Home Blog Page 8581

ఆంధ్రాలో మరో కరోనా కేసు!

ఆంధ్రప్రదేశ్‌ లో తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదు కాగా రెండో కరోనా పాజిటివ్ కేసు ఒంగోలులో నమోదైంది. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది.

ఈనెల (మార్చి) 12న లండన్‌ నుంచి ఒంగోలుకు వచ్చిన ఒక వ్యక్తికి జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేశారు. వెంటనే శాంపిల్స్‌ తీసుకున్న వైద్యులు తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌ కు పంపించారు. నిన్న రాత్రి వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది.
బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. రాష్ట్రంలో మరో పాజిటివ్‌ కేసు నమోదవడంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు ఒంగోలు ప్రభుత్వాస్పత్రి వైద్యులను అలర్ట్‌ చేశారు. భాధితున్ని ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ లో చికిత్స అందిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 105 మంది శాంపిల్స్‌ పరిశీలించగా 96 నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. రెండు పాజిటివ్‌ రాగా, మరో ఏడుగురి రిపోర్టు రావాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రానికి మిగిలిన కేసులకు సంబంధించిన రిపోర్టులు రానున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. భారత్ లో ఈ కేసుల సంఖ్య 175 చేరగా అందులో ముగ్గురు చనిపోయారు.

Kajal Agarwal stunning Pics

కేఏ పాల్‌కు రామ్ గోపాల్ వర్మ సవాల్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ దాన్ని వివాదాస్పదం చేస్తూ ఉంటారు. తనకు గిట్టని వాళ్లపై ఏదో కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు ముందు నుంచి అలవాటు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ట్వీట్లు పెడుతున్నారు. ఈసారి వర్మ కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు.

వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు వైరస్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణకు క్వారంటైన్ సెంటర్ల అవసరం ఏర్పడుతున్న వేళ రాజకీయ నాయకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ తన వంతుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణలోని తమ సంస్థకు చెందిన చారిటీ గదుల్ని క్వారంటైన్ సెంటర్లుగా వాడుకోమని ఓక వీడియో ద్వారా తెలిపారు.

అయితే ఇప్పటికే కరోనా వైరస్ పై పలు రకాలుగా ట్వీట్లు చేసిన వర్మ.. తాజాగా కేఏ పాల్‌ను ఉద్దేశిస్తూ..…‘అరే కేఏ పాలు..ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు’. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మ’ అని కేఏ పాల్‌పై సెటైర్లు వేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

https://twitter.com/RGVzoomin/status/1240354208987004928?s=20

ఆ ముగ్గురు ఎందుకు స్పెషల్?


వేమన ఒక పద్యం రాస్తూ..”పురుషులందు పుణ్యపురుషులు వేరయా” అన్నాడు. స్వతంత్ర భారతావనిలో ముగ్గురు న్యాయమూర్తులకు ఆ వ్యాఖ్యానం బాగా సెట్ అయ్యిది. సర్వోన్నత న్యాయస్థానానికి మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జే కనియా నుంచి ప్రస్తుత న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్దే వరకు 47మంది ప్రధానన్యాయమూర్తులుగా పనిచేసారు. ఈ 47మందిలో 21వ న్యాయ మూర్తిగా పనిచేసిన బహరూల్ ఇస్లాం, 25వ న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాథ్ మిశ్రా, 46వ న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ లు వేరు. వారు మాత్రమే పెద్దల సభకు ఎందుకు నామినేట్ అయ్యారో తెలుసుకుంటే కొన్ని నమ్మలేని నిజాలు బయట పడతాయి. నల్లటి వస్త్రం తో న్యాయదేవత కళ్ళకు ఎందుకు గంతలు కట్టారో తెలుసుకోవచ్చు. న్యాయానికి,చట్టానికి జరిగిన సంగ్రామంలో అలనాటి కేంద్ర ప్రభుత్వాలు ఎలా లబ్ది పొద్దయో తెలిసికోవచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాన్ని, న్యాయంగా మలిచిన మాజీ ప్రధాన న్యాయమూర్తులను పెద్దల సభకు నామినేట్ చేసి న్యాయవ్యవస్థ స్వాతంత్రాన్ని, న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఎలా దెబ్బ తీసారో తెలుసుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే…1980లో పట్టణ సహకార బ్యాంకు కుంభకోణంలో అప్పటి కాంగ్రెస్ బీహార్ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఈ కేసులో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న బహారుల్ ఇస్లాం కాంగ్రెస్ సీఎం కి అనుకూలమైన తీర్పు ఇచ్చారు. ఆ తరువాత 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి రాజ్యసభకు వెళ్లారు.

