Home Blog Page 8562

మెగా ఫ్యామిలీ ది గ్రేట్ అంటున్న తెలుగు ప్రజలు

ఒకప్పుడు సామాజిక విపత్తులు వచ్చి సంక్షోభం ఏర్పడి నపుడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ముందుండి అందర్నీ నడిపించే వారు. కానీ ఆయన చనిపోయాక ఇండస్ట్రీ జనాలను ముందుకు నడిపేది ఎవరన్న ప్రశ్నకు ఇపుడు సమాధానం దొరికింది .

దేశ మంతా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తెలుగు సినిమా రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరిలో కదలిక తేవడం జరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీ జనాలకు చిన్న చిన్నసహాయాలు చేస్తూ..ఉన్నాడు. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఫంక్షన్ లకు హాజరవుతూ , చిన్న వారిని దీవిస్తూ వచ్చాడు. నెమ్మదిగా టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారిపోయాడు.

ఇప్పుడు కరోనా వైరస్ ప్రజానీకం చేస్తున్న పోరులో సినీ పరిశ్రమను భాగస్వామిని చేసి ముందుకు నడిపిస్తున్నది కూడా చిరంజీవే కావడం విశేషం. చిరంజీవి చేస్తున్న ఈ మహత్ కార్యానికి మిగతా మెగా హీరోలు కూడా గొప్పగా తోడ్పాటు అందిస్తున్నారు.

కరోనా భాదితుల సహాయార్ధం అందరికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ రూ.2 కోట్ల భారీ విరాళంతో కదలిక తెస్తే..దానికి చిరంజీవి స్పందిస్తూ సినీ కార్మికుల కోసం 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.
వెంటనే రామ్ చరణ్ తన వంతుగా ప్రభుత్వానికి రూ.70 లక్షలు , సినీ కార్మికుల కోసం ఇంకో రూ.30 లక్షల విరాళం ప్రకటించాడు. అలాగే అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. వరుణ్ తేజ్ రూ.20 లక్షలిస్తే.. సాయిధరమ్ తేజ్ రెండు విడతలుగా రూ.10 పదేసి లక్షల చొప్పున 20 లక్షలు విరాళం ఇచ్చాడు.ఆ లెక్కన కేవలం మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 5 కోట్ల 65 లక్షలు విరాళాలు పోగయ్యాయి.

కేవలం తాము విరాళాలు ఇవ్వడమే కాదు.. మిగతా వాళ్లను కూడా ఆ దిశగా నడిపించడంలో కూడా మెగా ఫామిలీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది . a stich in time saves nine

మందుబాబులూ.. ఈ లక్షణాలు ఉన్నాయా? డాక్టరుని కలవండి


కారోన భయంతో 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణలో మద్యం దుకాణాలు అన్నీ మూసివేయబడ్డాయి. దింతో మందుబాబులు తెగ ఇబ్బందిపడిపోతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వాళ్లతో నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మల్కాజిగిరి జిల్లా హాస్పిటల్‌లో 2రోజుల వ్యవధిలో సుమారు 15 కేసులు నమోదయ్యాయి. మతిస్థిమితం కోల్పోవడంతోనే మందుబాబులు ఆస్పత్రల్లో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రికి సుమారు 15మంది రోగులు చికిస్త కోసం వచ్చారు. మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోతున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో చాలా మంది మందుబాబులు విచిత్ర ప్రవర్తన చేస్తున్నారని డాక్టర్లు తెలుపుతున్నారు.

నిత్యం మద్యం అలవాటున్న ఉన్న వ్యక్తులకు ఒక్కసారిగా దొరక్కపోవడం వల్ల అసాధారణంగా ప్రవర్తిస్తారు. కొందరికి శరీరంలో విపరీతమైన వొణుకు వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ముదిరి రోగి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తారన్నారు. ఆత్మహత్య చేసుకోవడం, ఇతరులను గాయపర్చడం, వారికి వారే గాయపర్చుకోవడం లాంటివి చేస్తారని డాక్టర్లు తెలిపారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది

అక్రమంగా మద్యం తరలిస్తున్న సీఐ

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా తరలిస్తున్న ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రెడ్డి త్రినాథ్ అక్రమంగా మద్యాన్ని కారులో తరలిస్తున్నాడు. కుతుకులూరు లో స్థానికులు త్రినాధ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కి సమాచారం అందించారు. ఎక్కడికి చేరుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చేపట్టారు

ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఎందుకన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినాద్ ను సస్పెండ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అదేవిధంగా మద్యం అక్రమంగా తరలిస్తున్నందుకు రూ. 5 లక్షలు జరిమానా విదించారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నారు. త్రినాథ్ వారి వల్ల పోలీసులు ప్రదర్శిస్తున్న స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది.

సినీ కార్మికులకు బహుబలి విరాళం ఎంతంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాతృతంతో నిజంగా ‘బాహుబలి’ అనిపించుకున్నాడు. ఇప్పటికే కరోనా నివారణలో భాగంగా ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షల చొప్పున కోటి రూపాయాలను ప్రకటించారు. అదేవిధంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా సీనీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ సంస్థకు రూ.50లక్షల విరాళాన్ని ప్రభాస్ ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఒక్కేడే రూ.4.5కోట్ల విరాళం ప్రకటించినట్లయింది.

కరోనా ఎఫెక్ట్ తో చిత్రపరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) మనకోసం’ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉన్నారు.

సీసీసీకి మొదటగా చిరంజీవి ఒక కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. అదేవిధంగా కింగ్ నాగార్జున కోటి రూపాయాలు, రాంచరణ్ 30లక్షలు, మహేష్ బాబు 25లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 25లక్షలు, రవితేజ 20లక్షలు, సాయిధరమ్ తేజ్ 10లక్షలు తదితరులు విరాళాలను ప్రకటించారు. తాజాగా ప్రభాస్ ‘సీసీసీ మనకోసం’కు రూ.50లక్షలు ప్రకటించి సినీ కార్మికులను ఆదుకోవడంలో తాను ముందే ఉంటానని ప్రకటించాడు. ఇప్పటివరకు ప్రభాస్ మొత్తంగా రూ.4.5కోట్ల విరాళం ప్రకటించడం విశేషం. దీంతో ప్రభాస్ నిజంగా ‘డార్లింగ్’ అంటూ అభినందిస్తున్నారు.

అభిమానులకు ‘ఆచార్య’ సర్ ప్రైజ్ ఆరోజే?

మెగాస్టార్ 152వ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెల్సిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆచార్య’ మూవీకి సంబంధించి ఫస్టు తేది ఖరారైందని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 2 శ్రీరామ నవమిని పురస్కరించుకొని ‘ఆచార్య’ ఫస్టు లుక్ ను చిత్రబృందం విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఆచార్య’ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని రాంచరణ్ కొడిదెల ప్రొడక్షన్లో బ్యానర్లో, మ్యాట్నీ ఎంటటైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

తొలుత ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్ ను ఉగాది రోజున రిలీజ్ చేయాలని భావించారని తెలుస్తోంది. అయితే చిరంజీవి అదేరోజు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడం.. అదేరోజు ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ విడుదల ఉండటంతో విరమించుకున్నారట. తాజాగా శ్రీరామనవమికి ఫస్టు లుక్ విడుదల చేయాలని చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు సమాచారం.

రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ, టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడగా.. ఫస్టు లుక్ విడుదల పండుగకు అభిమానుల్లో జోష్ నింపే యత్నం చేస్తుంది చిత్రబృందం. అయితే దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

అక్షయ్ కుమార్ ఒక అడుగు ముందే ఉంటాడు

అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి షహాయ నిధి ” పీఎం కేర్స్ ఫండ్ ” కి పాతిక కోట్లు ఇవ్వడం దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది. ఇంకా చెప్పాలంటే టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యింది.

బాలీవుడ్ నుంచి విరాళాల విషయంలో ఎవరు స్పందించడం లేదు అనుకొంటున్న సమయం లో అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో పాతిక కోట్లు ఇచ్చి మిగతా స్టార్లను ఇరకాటంలో పెట్టేశాడు.

