కోరారు. ఓట్ల కోసం భయపడడం మానేశాం.. ఎన్నికల్లో ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. అభివృద్ధిపైనే తమ దృష్టంతా అని స్పష్టం చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో ప్రాపర్టీ టాక్స్ పెంచబోతున్నాం.. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా పెంచుతాం.. అదే విధంగా మున్సిపాలిటీల్లోనూ టాక్స్ పెంచాల్సి ఉందన్నారు కెసిఆర్. పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చాం.. ఆ చట్టాన్ని అమలు చేసి తీరుతాం.. అనుకున్న ఫలితాలు రాబట్టుకుంటాం, అవసరం అయితే ఎమ్మెల్యేల జీతం కట్ చేస్తాం.. కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఆపబోమని కెసిఆర్ స్పష్టం చేశారు.

Nishabdham Movie Pre Release Event Photos

టీడీపీకి మరో షాక్..!


2020 స్థానిక ఎన్నికలు దగ్గరౌతున్న నేపథ్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి, వైసీపీలో చేరారు. ఈ రోజు టీడీపీకి మరో గట్టిషాక్‌ తగిలింది. కడప జిల్లాకి చెందిన టీడీపీ సీనియర్‌ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి సుబాన్‌ బాషా టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌ బాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. సుబాన్‌ బాషాతో తరలివచ్చిన ఆయన అనుచరులకు అంజద్‌ బాషా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కడపలో ఇప్పటికే టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో బుధవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గా ఉన్న సతీష్‌ రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనబడుతోంది.

రజినీని వెంటాడుతున్న ఫ్లాష్ బ్యాక్ డైలాగ్!


తగిన సమయంలో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడతానని గతంలో అనేక సందర్భాలలో రజినీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే నిన్న మరోసారి ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ అయిన తర్వాత రజిని మీడియా ముందొకొచ్చి తన రాజకీయ భవితవ్యం గూర్చి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన మరో అడుగు ముందుకేసి రాజకీయాలలో మార్పు కోసం పార్టీ పెడతా అని, తాను మాత్రం సీఎం అవడం కోసం పార్టీ పెట్టడడం లేదని, చదువు, విజ్ఞానవంతుడైన వ్యక్తినే సీఎంగా నిలబెడతా అని రజిని చెప్పుకొచ్చారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన మాట్లాడిన తీరులో అనేక అనుమానాలు వస్తున్నాయి. రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రత్యక్ష రాజకీయాలలో రజినీ ఉండాలనే విషయం రజిని మరిచిపోయినట్లున్నారు. అదే సమయంలో సీఎం కాండిడేట్ గా వేరే వ్యక్తిని ఉంచితే ప్రజలు ఓట్లు వేస్తారా..? అనే సందేహం వస్తుంది. ఆయన ఒక సినిమాలో చెప్పినట్లుగా “అతిగా ఆశపడే మగాడు చరిత్రలో నిలవడు” అనే డైలాగ్ గుర్తొచ్చి రజిని అలా అన్నాడా..?అనే అనుమానం వస్తుంది. సీఎం అవడం అంటే అతిగా ఆశపడటం అని రజినీకాంత్ అనుకుంటున్నారా.. ? అనిపిస్తోంది.

సినిమాలలో రాణించినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చి బొక్కబోర్లా పడ్డ కొంతమంది సినిమా సెలబ్రిటీలు గుర్తొచ్చి రజిని ఇలా మాట్లాడి ఉంటాడా..? అనే డౌట్ వస్తుంది. చిరంజీవి రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు. తమిళనాడులో డిఎండికె పార్టీ పెట్టి విజయ్ కాంత్ ఫెయిల్ అయ్యాడు. అలాగే కమల్ హాసన్ కూడా ఒక కోణంలో ఆలోచిస్తే ఫెయిల్ అయినట్లుగానే ఉన్నాడు. కాబట్టి వీరందరిని దృష్టిలో పెట్టుకొని రజిని అలా మాట్లాడి ఉండొచ్చని అనేక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 

నరసింహ సినిమాలో రజినికాంత్ చెప్పిన డైలాగ్ ఇదే..

ఆడదంటె అనుకువుగాఉండాలి, తొందర పడకూడదు.
చదువుండాలి, సంస్కారం పొకుడదు.
అదికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు.
క్రమశిక్షణ ఉండాలి, బరితెగించకూడదు.
భయబక్తులు ఉండాలి, బజారు మనిషిలా ప్రవర్తించకూడదు.
మొత్తం మీద ఆడది, ఆడదానిలాగా ఉండాలి.
You know one thing, angry is the cause of all miseries, one should know how to control it, other wise life will become miserable. Try to understand that.
Last but not least,
అతిగా ఆశ పడె మగవాడు, అతిగా ఆవేశ పడె ఆడది సుఖ పడినట్లు చరిత్రలో లేదు.