ఇందిరా గాంధీ హత్యకు సంబంధించి1984లో అల్లర్లు చెలరేగి వేలమంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఆ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది నేతలపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు, కానీ ఆ సంఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చారు ఆనాటి సుప్రీంకోర్టు జడ్జి రంగనాథ్ మిశ్రా. ఇదే జడ్జి 1998లో కాంగ్రెస్ తరుపున రాజ్యసభకు ఎంపిక అయ్యారు.

ప్రస్తుతం మాజీ సిజేఐ రంజన్ గొగోయ్ పెద్దల సభకు ఎంపిక కావడం, దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఈయన బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపిక అయ్యారు. మరి ఈయన బీజేపీ కి ఏమైనా చేశారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు సంబంధించి మోడీ సర్కార్ పై అభియోగాలు ఉన్నాయి. కానీ రంజన్ గొగోయ్ బీజేపీ ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇచ్చారనే మాటవినబడుతోంది. అంతేకాకుండా అయోధ్య రామమందిరం వివాదం, 370 ఆర్టికల్ రద్దుకు, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక తీర్పులలో మోడీ సర్కార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారనే టాక్ వినబడుతోంది.

ఏది ఏమైనా ఎంతోమంది న్యాయమూర్తులకు లేని భాగ్యం ఇలా కొంతమందికి మాత్రమే రావడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. “న్యాయమూర్తులు, పదవిలో ఉన్నప్పుడు ఇచ్చే తీర్పే.. పదవీ విరమణ తర్వాత వారి పదవులను నిర్ణయిస్తాయి” అనే అరుణ్ జైట్లీ మాటలు ఇప్పుడు అనేక మంది రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.

వంట పాత్రలతో తంటాలు పడుతున్న రీతూ వర్మ

2005 లో వచ్చిన గజినీ చిత్రంలో హీరోయిన్ ఆసిన్ ” ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు వంట గది నుండి బయటకు వస్తున్నారు రా ..మళ్ళీ మమ్మల్ని వంటగది లోకి పంప కండిరా ” అంటూ విలన్ ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పట్లో ఆ డైలాగ్ ప్రేక్షకుల ఫై చాలా ఇంపాక్ట్ చూపించింది అదలా వుంటే నేటి యువ హీరోయిన్ రీతువర్మ మాత్రం మళ్ళీ వంటగదికి పరిమితమవుతోంది.

ఆశ్చర్య పడకండి ఇది నిజజీవితంలో కాదు. రీతు వర్మ ఒప్పుకొన్న తాజా చిత్రం కోసం అలా వంటింటి కుందేలు గా మారింది. అందుకోసం రకరకాల రెస్టారెంట్లలో చెఫ్ లను పరిశీలిస్తూ.. కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళ పనితీరును అబ్జర్వ్ చేస్తోందట. చాలా తక్కువ మంది మెథడ్ యాక్టర్స్ మాత్రమే పాటించే పద్ధతి ఇది. తెలుగులో ఎస్ వి రంగారావు ,సావిత్రి వంటి వారు అలా చేసే వారు. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల సినిమాలో నటిస్తున్నట్లు కాక బిహేవ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతారు. రీతువర్మ వర్క్ డెడికేషన్ చూసిన దర్శక ,నిర్మాతలు ఫుల్ హ్యాపీ గా ఉన్నారట …

