Homeఆంధ్రప్రదేశ్‌రమేష్ కుమార్ లేఖతో జగన్ ప్రభుత్వం ఖంగారు!

రమేష్ కుమార్ లేఖతో జగన్ ప్రభుత్వం ఖంగారు!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పక్షం పెద్ద ఎత్తున హింసాయుత చర్యలకు దిగడాన్ని ప్రస్దావిసిట్ తనకు రక్షణ లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారంటూ వచ్చిన వార్త ఏకధానాలు జగన్ ప్రభుత్వాన్ని ఖంగారులో పడవేస్తున్నాయి.

హడావుడిగా ఒక వంక ముఖ్యమంత్రి, మరో వంక గవర్నర్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశాలు జరపడం గమనిస్తే శాంతిభద్రతల అంశంపై కేంద్రం ఎక్కడ జోక్యం చేసుకొంటుందో అన్న ఆందోళలన ప్రభుత్వ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.

పైగా ఆ లేఖ గురించి రమేష్ కుమారు మౌనంగా ఉండడంతో తొలుత ఆయన వ్రాసిన లేఖ కాదని, టిడిపి వారు సృష్టించిన లేఖ అంటూ ప్రచారం చేశారు. కానీ పరిస్థితుల తీవ్రతను గమనించిన ప్రభుత్వ పెద్దలు ఆ లేక తీవ్రతను అర్ధం చేసుకోవడం ప్రారంభించారు. ఈ లేఖను రమేష్ కుమార్ ఇప్పటివరకు బాహాటంగా ఖండించకపోవడంతోనే అర్ధమవుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

నిజానిజాలను తేల్చాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల కమిషనర్‌ లేఖ అంశం రాజకీయ దుమారం సృష్టించడం, తెలుగుదేశం పార్టీ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నట్లు సమాచారం.

రమేష్‌కుమార్‌ రాసినట్టుగా చెబుతున్న లేఖ ఎక్కడినుండి వచ్చింది? ఎవరు రాశారు? ఎవరు సోషల్‌ మీడియాలో పెట్టారు? తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని పోలీసు ఉన్నతధారులను సిఎం గురువారం ఉదయం కోరినట్లు తెలిసింది.

మరోవైపు ఇదే అంశంపై వైసిపి చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, జోగి రమేష్‌, కె.అనిల్‌, సుధాకర్‌బాబు తదితరులు డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. లేఖ ఎవరు రాశారు ? లేఖ ఎవరు రాశారు? ఎవరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు తదితర అంశాలతో పాటు, ఈ వ్యవహారంలో కొందరు జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని, విచారణలో తేలితే వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవంక, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ‘సంపూర్ణ సమాచారాన్ని’ కేంద్రం ముందు పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేశారు. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌లను రాజ్‌ భవన్‌కు పిలిపించి గంటకు పైగా చర్చలు జరిపారు.

ముఖ్యంగా ఎస్‌ఈసీ తన లేఖలో ప్రస్తావించిన ఘటనలు, వాటితో ముడిపడిన అంశాలపై పూర్తిగా ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఇప్పటి వరకూ స్థానిక ఎన్నికల్లో జరిగిన హింస, నమోదైన కేసులు తదితర అంశాలపై గవర్నర్‌ ఆరా తీశారు. కరోనా వైరస్‌ విజృంభన తీవ్రంగా ఉన్నప్పటికీ, స్థానిక ఎన్నికలను యథాతధంగా నిర్వహించాలంటూ ఎస్‌ఈసీకి ఎందుకు లేఖ రాశారని సీఎస్‌ నీలం సాహ్నిని గవర్నర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

ఆ లేఖతో సంబంధం లేకుండా ఏపీలో షిఫ్టుకు నలుగురు చొప్పున సాయుధ గన్‌మెన్‌ను కేటాయించామని, తెలంగాణ డీజీపీతో మాట్లాడి హైదరాబాద్‌లోని రమేశ్‌ కుమార్‌ నివాసం వద్ద ఏపీ పోలీసులతోపాటు తెలంగాణ పోలీసులను కూడా రక్షణగా నియమించామని డిజిపి గవర్నర్ కు వివరించారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈసీ కార్యాలయానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించామని చెప్పారు.

ఎన్నికల కమిషనర్‌కు భద్రత పెంచడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదటి నుండి నిర్వహించాలని గవర్నర్‌కు పలు పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిడిపి, కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ, ఫార్వర్‌బ్లాక్‌ పార్టీ నేతలు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular