ఒకప్పుడు తెలుగులో తిరుగులేని సంగీత దర్శకుడి గా పేరు తెచ్చుకొన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగని సంగీతం తో ప్రేక్షకుల్నినిరాశ పరుస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్లో ఎన్నడూ లేనంత సంక్షోభం ఇప్పుడు చవి చూస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభం లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ సాధించి కొంత ఊరట నిచ్చింది. కానీ దానికి పోటీగా వచ్చిన ఆల వైకుంఠపురం లో చిత్రం యొక్క సంగీతం ముందు చిన్న బోయింది.
నిజానికి దేవిశ్రీ ప్రసాద్ కి ఇంతకుముందులా పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న మాట కాదనలేం ఇలాంటి సమయంలో ఓ బాలీవుడ్ చిత్రానికి పని చేసే అవకాశం దేవిశ్రీ ప్రసాద్ ని వెతుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. యాక్టర్ కం డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న” రాధే” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ కొన్ని పాటలు అందించ్చ బోతున్నాడు.
నిజానికి ఈ సినిమా కి హిమేష్ రేష్మియా, సాజిద్-వాజిద్‌లు స్వరాలు సమకూరుస్తున్నారట. అయినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ తెలిసిన సల్మాన్ ఖాన్ ఇతనికి కూడా కొన్ని పాటలు ఇవ్వమని చెప్పాడట ..గతంలో 100 % లవ్ సినిమాలోని తన రింగ రింగ పాటను సల్మాన్ ఖాన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ రీమిక్స్ చేసి మెప్పించడం ఇప్పుడు కలిసొచ్చింది. కాగా ” రాధే ” చిత్రానికి దర్శకత్వం వహిసున్న ప్రభుదేవా తెలుగులో డైరెక్ట్ చేసిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి` వంటి సినిమాలకు కలిసి పనిచేసిన అనుభవం ఉంది.అదికూడా దేవిశ్రీ కి ఉపయోగ పడింది.
ఇక పొతే రాబోయే “ఉప్పెన” చిత్రం లోని ” నీ కన్ను నీలి సముద్రం ,” దక్ ధక్ ” వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. వాటితో పాటు ` రంగ్ దె ` లాంటి లవ్ స్టోరీ.. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో రాబోయే ప్రెస్టీజ్ మూవీ తో దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. a stich in time