రీసెంట్ గా వచ్చిన “కనులు కనులను దోచాయంటే” అనే ద్విభాషా చిత్రం తో కమర్షియల్ గా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న రీతువర్మ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అయితే ఆమె చియాన్ విక్రమ్ తో చేసిన డ్రీమ్ ప్రొజెక్ట్ “ధృవ నక్షత్రం” మాత్రం విడుదలకు నోచుకోలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా విడుదలకు నోచుకోలేక పోయింది..“పెళ్ళిచూపులు” చిత్రం తరవాత పెద్దగా పుంజుకొని రీతూ కెరీర్ ఇప్పుడు ” కనులు కనులను దోచాయంటే “సక్సెస్ తో తెలుగు-తమిళ భాషల్లో బాగా పెరిగింది ఇదే స్పీడ్ తో వెళ్తే రీతు వర్మ స్టార్ హీరోయిన్ గా ఎదగడం తొందర్లోనే చూస్తాం.
If you work sincere ,,success follows

‘పెళ్ళైతే’ నాకేం తక్కువ అంటున్న సమంత

సాధారణంగా హీరోయిన్లు తమ కెరీర్ ముగిసిపోతుంది అనుకొంటున్న టైములో పెళ్లి చేసుకొంటారు. కానీ అక్కినేని వారి కోడలు అలా కాదు. పెళ్లి అయినా కూడా తన కెరీర్ ని జాగ్రత్తగా కాపాడుకొంటూ వస్తోంది . ఇంకా చెప్పాలంటే పెళ్లి అయ్యాకే సమంత క్రేజ్ ఇంకా పెరిగింది. జనరల్ గా హీరోయిన్ లకు పెళ్ళైన తర్వాత ఫేడౌట్ అయిపోతారు.. వారికి అవకాశాలు రావు. అది చాలా వరకూ నిజమైంది కూడా . అయితే అక్కినేని సమంత మాత్రం ఆ చరిత్రను తిరగ రాస్తూ దూసుకుపోతుంది. నాగ చైతన్య తో పెళ్ళైన తరువాత తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది.

ఇప్పుడు సమంత స్టార్ రేంజ్ లో దూసుకు పోతోంది..ఆ క్రమంలో ‘రంగస్థలం’ ‘మజిలీ’ ‘ఓ బేబీ’ వంటి వరుస విజయాల్ని అందుకుంది. ఇటీవల వచ్చిన ‘జాను’ చిత్రం మాత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.. అయితే సమంత నటనకి మాత్రం మంచి అపలాజ్ వచ్చింది. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సమంత ఇప్పుడు మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకొంది. రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు తాజాగా చేసిన సర్వేలో ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ -2019’ లిస్ట్ లో సమంత మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. పెళ్లి కెరీర్ కు ఏ మాత్రం అడ్డం కాదు అన్న విషయాన్ని సమంత మరోసారి ప్రూవ్ చేసింద ఇంకో ఆశ్చర్య కర విషయం ఏమిటంటే ఇదే సర్వే లో నటి అదితి రావు నాల్గవ స్తానం లో రాగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే అయిదవ స్థానంలో నిలిచింది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ఏడవ స్థానం లో ,కాజల్ ఎనిమిదవ స్థానం లో , రష్మిక మందన్న తొమ్మిదో స్థానం లోఉండగా మిల్కీ బ్యూటీ తమన్నా 22 వ స్థానం లో నిలిచింది అని సర్వే చెబుతోంది.
Marriage is not an hurdle

స్థానిక సంస్థల ఎన్నికల పక్రియ తిరిగి మొదటికేనా!

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు ఎవ్వరి ఇష్టం వచ్చిన భాష్యాన్ని వారు చెప్పుకొంటున్నారు. ఎన్నికల వాయిదాను సమర్ధించినా, ఏకపక్షంగా వాయిదా వేయడాన్ని ఆక్షేపించినట్లు వైసిపి నేతలు చెబుతూ ఉంటె, అదేమీ కాదని తిరిగి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నిర్ణయమైనా తర్వాత రాష్త్ర ప్రభుత్వానికి తెలిపామని మాత్రమే చెప్పిన్నట్లు టిడిపి నేతలు భాష్యం చెబుతున్నారు.

