కరోనా వైరస్ ప్రజల్లో ఐకమత్యం తో పాటు మానవత్వాన్ని కూడా బాగా పెంచింది. అందరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సినిమావాళ్లు కూడా తమ దాతృత్వ గుణాన్ని చాటు కొంటున్నారు. మొన్నటికి మొన్న అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రధాని షహాయ నిధికి అందించి అందర్నీ విస్మయానికి గురి చేసాడు. ఇపుడు తాజాగా మరో హీరో సినీ కార్మికులను భారీ సంఖ్యలో ఆదుకోవడానికి ముందుకొచ్చాడు .
భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఒక ఎన్జీవో ద్వారా పేదలకు వైద్య, విద్యా సహాయం చేస్తుంటాడు. ఇపుడు తాజాగా కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో సినీ కార్మికులకు తన వంతు సహకారం అందివ్వడానికి ముందుకొచ్చాడు. కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ లోని అన్ని శాఖలు మూతబడ్డాయి. భారత దేశం లో అతి పెద్దదైన హిందీ ఇండస్ట్రీ తాత్కాలికంగా ఆగిపోవడంతో వేల మంది కార్మికులకు ఉపాది కరువైంది. రోజువారీ వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన సల్మాన్ ఖాన్ సుమారు పాతిక వేల మంది కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వారందరకీ రోజువారీ నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం అందివ్వాలని సల్మాన్ ఖాన్ నిశ్చయించు కొన్నాడు.
సల్మాన్ ఖాన్ చేస్తున్న ఈ సహాయం కష్టాల్లో బాలీవుడ్ సినీ కార్మికులకు పెద్ద ఉపశమనం కాబోతుంది.