కరోనా బారిన పడ్డ స్టార్ హీరో

ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు సినిమా రంగానికి చెందిన వారిని కూడా వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష ముప్పైవేల మందికి ఈ వైరస్ ఎఫెక్ట్ కాగా వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

తాజాగా ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన సతీమణి రీటా విల్సన్ కు సైతం కరోనా వైరస్ సోకింది. ప్రఖ్యాత గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారం గా వార్నర్ బ్రదర్స్ తీస్తున్న సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన టామ్ హాంక్స్ కి ఈ విపత్తు ఎదురైంది.

ఆస్ట్రేలియాలో ఉండగా చలి జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులు రావడంతో టామ్ హాంక్స్ దంపతులు వైద్యులను సంప్రదించారట…ఆ క్రమంలో వారికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. దాంతో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, వారి సూచనల్ని పాటిస్తున్నారట టామ్ హాంక్స్ దంపతులు. తమ సినిమా యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా ఉండటం మూలంగానే టామ్ హాంక్స్, ఆయన భార్యకు కూడా కరోనా వైరస్ సోకినట్టు ఈ హాలీవుడ్ స్టార్ పి ఆర్ ఓలు .చెబుతున్నారు. Disease is a disease for all

భారత్ లో కరోనాతో ఒకరు మృతి

చైనాలో సోకిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. 120కిపైగా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 4వేలమందికి పైగా కరోనా బాధితులు మృత్యువాతపడగా, లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో 75కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతిచెందాడు. తాజాగా అతడికి కరోనా సోకినట్టు ఆ రాష్ట్ర అధికారులు గురువారం ప్రకటించారు. అయితే వృద్ధుడు మృతిచెందడానికి ముందు హైదరాబాద్‌లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిపారు. దీంతో వృద్ధుడు చికిత్స తీసుకున్న ఆసుపత్రి, వైద్య సిబ్బందిని పర్యవేక్షణలో ఉంచినటు్ల ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ జి శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో ఎవరికీ వైరస్‌ సోకినట్టు గుర్తించలేదని ఆయన తెలిపారు.

గతనెల 29న వృద్ధుడు సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారిత కేసుల సంఖ్య 75కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి కరోనా మరణానికి హైదరాబాద్ తో సంబంధం ఉన్నట్టు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ఆసుపత్రుల్లో తగిన చర్యలు తీసుకోవాలని దేశాలు జారీ చేసింది. ప్రజలు భయాందోళన చెందకుండా ప్రభుత్వం అందించే సలహాలు, సూచనలు పాటించాలని కోరింది.

పవన్ సినిమాకు 150కోట్ల భారీ బడ్జెట్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలతో బీజీగా మారారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ మూవీ తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కుతుంది. ‘వకీల్ సాబ్’లో పవన్ కు జోడీగా గోవా సుందరీ ఇలియానా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నివేథా థామస్, అంజలి, అనన్య, నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ మూవీ కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పవన్ ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. మొగల్ సామ్రాజ్య కాలంనాటి కథాంశంతో క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఇందులో బందిపోటుగా కనిపిస్తాడని సమాచారం. పవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని చిత్రీకరించనున్నారు. దాదాపు 150కోట్ల రూపాయాల బడ్జెట్ తో నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో పవన్ సరసన ఇద్దరు భామలు నటించనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా క్రిష్ ఆస్థాన నటి ప్రజ్ఞ జైస్వాల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ తొలిసారి పీరియడ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కోహినూర్ డైమండ్ కోసం జరిగే ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలువనుందట. ఇందుకోసం స్టంట్ మాస్టర్లు ప్రత్యేకంగా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. చారిత్రక సెట్ల కోసం నిర్మాత భారీగానే ఖర్చు చేస్తున్నాడట. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా పవన్ ‘వకీల్ సాబ్’ మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్ సన్నహాలు చేస్తున్నారు.

విదేశాల నుంచి వస్తే ఇల్లు కదలకండి!

TRS

దేశంలో ‘కరోనా’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరొచ్చినా 14 రోజులు ఇల్లు కదలవద్దని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర హితవు చెప్పారు. అటు వనీత్ వారిని రెండు వారాలపాటు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటివరకూ వైరస్ లక్షణాలు ఉన్నవారినే ఐసోలేషన్‌‌లో ఉంచుతుండగా, ఇకపై లక్షణాలతో సంబంధం లేకుండా అందరినీ హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో పెట్టనున్నారు. వైరస్‌‌ సోకిన వ్యక్తికి లక్షణాలు బయటపడడానికి 2 నుంచి 14 రోజుల సమయం పడుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్ బాధ్యతలను ఫీల్డ్లెవెల్ ఆరోగ్య కార్యకర్తలకు అప్పగించనున్నారు. వీరు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, లక్షణాలు బయటపడితే దవాఖానాలకు తరలిస్తారు.

విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ముందుజాగ్రత్త చర్యగా కుటుంభం సభ్యులను, బయటి వ్యక్తులను కలవొద్దని ఈటెల సూచించారు. ఆరోగ్యశాఖ నుంచి కాల్స్ వస్తే అన్ని వివరాలు చెప్పాలని కోరారు.