ఏది ఏమైనా, తిరిగి ఎన్నికల నిర్వహణ ఎక్కడి నుండి ఆగిందో అక్కడి నుండే ప్రారంభించి చేబడతారా లేదా మళ్ళి – తాజాగా నామినేషన్లు దాఖలు నుండి ప్రారంభిస్తారా అనే సమస్య ఇప్పుడు తెరపైకి వస్తున్నది. సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఎన్నికల నియమావళిని ఎత్తివేయడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక సాధారణ పరిస్థితుల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవని, అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని గుర్తు చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఎన్నికల నియమావళి అమలును రద్దు చేసింది. అంతేగాక ఎన్నికల నిర్వహణకు ముందు నాలుగు వారాలు ఎన్నికల నియమావళి అమలులో ఉండేలా చూడాలని సూచించిచింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

పైగా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్ర హోమ్ కార్యదర్శికి రాసిన లేఖ సహితం అందుకు బలం చేకూరుస్తుందని చెబుతున్నారు.రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర బలగాలు అవసరమని, లేదంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఆ లేఖలో స్పష్టం చేయడం గమనార్హం.

అంతేగాక రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలను కేంద్రానికి గుర్తుచేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఘర్షణలు, ఏకగ్రీవ ఎన్నికలు, నామినేషన్లు దాఖలు చేయకుండా ఆటంకం కల్పించారని కమిషన్‌కు పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

ఎన్నికల వాయిదాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో న్యాయస్థానాలు కూడా కమిషనర్ రమేష్‌కుమార్‌కు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.

జగన్ గృహ నిర్మాణానికి నిధులు నిల్ !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాకరంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు నిధులు లేక ముందుకు సాగడం లేదు. లక్ష్యాలను త్వరగా చేరుకోమని జిల్లాల అధికారులకు ఒక వంక ఆదేశాలు ఇస్తున్నా, చేసిన పనులకే బిల్లులు చెల్లించక పోతూ ఉండడంతో వారు చేతులెత్తి వేస్తున్నారు.

ఇప్పటికే భూసేరణకు రూ.వేల కోట్లు కావాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు రుణాలకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇప్పటివరకు రుణాలు మాత్రం ఖరారు కావడంలేదు. భూసేకరణ చేసిన అధికారులు నిధుల కోసం ఆర్థికశాఖకు బిల్లులు పంపుతుండగా తగిన బడ్జెట్ కేటాయింపులు లేవని తిరిగి వస్తూ ఉండడంతో జిల్లా అధికారులు ఖంగు తింటున్నారు.

ఇంటి స్థలాలకే నిధులు లేకుండా పోతుంటే ఇక గృహనిర్మాణం ఏ విధంగా చేబడతామని జిల్లా అధికారులు వాపోతున్నారు. నిధుల కొరత కారణంగా భూసేకరణలో జాప్యం జరుగుతున్నదని, తక్షణం తమ బిల్లులు చెల్లించాలని జిల్లా అధికారులు ఆర్ధిక శాఖపై వత్తిడి తెస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు.

నిధుల పరిష్టితిని పట్టించుకోకుండా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, భూ సేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం పట్ల జిల్లా అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బిల్లులు ఆర్థికశాఖకు చేరకుండానే ముందుగానే ‘తగినంత బడ్జెట్ లేదు’ అంటూ వెనుకకు పంపుతూ ఉండడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంటున్నదని జిల్లా కలెక్టర్లు వాపోతున్నారు.

దీని నుంచి ముందుకు సాగాలంటే పే అరడ్‌ అకౌంట్స్ అధికారులు రాతపూర్వక ఆదేశాలు రావాలంటున్నారని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో కూడా నెలాఖరులోగా అంతా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఎలా అమలు చేయగలమంటూ జిల్లాల్లోని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయకపోతే ఇళ్ల నిర్మాణం, భూసేకరణ కష్టమని వారు తేల్చిచెబుతున్నారు.

కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్య..!

కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఢిల్లీలోని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డు బ్లాక్‌నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు.ఈ సంఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి అని తేలడంతో అక్కడ అధికారులు దగ్గరలో ఉన్న సఫ్‌దార్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అతడిని ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి బ్లడ్ టెస్ట్ చేసి ల్యాబుకు పంపారు. అయితే ఈ వ్యక్తి రిపోర్ట్ రాకముందే ఆసుపత్రి ఐసొలేషన్ వార్డు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్ కు చెందిన ఈ వ్యక్తి గత సంవత్సరం నుండి సిడ్నీలో ఉంటున్నట్లు తెలిసింది.

ఆవుది, అది తాగితే.. కరోనా రాదా..?

భారత్ లో రోజు రోజుకి కారోన వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చైనాలో పుట్టిన కారోన వైరస్ అతి తక్కువ సమయంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టేసి కోట్లమంది ప్రజలను భయపెడుతోంది. ఈ కారోన వైరస్ ని నియంత్రించే వ్యాక్సిన్ కోసం వివిధ దేశాల శాస్త్రవేత్తలు మల్ల గుల్లాలు పడుతున్నారు. వ్యాక్సిన్ మాట దేవుడెరుగు కనీసం వైరస్ ఎలా పుట్టిందో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక అపోహలు, అసత్య, అవాస్తవ ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి గాలి వార్తలలో ఒకటి గోమూత్రం తాగితే కారోన రాదట.

అమెరికా, ఇశ్రాయేలు దేశాలు ఈ వైరస్ ని నియంత్రించే వ్యాక్సిన్ ని కనుగొనే పనిలో చాలా బిజీగా ఉంటే భారత్ లో కొంతమంది ఈ వైరస్ ని మన శరీరంలోనే చంపే సులువైన మార్గాన్ని కనుకొన్నారట. ఆవు మూత్రం తాగితే కారోన రాదట, ఒకవేళ వచ్చినా ఆవు మూత్రం తాగటం వల్ల అది మన శారీరంలోనే చనిపోతుందని కొంతమంది మూఢనమ్మక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశాన్ని 50సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ భారత మూఢనమ్మక సిద్ధాంతాలను ప్రజలలో రుద్దే ప్రయత్నం చేసే అపరమేధావులు పని గట్టుకొని మరీ ఈ గోమూత్ర పానియాన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. దేశంలో మత రాజకీయాలు చేసే ఒక పార్టీ నేతలు కూడా ఈ గోమూత్ర ప్రచారంలో ఉండటం గమనార్హం.

నిజంగానే గోమూత్రంలో కరోనాని నియంత్రించే శక్తి ఉంటే ఆ మూత్రాన్ని పూణే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి పంపి కారోన పాజిటివ్ అని తేలిన కేసులలో ప్రయోగించి చూడమని చెప్పండి, మంచి ఫలితాలను ఇస్తే యావత్ ప్రపంచానికి అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు. అంతేగాని ఇలా అసత్య, అవాస్తవ గాలి వార్తలన్ని ప్రచారం చేసి అమాయక ప్రజలను మోసం చేయొద్దని కొంతమంది వైద్యులు సలహాలు ఇస్తున్నారు.

దేశంలో 166కి చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య బుధవారం 166కి చేరుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని , ప్రజలు మరింతగా పాటించాల్సిన వైద్య సామాజికపరమైన జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించింది.

కరోనాతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు మృతి చెందారు. వచ్చే 15 రోజులు కరోనా మహమ్మారికి సంబంధించి అత్యంత కీలకమైన రోజులని, ప్రజలంతా కూడా అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన వైద్య విభాగం పూర్తిస్థాయి మార్గదర్శకాలను వెలువరించింది.

నెలరోజుల పాటు విమాన ప్రయాణాలను మానుకోవాలి, దూర ప్రాంతాలకు రైలు, బస్సు నౌకల ప్రయాణాలను నిలిపివేసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను పెట్టుకోవద్దు. దూర ప్రయాణాలు ప్రత్యేకించి ఎక్కువ మంది జనం ప్రయాణించే రైళ్లలో దూర ప్రాంత ప్రయాణాలలోనే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదముందని హెచ్చరించారు.

