Home Blog Page 8551

కెజిఎఫ్ 2 క్లైమాక్స్ కేక పుట్టిస్తుందట..


గత కొన్నేళ్లలో సౌత్ నుంచి పాన్ ఇండియా చిత్రాల వరవడి బాగానే పెరిగింది. తెలుగులో బాహుబలి సిరీస్ సాధించి ఘన విజయం ఎందరికో స్ఫూర్తి గా నిలిచింది. అలాంటి దారిలో వచ్చిన సినిమాయే `కె .జి .ఎఫ్ . సుమారు 80 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. అంతేకాదు యాక్షన్ సన్నివేశాల రూపకల్పన లో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికింది.

అలా 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , హీరో యష్ తో కలిసి ప్రభంజనం సృష్టించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కెజిఎఫ్ భారీ విజయం అందుకుంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 రెడీ అవుతోంది . ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ పరిస్థితులన్నీ చక్కబడితే 2020 అక్టోబర్ 23న విడుదల కానుంది.కాగా కెజిఎఫ్ 2 క్లైమాక్స్ విషయంలో ఓ ప్రత్యేకత ఉందని తెలిసింది. .

కెజిఎఫ్ 2 మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా రోల్ చేస్తుండటం విశేషం. కాగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ దేశ ప్రధానిగా కీ రోల్ చేస్తోంది. కాగా కెజిఎఫ్ 2 లో రాఖి భాయ్ ( హీరో పాత్ర )నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా హీరో మరణానికి కూడా ఆ పాత్రే కారణం అవుతుందట. ప్రత్యర్థులను చంపివేసి `కెజిఎఫ్` ప్రాంతానికి కింగ్ గాఎదిగిన హీరో రాఖీని ప్రభుత్వ సైన్యం సహకారంతో రవీనా టాండన్ చంపించి వేస్తుందని తెలుస్తోంది. అలా తల్లి కిచ్చిన మాట ప్రకారం రాఖి భాయ్ `రాజు` హోదాలో ఆనందంగా చనిపోతాడని తెలుస్తోంది. అలా ` కె జి ఎఫ్ ౨` క్లైమాస్స్ లో రాఖీ భాయ్ ( హీరో యాష్ ) చనిపోతాడని రూఢీగా తెలుస్తోంది.

కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం!

కరోనా వైరస్ ప్రభలుతున్న వేళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే కరోనా పై వదంతులు వ్యాప్తి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇందుకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటోంది.

ఈ ప్రచారం నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. అంతేకాదు అసత్య ప్రచారాలు చేసిన వారికి కరోనా వస్తోందని శాపనార్థాలు పెట్టారు.

సిఎం కెసిఆర్ హెచ్చరించిన మరునాడే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయం కోరినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

తెలంగాణా రాష్ట్రంలోకి ఆర్మీ అడుగుపెట్టిందని అసత్య ప్రచారం చేశారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా రెడ్ జోన్‌ గా ప్రకటించలేదు.

మద్యం దుకాణాలను తెరుస్తారని కూడా జోరుగా ప్రచారం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సకల చర్యలు తీసుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కారణంగా ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పది కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎవరు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఈ ప్రచారం సాగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

దీంతో కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోమారు హెచ్చరించినట్లైంది.

పవన్ చిత్రంలో బంపరాఫర్ దక్కించుకున్న తెలుగమ్మాయి?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాల్లో తెలుగు అమ్మాయిలు కీలక పాత్రల్లో కనిపించ బోతున్నారు దిల్ రాజు నిర్మిస్తున్న ` వకీల్ సాబ్ ` చిత్రం లో లేడీ పాత్రలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముగ్గురు లేడీస్ చుట్టూ తిరిగే కథ ఇది . అలాంటి చిత్రంలో ఇద్దరు హీరోయిన్ స్థాయి పాత్రలకు అచ్చ తెలుగు అమ్మాయిలు అయిన అంజలి , అనన్య నాగళ్ళ లను ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకి సంబందించిన షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యింది. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండో చిత్రం లో కూడా మరో అచ్చ తెలుగు అమ్మాయికి ఛాన్స్ దక్కింది.

