ఒక సినిమా ప్రేక్షకులకు చేరువ కావాలంటే దాని టైటిల్ కూడా పబ్లిక్ కి కనెక్ట్ కావాలి అప్పుడే ఆ సినిమాకి ఆడియన్స్ రీచ్ బాగా ఉంటుంది. `బాహుబలి ` చిత్రానికి మరియు ` కె జి ఎఫ్ ` వంటి చిత్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి వాటి టైటిల్స్ బాగా ఉపయోగ పడ్డాయి. అదలావుంటే ఇపుడు ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న కొత్త సినిమా గురించి జాతీయ స్థాయిలో భారీ అంచనా లున్నాయి. ఈ సినిమాను ముందు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవడం జరిగింది ఐతే ఉగాది కానుకగా ” రౌద్రం రణం రుధిరం ” అనేది ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ అని లోగో లాంచ్ చేశారు. అన్ని భాషల్లోనూ టైటిళ్లను రివీల్ చేశారు.
దీంతో ఇక ఈ సినిమాను సంక్షిప్త నామంతో పిలవాల్సిన అవసరం ఉండదని డి వి వి బ్యానర్ నిర్మాతలు అనుకున్నారు. కానీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడా ఎవ్వరూ ఈ సినిమాను అసలు పేరుతో పిలవట్లేదు. ఇప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ అనే అంటున్నారు ఈ చిత్రాన్ని.
రాజమౌళి రివీల్ చేసిన ఈ టైటిళ్లు జనాలకు ఎక్కలేదు. వివిధ భాషలకు ఒకే టైటిల్ కాకుండా మార్పులు చోటు చేసుకోవడం.. ఆ విషయంలో గందరగోళం ఉండటంతో నార్త్ ఇండియా జనాలకు వాళ్ల భాష హిందీలో కాకుండా ఇంగ్లిష్‌లో టైటిల్ పెట్టడంతో ఆ పేర్లు వాళ్లకు కనెక్ట్ కావడం లేదు. సోషల్ మీడియా వాళ్లు కూడా ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ నే కొనసాగిస్తూ ఈ సినిమా ముచ్చట్లు చెబుతున్నారు తప్ప ఎవ్వరూ పూర్తి పేరుని ఉపయోగించడం లేదు. ఇలా జరుగుతుందని రాజమౌళికి కూడా తెలుసు ….కేవలం ఆర్ ఆర్ ఆర్ టైటిల్ తో ఈ మల్టీ స్టారర్ చిత్రం ప్రేక్షకుల ముందుకి వెళ్లాలని ఆయన కోరిక ..అది నెరవేరిందని సినీ రంగపు మేధావులు అంటున్నారు. keep !