నిజానికి అక్షయ్ కుమార్ ఇలా సొసైటీ కోసం ముందుకు రావడం ఇది మొదట సారి కాదు. గతం లో కూడా ఇలాగే భారీగా విరాళాలు అందించాడు. రెండేళ్ల కిందట పుల్వామా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన సైనిక కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం అందించి అందరికి ఆదర్శం అయ్యాడు. అలాగే అస్సాం వరద బాధితుల కోసం రూ.2 కోట్లిచ్చాడు. దక్షిణాదిన చెన్నైలో వరదలొస్తే కోటి రూపాయలిచ్చాడు. ఇక సీఆర్పీఎఫ్ కుటుంబాలకు రూ.1.08 కోట్లు.. శానిటైజేషన్ మీద అవగాహన నిధికి రూ.1.5 కోట్లు.. ఇలా అక్షయ్ కుమార్ ఎన్నోసార్లు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అంతేకాదు మన దేశం లోని సైనిక కుటుంబాల కోసం ‘భారత్ కే వీర్’ ఫౌండేషన్ స్థాపించాడు. ఇలా చెప్పుకొంటూ పొతే అక్షయ్ కుమార్ దాతృత్వానికి అంటే ఉండదు. there is no count for oxyzen

వచ్చే ఏడాదిలోనే టోక్యో ఒలింపిక్స్

కరోనా వైరస్ దెబ్బతో వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఇక ఈ సంవత్సరం జరిగే అవకాశం లేదు. వచ్చే ఏడాది జులై 23వ తేదీన మొదలుపెట్టి ఆగస్టు 8వ తేదీన ముగించాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), జపాన్ నిర్వాహకులు భావిస్తున్నట్టు జపాన్ మీడియా చెబుతోంది.

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో జపాన్‌లో వేసవి కాలం. అయితే, కరోనా ప్రభావంతో వీటిని ఏడాది పాటు వాయిదా వేశారు. వచ్చే ఏడాది వేసవిలోనే పోటీలు నిర్వహించాలని ఐఓసీ ప్లాన్ చేస్తోంది. పాత షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందే పోటీలు ఆరంభిస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు సమచారం.

ఈ మెగా ఈవెంట్ ఆలస్యం కావడంతో 12 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన జపాన్‌కు భారీనష్టం వస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రి యసుతోషి నిషిముర అంటున్నారు. దీన్ని ఎంతో కొంత భర్తీ చేయాలంటే వచ్చే ఏడాది వేసవిలో పోటీలు నిర్వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

దాంతో, 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్‌ నిర్వహించాలని ఐఓసీ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

కలెక్టర్ల అధీనంలోకి ప్రైవేటు ఆసుపత్రులు

రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది…అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్ప టికే గుర్తించిన ప్రభుత్వం… కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23కు చేరింది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారు 29,672 మంది, వీరిలో హోమ్ ఐసోలేషన్ లో 29,496 మంది ఉన్నారు. హాస్పిటల్ ఐసోలేషన్ 178 మంది ఉన్నారు.

Pia Bajpiee Latest Photos

లాక్‌ డౌన్‌ పొడిగింపుపై కేంద్రం క్లారిటీ!

లాక్‌ డౌన్‌ పొడిగింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌ డౌన్‌ పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా తీవ్రంగా ఖండించారు. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు కేవలం వందంతులని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మొద్దని రాజీవ్‌ గౌబా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.

కరోనా వైరస్‌ దేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గత మంగళవారం 21రోజుల లాక్‌ డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి దేశవ్యాప్తంగా జనసంచారంపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా కొత్తగా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో లాక్‌ డౌన్‌ ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని వదంతులు వ్యాప్తించాయి. తాజాగా వీటిని కేంద్రం కొట్టివేసింది.

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1071చేరింది. 900 మందిలో ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 96 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 29 మంది మృతి చెందారు.

దేవిశ్రీ ప్రసాద్ కి ఊహించని అవకాశం

ఒకప్పుడు తెలుగులో తిరుగులేని సంగీత దర్శకుడి గా పేరు తెచ్చుకొన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మ‌ధ్య కాలంలో త‌న స్థాయికి త‌గ‌ని సంగీతం తో ప్రేక్షకుల్నినిరాశ ప‌రుస్తున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ కెరీర్లో ఎన్న‌డూ లేనంత సంక్షోభం ఇప్పుడు చవి చూస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ సాధించి కొంత ఊరట నిచ్చింది. కానీ దానికి పోటీగా వచ్చిన ఆల వైకుంఠపురం లో చిత్రం యొక్క సంగీతం ముందు చిన్న బోయింది.

నిజానికి దేవిశ్రీ ప్రసాద్ కి ఇంత‌కుముందులా పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గుతున్న మాట కాదనలేం ఇలాంటి స‌మ‌యంలో ఓ బాలీవుడ్ చిత్రానికి ప‌ని చేసే అవ‌కాశం దేవిశ్రీ ప్రసాద్ ని వెతుక్కుంటూ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. యాక్టర్ కం డైరెక్టర్ ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న” రాధే” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ కొన్ని పాట‌లు అందించ్చ బోతున్నాడు.

నిజానికి ఈ సినిమా కి హిమేష్ రేష్మియా, సాజిద్‌-వాజిద్‌లు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నార‌ట‌. అయినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ తెలిసిన సల్మాన్ ఖాన్ ఇతనికి కూడా కొన్ని పాటలు ఇవ్వమని చెప్పాడట ..గతంలో 100 % లవ్ సినిమాలోని తన రింగ రింగ పాట‌ను స‌ల్మాన్ ఖాన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ రీమిక్స్ చేసి మెప్పించడం ఇప్పుడు కలిసొచ్చింది. కాగా ” రాధే ” చిత్రానికి దర్శకత్వం వహిసున్న ప్ర‌భుదేవా తెలుగులో డైరెక్ట్ చేసిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణ‌మి` వంటి సినిమాల‌కు కలిసి పనిచేసిన అనుభవం ఉంది.అదికూడా దేవిశ్రీ కి ఉపయోగ పడింది.

ఇక పొతే రాబోయే “ఉప్పెన” చిత్రం లోని ” నీ కన్ను నీలి సముద్రం ,” దక్ ధక్ ” వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. వాటితో పాటు ` రంగ్ దె ` లాంటి ల‌వ్ స్టోరీ.. సుకుమార్-బ‌న్నీ కాంబినేష‌న్లో రాబోయే ప్రెస్టీజ్ మూవీ తో దేవిశ్రీ ప్రసాద్ మ‌ళ్లీ స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. a stich in time

కరోనా ఎఫెక్ట్: పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా

కరోనా ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 31నుంచి 6తేదివరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వీటిని వాయిదా వేస్తున్న తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి పదోతరగతి పరీక్ష వాయిదా పడటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఫ్రీగా తెలంగాణ : కేసీఆర్

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 70పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇందులో 11మందికి టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించారు. వీరిని మరోసారి టెస్ట్ చేసి డిశార్చ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిలో 7తేదిలోగా తెలంగాణ కరోనా ఫ్రీగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో రేపటి నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలు కేవలం రెండే జరిగాయి. కేవలం లాంగ్వేజ్ కి సంబంధించిన పరీక్షలను విద్యాశాఖ నిర్వహించారు. ఇంకా మేయిన్ పరీక్షలైన గణితం, సైన్స్, సాంఘీక వంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని.. ప్రస్తుత సెలవులను ప్రిపరేషన్స్ కు వినియోగించుకోవాలని సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి కొత్త తేదిని ప్రకటించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

కరోనా కట్టడికి ఫేస్ బుక్ వ్యవస్థాకుడి భారీ విరాళం

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. ప్రపంచంలోని 200దేశాలకు కరోనా పాకింది. కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి. కరోనా నివారణ చేసే పరిశోధనలకు విరాళం అందించేందుకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ దంపతులు ముందుకొచ్చారు.

కరోనా వైరస్ నివారణ కోసం చేసే పరిశోధనలకు 25మిలియన్ డాలర్లు(రూ. 187కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్గ్‌ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్‌ ప్రకటించారు. ఈమేరకు బిల్ అండ్ మిళింద గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తామని వారు ప్రకటించారు. 125మిలియన్ డాలర్లతో ఇప్పటికే మిళింద ఫౌండేషన్ కరోనా నివారణకు కార్యాచరణ చేపట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ 7లక్షలు దాటేసింది. 33వేలకు పైగా మృత్యువాత పడ్డారు. అమెరికాలో లక్షకు పైగా కేసులతో తొలిస్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం కరోనా దెబ్బకు విలవిలాడుతోంది. ఆ తర్వాత ఇటలీ, చైనా, స్పెయిన్‌, జెర్మనీ, ఇరాన్‌ దేశాల్లో అత్యధికం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక భారత్ లోనూ వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళన నెలకొంది. అయితే కరోనాపై పోరుకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బెర్గ్ దంపతులు ముందుకురావడంపై ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ కు సమస్యగా మారిన వలసదారుల వసతి

పట్టణ ప్రాంతాలలోని వలసదారుల దుస్థితి గురించి ఆలోచించకుండా అర్ధాంతరంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ప్రకటించడంతో, వారి సమస్యతో ఏపీలో జగన్ ప్రభుత్వం సతమతమవుతున్నది. ఆరు రోజుల వరకు వీరి గురించి పట్టించుకోనని కేంద్రం అకస్మాత్తుగా లక్షలాది మంది వలస ప్రజలు గ్రామాలకు తరలి వెళ్లడం గమనించి ఖంగారు పడింది.