వెరైటీ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ కచితళ్యాణ్ ఓ భారీ పీరియడ్ డ్రామాలో నటిస్తున్నాడు ప్రముఖ నిర్మాత ఏ. ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం 150 కోట్ల భారీ బడ్జట్ తో రూపొందుతోంది. అలాంటి చిత్రం లో ఓ స్పెషల్ సాంగ్ కొరకు మన తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారట. ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయిందని తెలుస్తోంది. కాగా పూజిత పొన్నాడ గతంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన` కల్కి` సినిమాలో ఓ రోల్ చేయడమే గాక రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `రంగస్థలం` లో చిట్టి బాబు అన్నగా నటించిన ఆది పినిశెట్టి లవర్ పాత్ర కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన సాంగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఈ తెలుగింటి ముద్దుగుమ్మ కి ఇది బంగారం లాంటి అవకాశమే …

భారత్ లో 3వేలకు పెరిగిన కరోనా కేసులు


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. తాజాగా 10లక్షలకు పైగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యాయి. కొన్ని దేశాల్లో వైద్యం అందించేందుకు వైద్యులు సరిపోలేనంతగా కరోనా బాధితులు పెరిగింది. దీంతో చేసేదీమేక కొందరికీ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

కరోనా దాటికి అగ్రరాజ్యం విలవిలలాడిపోతుంది. 2లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. అందమైన ఇటలీ దేశం కరోనా దాటికి శవాలదిబ్బగా మారింది. ఇక స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో రాజకుటుంబీకులే కరోనా బారిన పడ్డారంటే సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కరోనా మహమ్మరితో ప్రపంచ దేశాలు కకావికలం అవుతోన్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో దేశంలో 21రోజులు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు గడిచిన రెండు మూడురోజులుగా ఎక్కువగా నమోదవుతుండటంతో ఆందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా భారత్ లో 3వేలకు పైగా కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం భారత్ 3,127 కరోనా కేసులు నమోదుయ్యాయి. 229మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 2,767 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 86మంది మృతిచెందారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడురోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 75కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కు చేరింది. 32మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 164కు చేరింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి.

హైదరాబాద్ లో కరోనా పిడుగు, కేసీఆర్ ఆదేశాల కోసం పోలీసులు


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ అదుపు తప్పుతున్నట్లు ఆరోగ్య అధికారులు, పొలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒకేరోజు కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదై, మొత్తం కేసులు 74కు చేరుకోవడంతో దిగ్బ్రాంతికి గురవుతున్నారు.

ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో ఈ వైరస్ ఉనికి ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజు నుండే నిజాముద్దీన్ లోని తాబ్లిఘి జామాతి ముంది తిరిగి వచ్చిన వారు పెద్ద ఎత్తున వైరస్ బారిన పదిన్నట్లు బైట పడుతూ ఉండడంతో గత నాలుగు రోజులలో మొత్తం పాజిటివ్ కేసులు రెండింతలు పైగా పెరిగాయి. మృతుల సంఖ్య 11 కు చేరుకొంది.

అయినా ఇప్పటికి చాలామంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షకు సహకరించడం లేదని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లేఖల కన్నా రెండింతల మంది ఢిల్లీ నుండి తిరిగి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తమకు స్వేచ్ఛ ఇస్తే వారందరిని జల్లెడ ఆడి పట్టుకొంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వెంటనే కఠిన చర్యలు తీసుకోనని పక్షంలో హైదరాబాద్ నగరాన్ని ఈ మహమ్మారి కాటేయడం తధ్యం అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి సన్నిహిత రాజకీయ మిత్రుడు కావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జనుకుతున్నట్లు కనిపిస్తున్నది.

ఈ విషయంలో కఠినంగా వ్యవహరింప వలసిందే అని ఆయన కుమారుడు, మునిసిపల్ పాలన శాఖ మంత్రి కెటి రామారావు కూడా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. లేని పక్షంలో దేశంలో చాల రాష్ట్రాలకన్నా ముందుగా, చివరకి ప్రధాన మంత్రి మోదీ కన్నా ముందుగా క్రియాశీలంగా వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి అంతా బూడిద కాగలదని ఆందోళన చెందుతున్నారు.