కరోనాతో ఉత్తరప్రదేశ్‌లో 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోషన్ కల్పించారు. వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనాతో వచ్చే నెల వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఈ మధ్యకాలంలో పరీక్షలు జరిగినట్లుగానే పరిగణించి వారిని పై తరగతుల్లోకి పంపిస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే బెంగళూరు టెక్ హబ్ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. ఉద్యోగులు అతి తక్కువ సంఖ్యలో విధులకు హాజరు అవుతున్నారు. అత్యధికులు వర్క్ ఫ్రమ్ హోంను ఆశ్రయించారు.

ఇన్ఫోసిస్, విప్రో ఇతర ప్రముఖ ఐటి కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి కల్పించారు. దీనితో కార్యాలయాల వద్ద రద్దీ తగ్గింది. పలు కూడళ్లు, ప్రముఖ రెస్టారెంట్లు మూతపడ్డాయి.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 43 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పుణే, ముంబైలకు చెందిన మహిళలిద్దరికి కరోనా సోకినట్లు బుధవారం నిర్థారణ అయింది. నెదర్లాండ్ నుంచి దుబాయ్ మీదుగా విమానంలో వచ్చిన 28 ఏండ్ల యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడైంది.

విదేశాలలో ఉంటున్న 276 మంది భారతీయులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఈ ఇరాన్‌లో ఉంటున్న భారతీయులకే అత్యధికంగా 256 మంది కరోనా బారిన పడ్డారు.

యుఎఇలో ఉంటున్న 12 మందికి, ఇటలీలోని ఐదుగురికి ఈ వైరస్ సంక్రమించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఇక శ్రీలంక, హాంగ్‌కాంగ్, కువైట్, రవాండాలో ఉంటున్న భారతీయులలో ఒక్కొక్కరికి చొప్పున ఈ వ్యాధి అంటుకుంది.

కాగా, భారతదేశపు సైన్యంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో సైనికాధికారులు అప్రమత్తమయ్యారు. పారామిలిటరీ సిబ్బందికి సాధారణ సెలవులు రద్దు చేశారు. నాలుగు పేజీల మార్గదర్శకాలలో సైనిక సిబ్బంది జాగరూకతతో ఉండాలని, యుద్ధ ప్రాతిపదికన తమ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందని హెచ్చరించారు.

దాదాపు పదిలక్షల మందితో ఉండే సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి, అసాంరైఫిల్స్, ఎన్‌ఎస్‌జి వంటి పలు భద్రతా బలగాల సిబ్బంది అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోరాదని స్పష్టం చేశారు.

కేంద్ర బలగాలు కోరిన రమేష్ కుమార్

కరోనా వైరస్ కారణంగా ఆరు వారాల పాటు వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టివేసిన కొద్దీ సేపటికే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ రాష్ట్రంలో ప్రభుత్వ ధోరణి కారణంగా నెలకొన్న హింసాయుత వాతావరణాన్ని వెల్లడి చేస్తూ కేంద్ర హోమ్ కార్యదర్శికి వ్రాసిన ఐదు పేజీల లేఖ సంచలనం కలిగిస్తున్నది.

ఆ లేఖలో ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలను ప్రశాంతంగా జరుపలేమని స్పష్టం చేస్తూ అందుకోసం కేంద్ర బలగాలను పంపాలని కోరారు. తనపై వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలు దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, కులం పేరుతో తనను నిందిస్తున్నారని చెబుతూ తనకు కూడా ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు కూడా భద్రత కల్పించాలని, హైదరాబాద్ నుండి పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు.

ఎన్నికలకు ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తమ ప్రాంతాలలో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందితే సంబంధిత మంత్రులు నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయాలని, సంబంధిత ఎమ్యెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెదిరించారని గుర్తు చేశారు. దానితో మంత్రులు, ఎమ్యెల్యేలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

పలు చోట్ల అభ్యర్థులను దౌర్జన్యంగా నామినేషన్లు వేయనీయలేదని, వేసిన వారిని బలవంతంగా ఉపసంహరించుకునేటట్లు చేసారిని రమేష్ కుమార్ ఆ లేఖలో వివరించారు. గత పర్యాయం జరిగిన ఎన్నికలలో .001 శాతం ఎంపీటీసీ లలో మాత్రమే ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఇప్పుడు 24 శాతం వరకు జరిగాయని పేర్కొన్నారు.

