కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఆపత్కర సమయంలో నివారణ మందులు లేక అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి భయానక స్థితిలో నాపైన టెస్ట్ చేసి మందు కనిపెట్టండి.. ప్రపంచ ప్రజలు బాగుండాలి, వారి సంక్షేమం కోసం అవసరమైతే నా ప్రాణాలు పోయినా ఫర్లేదు.అంటూ జెన్నిఫర్ అనే ఓ 43 ఏళ్ళ మహిళ ముందుకొచ్చింది. ఈమె ఇప్పుడు కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖ గా మారింది .
అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా సంస్థల శాస్త్రవేత్తలు ఎంఆర్ఎన్ఏఎన్ 1273 పేరుతో ఓ వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. ఆ క్రమం లో ఈ వ్యాక్సిన్ను నేరుగా మనుషులపై పరీక్షించాలని నిర్ణయించారు. అలాంటి తరుణంలో అమెరికాకు చెందిన 43 ఏళ్ళ జెన్నిఫర్ హాలెర్ స్వచ్ఛందం గా ముందుకొచ్చి కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి వేగు చుక్క అయ్యారు.
ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న జెన్నిఫర్ తన శరీరాన్ని ప్రయోగాలకు వేదికగా నివేదించ నున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోకూడా కరోనా వైరస్ ప్రభావం వల్ల లక్షాలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. ఆ సమయం లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగంపై నోటిఫికేషన్ వచ్చింది. దీంతో జెన్నిఫర్ దరఖాస్తు చేసుకుని స్వచ్ఛందంగా ఆ ప్రయోగానికి సిద్దమై వెళ్లింది. కాగా.. ఈ కరోనా విరుగుడు టీకాను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మోడెర్నా సంస్థలు తయారుచేశాయి. దీని సాంకేతిక నామం ఎంఆర్ఎన్ఏఎన్ 1273. నిజానికి ఇప్పటి వరకు మనుషుల పై ప్రయోగించని ఈ ఔషధాన్ని తీసుకునేందుకు బోల్డంత ధైర్యం కావాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్లాక అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ పరీక్షలు విజయవంతమైతే ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ మహమ్మారికి విరుగుడు దొరికినట్టే.
.ఈ టీకా విజయవంతమైనా.. అవ్వకపోయినా ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం జెన్నిఫర్ చేస్తున్న త్యాగానికి ఓ సార్ధకత ఏర్పడింది. అందుకే ఆమె ధైర్యానికి, తెగువకు యావత్ ప్రపంచం జై కొడుతూ.. జేజేలు పలుకుతోంది .
Sacrificing a self is dedication to whole nation