ఇంకా చాలామంది బైటకు రాకుండా గోప్యంగా ఉంటున్నారని, వారి గురించిన వివరాలు ఇవ్వడానికి వారి బంధువులు కూడా ఇష్ట పడటం లేదని, కరోనా చికిత్సకు వచ్చిన వారు సహితం వైద్య బృందాలపై అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలోని మొత్తం పాజిటివ్ కేసులలో మూడోవంతు హైదరాబాద్ నగరం నుండే ఉండటం, మృతులలో అత్యధికంగా నగరం నుండే కావడంతో తక్షణం తగు చర్యలు తీసుకోవాలని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటి వరకు వైద్య బృందాలకు సహకరింపమని ఒవైసి సోదరులు ముస్లిం సోదరులకు పిలుపు ఇవ్వక పోవడం గమనార్హం.

 

భోజనాలు పెట్టిన వ్యక్తికి కరోనా.. కాలనీ వాసులకు ఆందోళన..!


దుబాయ్‌ నుంచి వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆతని తల్లి దశదిన కర్మ సందర్భంగా మార్చి 20న తమ కాలనీ వాసులందరికీ భోజనం పెట్టాడు. దాదాపు 1500 మంది ఇందులో పాల్గొన్నారు. ఆ తర్వాత అతడితో పాటు అతడి కుటుంబంలోని మరో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.

దుబాయ్‌లో సురేశ్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వ్యక్తి తల్లి గత నెలలో మరణించడంతో గత నెల 17న తన సొంత గ్రామం మొరేనాకు తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులకు భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అతడితో పాటు, అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్‌ 2న నిర్ధారణ అయింది.

అతడితో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో వారిలో10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతడు దుబాయ్‌ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్‌ సోకిందని వైద్యులు తెలిపారు. అతడు ఉంటోన్న కాలనీ వాసులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు: కేంద్రం


దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది పరిరక్షణకు కేంద్రం నడుం బిగించింది. అనేక ప్రాంతాల్లో వైద్యులపై దాడులు జరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకమీదట వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠినచర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. తబ్లిగీ జమాత్ కారణంగా రెండ్రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

ఈ 647 కేసులను 14 రాష్ట్రాల్లో గుర్తించామని పేర్కొంది. 960 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య ప్రోటోకాల్ పూర్తయ్యాకే వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తబ్లీగీ జమాత్ లు వారికి వైద్యం చేస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బందితో దురుసుగా ప్రవరించడం, కరోనా వైరస్ వ్యాప్తి చెందే చర్యలకు పూనుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యూపీలో వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో జమాత్ సభ్యుల ఇళ్ళకు వెళ్లిన వైద్య సిబ్బందికి చేదు అనుభావాలే ఎదురయ్యాయి. దుర్బాషలాడటం, దాడికి యత్నించడం వంటి సంఘటనలు ఆంద్రప్రదేశ్ లోను చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్రం ఏ చర్యలకు పూనుకుంది.

కరోనా పోరులో ప్రజాఐక్యత చాటుదాం..!

Kcr

 

కరోనాపై పోరులో  ప్రజాఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిముషాలపాటు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. మానవాళి మనుగడకు సవాల్ గా మారిన కరోనాపై  చేస్తోన్న మహా పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

గత నెల 27 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 59 ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే 75 మందిలో వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ వచ్చిన బాధితుల సంఖ్య 229కి చేరుకుంది. మహమ్మారి కోరలకు చిక్కి శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 11కు పెరిగింది.ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌తో 186 మంది చికిత్స పొందుతున్నారు.

తబ్లిఘీ మర్కజ్‌ ఆర్ధిక మూలాలపై కేంద్రం దర్యాప్తు


నిజాముద్దీన్ లోని తబ్లిఘీ మర్కజ్‌లో జరిగిన సదస్సుతో అదుపులోకి వస్తున్నది అనుకున్న కరోనా వైరస్ మహమ్మారి తిరిగి పడగలెట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ ఆర్ధిక మూలాలపై కన్నేసింది. అందుకై కేంద్ర దర్యాప్తు సంస్థ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది.

ఈ సంస్థకు వెల్లువలా నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయన్న దానిపై ఈ సంస్థలు ఇప్పటికే లోతైన దర్యాప్తును ప్రారంభించాయి. గల్ఫ్ దేశాల నుండే ఎక్కువగా నిధులు సమకూరుతున్నట్లు అధికారులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
అంతేకాకుండా తబ్లిఘీ చీఫ్ మౌలానాకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తాఖీదులు పంపించారు. ఆర్థిక మూలాలపై కూడా ఓ ప్రశ్నల జాబితాను రూపొందించి మౌలానాకు సంధించారు.