కరోనా భయం పోయేవరకూ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు.కాన్ఫరెన్సులు, సెమినార్లను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కరోనాపై వదంతులను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డిని కోరారు.

ప్రస్తుతం గాంధీలో కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కోవిద్-19 విషయంలో ముందడుగు

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ విషయంలో వైద్యులు ముందడుగు వేశారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ ఎలా వస్తుందో స్పష్టమైన అవగాహన లేకపోయినట్టికి ఈ వైరస్ సోకినా వ్యక్తిని ఎన్ని రోజుల్లో గుర్తించవచ్చు.. ఎన్ని రోజులు చికిత్స అవసరం అన్న అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు వైద్యులు జరిపిన రీసర్చ్ లో కాని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

సర్వే ప్రకారం.. కేవలం ఐదు రోజుల వ్యవధిలో కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చని చెబుతున్నారు. విపరీతమైన జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రారంభమైన రోజు నుంచి ఐదు రోజుల వరకు తగ్గకపోతే ఈ వ్యాధి లక్షణంగా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చేసిన అధ్యయనాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. వ్యాధి లక్షణాలు ఉన్నంత మాత్రాన వైరస్ సోకినట్లు భావించనవసరం లేదని వైద్యుల అధ్యయనం మేరకు తెలుస్తోంది.

వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత చికిత్స అందించడానికి 14 రోజుల క్వారంటైన్ (తప్పనిసరిగా ఇసోలాటిన్ వార్డులో చికిత్స) సమయం అవసరం అని తెలుస్తోంది. వైద్య నిపుణుల అంచనా మేరకు కరోనా వైరస్ లక్షణాలు రోగగ్రస్థుడికి కనిపించిన తరువాత నెగిటివ్ అని తేలితే ఏ గొడవా లేదు.. పాజిటివ్ అని వస్తే మాత్రం దీనికి కచ్చితంగా 14 రోజుల వ్యవధిలో చికిత్స చేసి ఇంటికి పంపవచ్చని జాన్స్ హొప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. వ్యాధి సోకిన వారిలో పదివేల మందికి ఒకలా ఉంటే 101 మందికి మరో రకంగా ఉంటుంది. పదివేల మందికి 14 రోజుల్లో చికిత్స నయం చేయగలిగితే మిగిలిన 101 మందికి మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది.

Anjali at Nishabdham Pre Release Event

Anushka at Nishabdham Pre Release Event

‘డెడ్లీ కరోనా’పై పాన్ ఇండియా మూవీ

చైనాలో సోకిన కరోనా ప్రస్తుం ప్రపంచాన్ని వణికిస్తుంది. 120కిపైగా దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 4వేలమందికి పైగా కరోనా బాధితులు మృత్యువాతపడగా, లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం భారత్‌లో 75కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా(కోవిడ్-19)పై కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్‌ సినిమా తీసేందుకు యత్నిస్తున్నాడు. ఈ మూవీకి ‘డెడ్లీ కరోనా’ అనే టైటిల్ రిజిస్టర్‌ చేయించారు. ఈ మూవీలో కరోనా పుట్టపురోత్తరాలతో సహా ఇది ఎలా వ్యాపిస్తుంది.. ఇతర దేశాలకు ఎలా పాకింది.. ఎలా నివారించాలి.. అనే అంశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని పాన్‌ ఇండియా లెవల్లో తీసేందుకు చిత్రదర్శకుడు సన్నహాలు చేస్తున్నాడు.

భారత్ లో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీలోని నెల్లూరు, కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కరోనా లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం పేర్కొంది.

పాతబస్తీలో మరికొన్ని కరోనా కేసులు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌ లో ఒకరిని బలితీసుకుంది. దీంతో దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని కల్‌ బుర్గికి చెందిన 76ఏళ్ల సిద్దిఖి ఈనెల 10వ తేదీనే మరణించినా… అతడికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్ట్‌లు నిన్ననే అందాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

కలబుర్గికి చెందిన మహ్మద్‌ సిద్ధిఖి జనవరి 29న సౌదీకి పని నిమిత్తం వెళ్లాడు. పని ముగించుకుని నెల రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 29న భారత్‌ కు వచ్చాడు. సౌదీ నుంచి అతడు నేరుగా హైదరాబాద్‌ పాతబస్తీలోని బంధువులు ఇంటికి వచ్చాడు. అక్కడే మార్చి 5 వరకు ఉన్నాడు. ఈనేపథ్యంలో సిద్ధిఖి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. సౌదీ నుండి హైదరాబాద్ కు వచ్చి పాతబస్తీలో దాదాపు 10రోజులు నివాసమున్న సిద్దిఖికి కరోనా సోకి మూడురోజుల క్రితం చనిపోయాడు. దింతో 10రోజులలో అతను ఎవరెవరిని కలిసాడో తెలియదు. వారికి కూడా ఈ వైరస్ సోకె ప్రమాదం ఉంది.