
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్ సోకి నిన్న మరో వ్యక్తి మృతి చెందారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ వైరస్ సోకి మరణించింది. ఢిల్లీలో ఆరో కరోనా కేసుగా రికార్డయిన ఆమె.. కొద్ది రోజులుగా అక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దింతో కరోనా సోకి చనిపోయిన మృతుల సంఖ్య రెండుకు చేరింది. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 81కి పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా 5వేల మంది కరొనా కి బలికాగా దాదాపు 1,32,000 మంది దాని బారిన పడ్డారు. చైనాలో మరణాలు, కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 80వేల కేసులు అక్కడ నమోదయ్యాయి అందులో 3,177 మంది చనిపోయారు. ఇటలీలో చనిపోయిన వాళ్ల సంఖ్య వెయ్యి దాటేసింది, దాదాపు 15,113 కేసులు నమోదయ్యా యి. ఇరాన్‌లో 514 మంది చనిపోయారు అందులో నిన్న ఒక్కరోజే 85మంది చనిపోవడం గమనార్హం. దక్షిణ కొరియాలో 71, స్పె యిన్‌లో 120, ఫ్రాన్స్‌లో 61 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 41కి పెరిగగా.. పాజిటివ్ కేసులు 1,832 నమోదయ్యాయి.