ఆ ప్రశ్నావళిలోనే ఆ సంస్థ పూర్తి చిరునామాతో పాటు, కార్యవర్గ సభ్యుల పూర్తి వివరాలను కూడా పోలీసులు పొందుపరిచారు.

వీటితో పాటు గత మూడేళ్లుగా ఆ సంస్థ దాఖలు చేసిన ఆదాయపన్ను వివరాలు, పాన్ కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్లను, బ్యాంకు స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు కోరారు.

జనవరి 1 వరకు ఆ సంస్థ నిర్వహించిన సమావేశాల వివరాలు, ఆ సంస్థ ప్రాంగణం వివరాలు, ఆ ప్రాంగణంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లపై, ఆ సంస్థ సభ్యులు మాట్లాడిన ఆడియో, వీడియోలతో పాటు మార్చి 12 తర్వాత వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధుల వివరాలను తెలపాలని కేంద్ర దర్యాప్తు బృందాలు ప్రశ్నావళిలో కోరినట్లు చెబుతున్నారు.

తబ్లిఘీ తక్లీఫ్ సంస్థ జరిపిన సదస్సు వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో ఈ సంస్థ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో మార్చి 13- 15 మధ్య జరిగిన సమ్మేళనంలో హాజరైన వారి కోసం కేంద్రం దేశమంతటా జల్లెడ పడుతోంది.

ఇప్పటి దాకా దీనికి హాజరైన సభ్యులతో పాటు వారితో కలిసి తిరిగిన, వారు కాంటాక్ట్ చేసిన సుమారు తొమ్మిది వేల పైచిలుకు మందిని క్వారంటైన్‌లోకి పంపినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిలో 1306 మంది విదేశీయులే కావడం విశేషం.

30 ఏండ్ల కనిష్ఠానికి ఆర్థిక వృద్ధిరేటు


ఇప్పటికే గత ఆరు త్రైమాసికాల నుంచి మందగమన దశలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు లాక్‌డౌన్‌ దెబ్బ శరాఘాతంగా మారనుంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన (1991) తర్వాత అతితక్కువ వృద్ధిరేటు ఈ ఏడాదే నమోదు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి పతనమవుతుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ అభిప్రాయపడింది.

ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.1 శాతంగా నమోదవుతుందని ‘ఫిచ్‌’ గతంలో అంచనా వేసింది. కానీ ఓవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం కొనసాగుతుండటం, మరోవైపు కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తమ అంచనాను కుదిస్తున్నామని, ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 2 శాతంలోపే ఉండవచ్చని ‘ఫిచ్‌’ తాజాగా వెల్లడించింది.

‘కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇటీవల చైనాలో పలు పరిశ్రమలు మూతపడటంతో భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలకు ముడిసరుకులు, విడిభాగాల సరఫరాలు ఆగిపోయాయి. ప్రస్తుతం చైనాలోని వివిధ పరిశ్రమల్లో మళ్లీ పనులు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతమవడంతో ఆ ప్రభావం భారత్‌ ఎగుమతులను, కొనుగోలు శక్తిని దెబ్బతీసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధిరేటు 4 శాతానికి క్షీణిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అభిప్రాయపడింది. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏడీబీ ఈ అంచనా వేసింది. అయితే స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉండటంతో 2021-22లో భారత వృద్ధిరేటు పుంజుకొంటుందని ఏడీబీ తన ‘ఆసియా డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌’లో పేర్కొన్నది.

గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత జీడీపీ వృద్ధిరేటు 5 శాతంగా నమోదవుతుందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్వో) అంచనా వేసింది. ‘ప్రస్తుతం మనం అసాధారణ సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కానీ భారత స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు బలంగా పుంజుకొంటుందని మేము భావిస్తున్నాం’ అని ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త యసుయుకీ సవాడ తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు భారత్‌ సమర్థంగా పోరాడుతున్నప్పటికీ దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగి దాదాపు 9 శాతానికి చేరింది. గత 43 నెలల్లో ఇదే అత్యధికమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. దేశ నిరుద్యోగరేటు గత నెలలో 8.74 శాతానికి చేరిందని, డీమానిటైజేషన్‌ (పెద్దనోట్ల చెలామణి రద్దు) తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది.