వారంతా గ్రామాలకు చేసి, కరోనా వైరస్ ను అక్కడకు చేరిస్తే, దానిని కట్టడి చేయడం దాదాపు అసంభవమని భయపడింది. దానితో జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేసి, వలస ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండమని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పైగా, వారికి వసతి శిబిరాలు ఏర్పాటు చేసి, భోజన ఏర్పాటు కూడా చేయమని సూచించింది.

అందుకోసం ఒక రూపాయి నిధిని కూడా అందించకుండా, జాతీయ విపత్తు స్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్‌) నిధులను వాడుకోమని సలహా ఇచ్చింది. అయితే ఈ నిధుల వాడకంకు సంబంధించి ప్రస్తుతం 25 శాతంకు మించి ఖర్చు చేయరాదని గతంలో కేంద్రం రూపొందించిన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. 2015లో రూపొందించిన నిబంధనల ప్రకారం పెద్దవారికి రూ 60, పిల్లలక్లు రూ 45 చొప్పున మాత్రమే రోజుకు ఖర్చు చేయవలసి ఉంటుంది.

ఈ మొత్తాన్ని భోజనం, వసతి, నీరు …. వంటి అన్ని ఖర్చులకు ఉపయోగించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుత ధరలకు వీటిని ఏ విధంగా సరిపెట్టాలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ప్రశ్నార్ధకరంగా మారింది. ఐదు సంవత్సరాల క్రితం ధరలతో ఇప్పుడు తాత్కాలిక వసతి కల్పించమనడంపై అధికారుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ, దాతల భవనాలు అదుబాటులో లేని చోట్ల తాత్కాలిక షెల్టర్ల నిర్వహణకు అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రస్తావన 2015లో ఇచ్చిన జీవోలో లేదు. ఆ జీవోలో ప్రధానంగా కరువు, తుపాన్లు, వరదలు, భూకంపాలు, శీతల గాలులు, పెస్ట్‌ అటాక్‌ వంటి వాటినుద్దేశించి చెప్పారు. కరోనా అందుకు పూర్తి భిన్నం. ఆ జీవోలోనే దుస్తులకు ప్రతి కుటుంబానికి రూ.1,800 ఇవ్వాలని ఉంది. ఇప్పుడు అమలు చేస్తారో లేదో తెలీదు.

14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2019-20కి గాను కేంద్రం రాష్ట్రానికి తన వాటా (90 శాతం) కింద రూ.420 కోట్లు కేటాయించింది. దానికి రాష్ట్రం తన వాటా రూ.42 కోట్లు (పది శాతం) కలిపి ఖర్చు చేయాలి. కరువు, వరదల వంటి వరుస విపత్తుల వలన కొన్నేళ్లుగా ప్రతి ఏడాదీ రాష్ట్రం అడ్వాన్స్‌లు తీసుకుంటోంది.

15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2020-21లో రాష్ట్రానికి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ కింద రూ.510 కోట్లు కేంద్రం ఇవ్వాలి. ఎప్పుడిస్తుందో తెలీదు. ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ రూపంలో మూడు మాసాలకే ఆమోదమైంది.

అసలకే తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం కు లాక్ డౌన్ కారణంగా సాధారణంగా వచ్చే ఆదాయంకు సహితం గండి పడే అవకాశం ఉండడంతో వలస ప్రజలను ఆదుకోవడం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండే. పైగా, హైదరాబాద్ లో ఉంటున్న వారిని చెప్పా పెట్ట కుండా హైదరాబాద్ పోలీసులు ఏపీ సరిహద్దులకు పంపి వేయడంతో, వారందరి వసతి, భోజనం కూడా చూడవలసిన అవసరం ఏర్పడింది.