వసంతకాలానికి గూగుల్ డూడుల్ స్వాగతం

రేపు మార్చి 20, 2020 శుక్రవారం ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గూగుల్ ఈ రోజు (గురువారం) తన ప్రముఖ డూడుల్‌ తో వసంతకాలానికి స్వాగతం పలికింది. మనోహరమైన పారాచూట్ మరియు స్పష్టమైన నీలి ఆకాశాన్ని కలిగి ఉన్న డూడుల్ స్ప్రింగ్ యొక్క చక్కని ఇమేజ్ తో కొత్త కాలాన్ని ఆహ్వానించింది. అయితే వసంతకాలం గురువారం (మార్చి 19) సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది, కానీ మర్చి 20 నుంచి లెక్కిస్తారు.

సంవత్సరంలో నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వసంతకాలం ఒకటి. శీతాకాలం తరువాత మరియు వేసవికి ముందు వచ్చే ఈ వసంతకాలాన్ని చాలా మంది ప్రజలు వేసవి కాలం మధ్య కాలం అని పిలుస్తారు. ఉత్తర అర్ధగోళంలో మార్చి 20 న మరియు దక్షిణ అర్ధగోళంలో సెప్టెంబర్ 22న వసంతకాలం ప్రారంభమౌతుంది.

సాధారణంగా ఉత్తర అర్ధగోళంలో వసంతంకాలం మార్చి 21 నుండి జూన్ 21 వరకు ఉంటుంది, దక్షిణ అర్ధగోళంలో ఇది సెప్టెంబర్ 21 నుండి డిసెంబర్ 21 వరకు ఉంటుంది. వాతావరణ మార్పులను బట్టి సంవత్సరంలో ఈ తేదీలు కొద్దిగా మారవచ్చు. వసంతకాలం ప్రారంభం రోజున పగలు, రాత్రి సమంగా ఉంటాయి. భూమధ్యరేఖ సూర్యునికి దగ్గరగా లేదా దూరంగా రావడం వల్ల ఉత్తర అర్ధగోళంలో జూన్ 21న, దక్షిణ అర్ధగోళంలో, డిసెంబర్ 21న ఈ వసంతకాలం రెండు సార్లు ముగుస్తోంది.

వసంతకాలంలో ఇగిరిన సంతోషాలు మళ్ళీ చిగురించేలా చెట్లు వికసిస్తాయి, కొంగొత్త ఆలోచనలతో జంతువులు మేల్కొంటాయి మరియు భూమి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ.. ఎండా కాలానికి తీసుకెళ్తాయి.

Pragya Jaiswal Hot Photos

చూపు కోల్పోతున్న నితిన్

అ ఆ చిత్రం తరవాత వరుసగా లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో అపజయాలు ఎదుర్కొన్న యువ కథానాయకుడు నితిన్.`భీష్మ` సినిమా తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాడు.ఇపుడు నితిన్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి హిందీ రీమేక్ సినిమా. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించగా సూపర్ హిట్ అయిన `అంధాదున్` సినిమా ఇపుడు తెలుగులో రాబోతుంది. దాని రీమేక్ హక్కులను నితిన్ దక్కించుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల లాంఛనంగా సినిమా కూడా ప్రారంభం అయింది.ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను పట్టాలు ఎక్కించడానికి నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో రాధికా అప్టే పాత్రకు గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ను సంప్రదించారట. అయితే ఆ పాత్రలో నటించడానికి ప్రియాంక అరుల్ మోహన్ నో చెప్పేసిందని తెలుస్తోంది .అలాగే హిందీలో టబు చేసిన పాత్రలో నటింపచేయడానికి టబునే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో నితిన్ అంధుడిగా ఒక ఛాలెంజ్ తో కూడిన పాత్రలో నటించ బోతున్నాడు. నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
Waiting for betterment

Sapna Pabbi Hot Photos

Sunny Leone Latest Photos