లాక్ డౌన్ ఎత్తివేస్తారా, పోడిగిస్తారా?

ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు, మరోవైపు కోవిడ్‌ మృతుల సంఖ్య ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న లాక్‌ డౌన్‌ ఎత్తివేసే సాహసం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా..? అనేది కోట్లాది మందిని వెంటాడుతున్న ప్రశ్న.

దింతో ఏప్రిల్‌ 15న లాక్‌ డౌన్‌ ను ఎత్తివేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడంలేదు. లాక్‌ డౌన్‌ ను మరికొన్ని నెలల పాటు పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగినా దానిని కేంద్ర కొట్టిపారేసిన విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) భారత్‌ లో లాక్‌ డౌన్‌, ప్రస్తుత పరిస్థితులపై ఓ రిపోర్టుపై వెలువరించింది.

బీసీజీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ‘దేశంలో లాక్‌ డౌన్‌ ను జూన్‌ నాలుగో వారం వరకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోతే సెప్టెంబర్‌ వరకు కొనసాగినా అశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌ డౌన్‌ ను ప్రకటించడం కన్నా.. దానిని ఎత్తివేయడం చాలా కష్టతరమైన విషయం. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ లో ఇది మరింత కఠినం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా ఏప్రిల్‌ 15న లాక్‌ డౌన్‌ ను ఎత్తివేస్తారని అనుకోవడం లేదు. లాక్‌ డౌన్‌ ను ఎత్తివేసిన తరువాత వైరస్‌ ను అదుపుచేయడం భారత్‌ వైద్యులకు అంత సులువైనది కాదు. వైరస్‌ వ్యాప్తి తగ్గకముందే లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బీసీజీ తన నివేదికలో పేర్కొంది

దేశంలో మార్చి 24న దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌ డౌన్‌ ను విధించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.

మాస్టర్ లో గ్యాంగ్ స్టర్ గా విజయ్


తమిళ దళపతి విజయ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విజయ్ ఫాలోయింగ్ బాగా పెరుగుతూ ఉంది. గత ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల అయిన బిగిల్ (తెలుగులోవిజిల్ ) భారీ విజయం దక్కించుకొంది. కేవలం ఇండియా లోనే 200 కోట్లు వసూళ్లు సాధించి సినీ వర్గాలను అబ్బురపరిచింది. ప్రస్తుతం విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో `మాస్టర్ ` మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావాల్సి వుంది. కానీ కరోనా వైరస్ కారణంగా మాస్టర్ చిత్రం వాయిదా పడింది.

కాగా ఈ చిత్రంలో విజయ్ రెండు విభిన్న పాత్రల్ని పోషిస్తున్నాడు. అందులో ఒకటి కాలేజీ ప్రొఫెసర్ కాగా రెండోది గ్యాంగ్ స్టర్ పాత్ర అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ గ్యాంగ్ స్టర్ పాత్ర పేరు భవాని అని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ భవాని పాత్ర సినిమాలో చాలా ఇంపాక్ట్ చూపుతుంది అంటున్నారు . ఇక హీరో విజయ్ కి విలన్ గా నటిస్తున్న (హీరో) విజయ్ సేతుపతి మధ్య గ్యాంగ్ వార్ ఓ రేంజ్ లో ఉంటుందని వారిద్దరి మధ్య వచ్చే దృశ్యాలు చాల ఎక్సయిటింగ్ ఉంటాయి అని అంటున్నారు. జావియర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

పాట పాడతా పైసలు ఇవ్వండి అంటున్న ‘బాలు’


కరోనా వైరస్ భాదితులు యెంత మంది ఉన్నారో ఇంకా అంతుపట్టడం లేదు. కరోనా వల్ల ప్రత్యక్షంగా , పరోక్షంగా లెక్కకు మిక్కిలిగా జనం ఇబ్బందులు పడుతున్నారు ఇంకా చెప్పాలంటే నరకం చూస్తున్నారు నిలువ నీడకు నోచు కొక , పని పాటా లేక అనేక మంది అల్లాడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు . వారిలో సినిమా రంగానికి చెందిన వారు కూడా వున్నారు అలా కరోనా భాదితులను ఆదుకొనే క్రతువులో తాను కూడా భాగస్వామి నవుతానంటున్నాడు. మధుర గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం.