సల్మాన్ ఖాన్ ది గ్రేట్

కరోనా వైరస్ ప్రజల్లో ఐకమత్యం తో పాటు మానవత్వాన్ని కూడా బాగా పెంచింది. అందరూ  సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సినిమావాళ్లు కూడా తమ దాతృత్వ గుణాన్ని చాటు కొంటున్నారు. మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రధాని షహాయ నిధికి అందించి అందర్నీ విస్మయానికి గురి చేసాడు. ఇపుడు తాజాగా మరో హీరో సినీ కార్మికులను భారీ సంఖ్యలో ఆదుకోవడానికి ముందుకొచ్చాడు .

భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఒక ఎన్జీవో ద్వారా పేదలకు వైద్య, విద్యా సహాయం చేస్తుంటాడు. ఇపుడు తాజాగా కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో సినీ కార్మికులకు తన వంతు సహకారం అందివ్వడానికి ముందుకొచ్చాడు. కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ లోని అన్ని శాఖలు మూతబడ్డాయి. భారత దేశం లో అతి పెద్దదైన హిందీ ఇండస్ట్రీ తాత్కాలికంగా ఆగిపోవడంతో వేల మంది కార్మికులకు ఉపాది కరువైంది. రోజువారీ వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన సల్మాన్ ఖాన్ సుమారు పాతిక వేల మంది కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వారందరకీ రోజువారీ నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం అందివ్వాలని సల్మాన్ ఖాన్ నిశ్చయించు కొన్నాడు.

సల్మాన్ ఖాన్ చేస్తున్న ఈ సహాయం కష్టాల్లో బాలీవుడ్ సినీ కార్మికులకు పెద్ద ఉపశమనం కాబోతుంది.

రాష్ట్రం బాగుండాలనుకుంటే.. ఇంట్లోనే ఉండండి

దేశమంతా కరోనా ప్రకంపనలు మిన్నంటిన వేళ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. వ్యాధిని నిరోధించడానికి ప్రభుత్వం సూచించే అదే శాలు పాటించి అధికారులకు సహకరించాలని ఆయన పిలుపుని చ్చారు. కరోనా – నివారణ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర భవిష్యత్తు ప్రజలపై ఆధారపడి ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు అమెరికా, ఇటలీ దేశాలు దెబ్బతిన్నాయన్నారు. మన రాష్ట్రానికి అలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రజలు పగడ్బందీగా లాక్‌ డౌన్‌ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, సర్పంచులు, తాజా మాజీ కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేయాలని పేర్కొన్నారు. పోలీసులు విచ్చలవిడిగా సంచరిస్తున్న పౌరులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.

ఇప్పటి వరకు జిల్లాలోని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిపై చిలుకు లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ మందును కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు పంపి ట్రాక్టర్ల సహాయంతో స్ప్రే చేస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని, ఉదయం మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలని మంత్రి తెలిపారు.

కేసీఆర్ కరోనా శాపం.. ఫలిస్తుందా?

కరోనా మహమ్మరి విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆగమాగం చేస్తున్న వాళ్లకు కరోనా సోకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాపం పెట్టారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఆయన రోటిన్ కు భిన్నంగా వారికి కరోనా శాపించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పలువురు చేస్తున్న వికృత ప్రచారం కేసీఆర్ కు కోపం తెప్పించడం వల్లనే ఆయన అలా అని ఉంటారని అర్థంమవుతోంది. వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.

కరోనాతో ప్రపంచం ఆగమాగం అవుతున్న సమయంలోనూ కొందరు చిల్లర ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను ఎవరూ పట్టుకోరనే భ్రమలో ఉన్నారని.. అలాంటి వాళ్లను ప్రభుత్వం పట్టుకుంటుందని స్పష్టం చేశారు. వీరికి వందరెట్ల కఠిన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేసే వాళ్లందరికీ కరోనా సోకుతుందన్నారు. ఆ దుర్మార్గులకు ఈ వైరస్ కచ్ఛితంగా సోకాలని శాపించారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు..

తెలంగాణలో ఆదివారం నాటికి 70కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఒకరు ఇప్పటికే ఒకరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మరో 11మందికి టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని పేర్కొందన్నారు. వీరికి మరోసారి టెస్టు నిర్వహించిన త్వరలోనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వం, వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.

ఏప్రిల్ 7వరకు తెలంగాణలో కరోనా కేసులు సున్నాకు చేరే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా వైరస్ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే కేసీఆర్ పెట్టిన శాపం ఈ డిజిటల్ యుగంలో ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..