ఒక్కోసారి సినిమా బాగోక పోయినా ఆ చిత్రంలో నటించిన హీరో , హీరోయిన్ లకు మంచి జోడీ అని పేరు వస్తుంది. వినయ విధేయ రామ చిత్ర విషయం లో కూడా అదే జరిగింది . ఆ సినిమాలో జోడీగా నటించిన రామ్ చరణ్ , కియారా అద్వానీ డాన్సులో, నటనలో సమ ఉజ్జీలుగా చేసారు. ఇపుడు ఆ జంట మరోసారి మన్ననలు పొందారు. అందుకే ఆ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకున్నా గాని మంచి వసూళ్లు రాబట్టింది.
ఇదిఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం “ఆచార్య”లో ఒక కీలక పాత్రను రామ్ చరణ్ పోషించ బోతున్నాడు. మొదట ఆ పాత్రను మహేష్ బాబు చేస్తాడంటూ ప్రచారం జరిగింది. కానీ బడ్జెట్ మరియు ఇతరితర విషయాల నేపథ్యంలో ఆచార్యలో రామ్ చరణ్ నటిస్తేనే బాగుంటుందనే నిర్ణయానికి యూనిట్ అంతా వచ్చారట.
ఇక రామ్ చరణ్ కు హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం లో పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత చివరకు వినయ విధేయ రామ ఫేమ్ కియారా అద్వానీని ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల మద్య మంచి స్నేహం ఉంది. వినయ విధేయ రామ చిత్రంలో కలిసి నటించే సమయంలో వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడటం.. ఆమె బర్త్ డే కు ముంబయికి రామ్ చరణ్ వెళ్లడం వంటివి జరిగాయి. దీనితో ఈ గెస్ట్ రోల్ సమస్య తేలిగ్గా తీరిపోయింది.
A thing of friendship is very useful