గాన గంధర్వుడు ఎస్ పీ బాలు గారికి ఎంతో మంది అభిమాను లున్నారు వారిలో అనేక మంది ఆయన్ని పేస్ బుక్ లో కూడా ఫాలో అవుతారు. అలాంటి వారిని తాను చేయబోయే బృహత్ కార్యానికి వినియోగించు కోవాలన్నదే బాలు గారి వాంఛ. ఆ క్రమంలో బాలు గారు స్థాపించిన SPB ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కి విరాళాలు సేకరించ సంకల్పించారు. ఈ ట్రస్ట్ కి విరాళాలు ఇవ్వదలుచుకొన్న వారు 100 రూపాయల నుంచి యెంత మొత్తాన్ని అయినా విరాళంగా ఇవ్వవచ్చు …అలా ఇచ్చిన వారికి ప్రతిఫలంగా ఎస్ పీ గారు వారు కోరిన ఒక పాట పాడతారట …అలా వినూత్న పద్దతిలో తన సామర్ధ్యం కొద్దీ విరాళాలు సేకరించి కరోనా భాదిత పేదలకు ఇవ్వాలన్నది బాలు గారి సంకల్పం .

ప్రాణాంతక వైరస్ మీద ఎపుడో సినిమా తీసేవాడిని


దర్శక మేధావి గా తన సినీ ప్రస్థానం ప్రారంభించి చాలా షార్ట్ టైములో అత్యంత పాపులర్ ఫిగర్ అయ్యాడు.తన పేరునే ఒక బ్రాండ్ గా మార్చు కొన్నాడు.సినిమా పరంగా ఎన్నో ప్రయోగాలు చేసాడు. సక్సెస్ లో పీక్స్ కి వెళ్ళాడు. మళ్ళీ స్వయం కృతాపరాధం తో డౌన్ ఫాల్ అయ్యాడు. ఇపుడు వ్యంగ్య కామెంట్స్ చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. మధ్య మధ్యలో సినిమాలు కూడా తెస్తున్నాడు. అయితే వాటిలో మునుపటి ప్రతిభ కనపడటం లేదు. అందుకే వాటికి లేనిపోని వివాదాలు జోడించి విడుదల చేస్తున్నాడు.

ఇంతకీ ఎవరా మహానుభావుడు అనుకొంటున్నారా ..? ఇంకెవరు వివాదాల బ్రహ్మ రామ్ గోపాల్ వర్మ.

ప్రస్తుతం ప్రేక్షకుల చేత రూత్ లెస్ ( క్రూర మైన ) డైరెక్టర్ గా పిలిపించుకొంటున్న రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పై తాను స్వయంగా రాసి, స్వరపరిచి, పాడిన సాంగ్ ప్రోమో విడుదల చేసి భయపెట్టడం జరిగింది. కాగా నేడు ఆయన కరోనా పై మరోబాంబు పేల్చాడు ( ట్వీట్ చేశాడు ). నిజానికి 2018లో కరోనా లాంటి వైరస్ పై ఓ మూవీ తీయడానికి ఆయన సిద్దమయ్యాడట , తనతో గతంలో `సర్కార్ `, ` 26/11 అటాక్స్` వంటి చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ పరాగ్ సాంగ్వి ఈ చిత్రాన్నీ ప్రొడ్యూస్ చేయాలను కోవడం కూడా జరిగింది అన్నాడు . దానికి సంబంచిన లింక్ కూడిన ట్విట్టర్ లో జత చేసాడు.

ఎబోలా వంటి వైరస్ లు ముంబై లాంటి జనసాంద్రత అధికంగా గల ప్రాంతం లో విజృంభిస్తే ఎలా ఉంటుందో చెప్పే విధంగా ఆ సినిమా తీయాలని అనుకొన్నాను. దీనికి ‘వైరస్’ అని టైటిల్ కూడా నిర్ణయించానని ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు .

ఉద్యోగులను హెచ్చరించిన ఎస్‌బీఐ..!


కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూడా ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కార్యకలాపాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యోగులు కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని బ్యాంకు తీవ్రంగా పరిగణించింది. దానికి సంబంధించి ఉద్యోగులను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజూవారీ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలనుకుంటున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్ని స్కరిళ్ల జనరల్‌ మేనేజర్లకు రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ హెచ్చరికలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులకు సేవాలందించడం కోసం ఎస్.బి.ఐ ఉద్యోగులు సిద్ధంగానే ఉంటారని ఉద్యోగుల సంగం నాయకులు చెబుతున్నారు.

కొత్త దర్శకుడిని లైన్లో పెట్టిన అనుపమ!


హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రూట్ మార్చింది. ఇప్పటివరకు అనుపమ పక్కింటి అమ్మాయి, గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. తాజాగా అమ్మడు లేడి ఓరియెంటేడ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుపమ ఇటీవల నటించిన ‘రాక్షసుడు’ మూవీలో టాలీవుడ్లో భారీ విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనుకు జోడీగా నటించి అభిమానులు అలరించింది. ఈ మూవీ విజయంతో టాలీవుడ్లో విజయాల అనుపమ విజయాల బాటపట్టింది.

అనుపమతో లేడి ఓరియెంటేడ్ మూవీ తెరకెక్కించేందుకు కొత్త దర్శకుడు హనుమాన్ చౌదరి సిద్ధమయ్యాడు. డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న హనుమాన్ చౌదరి కొత్త మూవీలో దర్శకుడిగా మారనున్నాడు. ఈ మూవీ కథను అనుపమ విన్పించగా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తోటి నటీమణులు పలు లేడిఓరింయేటేడ్ మూవీ నటించి సత్తా చాటారు. తాజాగా అనుపమ వంతు వచ్చింది. తెలుగు, మలయాళ సినిమాల్లో పక్కంటి అమ్మాయి, గ్లామర్ పాత్రల్లో నటించిన అనుపమ లేడి ఓరియేంటేడ్ మూవీలో ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.

కురచ దుస్తుల్లో కూతురు.. తండ్రి ఏం చేశాడంటే!


బాలీవుడ్ నటి ప్రియాంక చొప్రాకు కుర్రకారులో భారీ క్రేజ్ ఉంది. ఈ భామ బాలీవుడ్లో రాణిస్తూనే హాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. హాలీవుడ్లోనూ ప్రియాంక నటించిన సినిమాలు భారీ హిట్టవడంతో గ్లోబల్ స్టార్ గా మారింది. ఇదంతా అందరికీ తెల్సిందే.. అయితే ప్రియాం చొప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రితో గతంలో జరిగిన గొడవ గురించి బయటపెట్టింది. ప్రియాంక ఎలాంటి దాపరికం లేకుండా ప్రియాంక తన తండ్రితో గొడవపడిన విషయాన్ని బయటపెట్టే అందరూ అవాక్కయ్యేలా చేసింది.

ప్రియాంకా చోప్రాకు తన తండ్రి అశోక్ చోప్రాతో మంచి అనుబంధం ఉంది. ప్రియాంక తన చేతిపై ‘డాడీస్ లిటిల్ గర్ల్’ అని టాటూ కూడా ఉంటుంది. అంతా వీరిమధ్య సన్నిహిత్యం ఉంటుంది. తన డాడీయే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ప్రియాంక ఎప్పుడూ చెబుతోంది. అయితే ఓ విషయంలో తన తండ్రితో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. తనకు 16ఏళ్ళ వయస్సు ఉన్నపుడు ఓసారి అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చినట్లు తెలిపింది. అప్పుడు తన బట్టలను చూసి తన తండ్రి షాక్ అయినట్లు చెప్పింది.

అప్పుడు తాను చాలా కురచైన బిగుతూ దుస్తులు ధరించినట్లు ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే అక్కడున్న చాలామంది అబ్బాయిలు తననే చూస్తుండిపోవడంతో ఆయన సహించలేకపోయారని చెప్పింది. ఇలాంటి దుస్తులు వేసుకున్నందుకు తనను మందలించినట్లు చెప్పింది. ఈ బట్టల విషయంలో మా ఇద్దరికీ చాలాసేపు గొడవ జరిగిందని ప్రియాంక గుర్తు చేసుకుంది. అయితే ప్రియాంక తండ్రి అశోక్ 2013లో కాలేయ కేన్స‌ర్ కారణంగా మృతిచెందారు. కాగా ప్ర‌స్తుతం ప్రియాంక త‌న భ‌ర్త నిక్ జొనాస్‌తో క‌లిసి లాస్ ఏంజెలెస్‌లో ఉంటోంది. అప్పుడ‌ప్పుడు చుట్ట‌పు చూపుగా భార‌త్‌కు వ‌స్తుంటుంది.